రామాయణం
రంగనాథ రామాయణం - వర్ణనలు
ప్రస్తావన:
గోనబుద్ధారెడ్డి ద్వారా "రంగనాథ రామాయణం" పేరిట రామాయణం, 1300-1310 మధ్య వ్రాయబడినది. ఈ కావ్యం మొత్తం ద్విపద ఛందస్సులో ఉన్నది. ఈ గుటిలో, https://archive.org/details/in.ernet.dli.2015.329074/ PDF రూపంలో పుస్తకం దొరుకుతుంది.ఒకప్పుడు కవిత్రయం వ్రాసిన మహాభారతం, పోతన భాగవతం, రంగనాథ రామాయణం బట్టీయం వేయించేవారట. రంగనాథ రామాయణం మొత్తం ద్విపద ఛందస్సులోనే ఉన్నా కూడా, కవి ఏదైనా విషయం వర్ణన చేసే సమయంలో అంత్య ప్రాసతో, ఒక తూగుతో 4-10 పాదాలు ఉండటం తెలుసుకున్నాను. ఇవి, రకరకాల ఛందస్సులు వాడి, ఏదైనా కావ్యం నడిపించే క్రమంలో వచ్చే సీసపద్యాలుగా అనిపించాయి. వాటిని ఒకచోట కూర్చితే వీలున్నప్పుడు ఆ వర్ణనలను మరలమరలా చదువుకోవచ్చుననే ఆలోచన వచ్చింది.
ముందుగా సుందరాకాండతో మొదలు పెడుతున్నాను. వరుసగా బాలకాండ నుంచి చదవటం మొదలు పెట్టక పోయినా, ఎప్పటికయినా పూర్తిగా చదవాలనే కోరిక ఉన్నది. ఎవరైనా తప్పులుంటే సరిచేస్తారనే ఆశతో, నాకు అర్ధమైన రీతిలో, నిఘంటువు సహాయంతో, భావం కూడా వ్రాస్తున్నాను.
రంగనాథ రామాయణం:
- బాల కాండ (2477)
- అయోధ్యకాండ (1765)
- 1-18: శ్రీరాముని సద్గుణ వర్ణన
- 200-211: దశరథుడు కైక అలుక తీర్చుట
- 251-260: కైకేయి నిష్టూరములు
- 275-284: దశరథుడు కైకను బ్రతిమాలుట
- 444-459: లక్ష్మణుని కోపము
- 497-509 - శ్రీరాముడు కౌసల్యను ఊరడించుట
- 592-609 - సీత మాటలు
- 890-903 - అయోధ్య ప్రజల మనస్థితి
- 1369-1380 - భరతుని శోకము
- 1499-1508 - భరతుడు తల్లులను పరిచయం చేయుట
- 1516-1531: చిత్రకూట పర్వత వర్ణన
- 1572-1598: భరతుడిని శ్రీరాముడు క్షేమము అడుగుట
- అరణ్యకాండ (1524)
- 161-174: శ్రీరాముని అరణ్యవాసము
- 200-206: అగస్త్యుని ఆశ్రమము
- 241-252: హేమంత ఋతువు వర్ణన
- 719-738: శూర్పణఖ ద్వారా శ్రీరాముల వర్ణన
- 833-846 - మాయలేడి వర్ణన
- 939-947 - రావణాసురుని మాయా సిద్ధుని వేషము
- 953-962 - మాయా సిద్ధుని పలకరింపు
- 1029-1041 - జానకి శోకించుట
- 1064-1068 - జటాయువు హెచ్చరిక
- 1110-1119 - సీత ఆభరణములు ఋష్యమూక పర్వతం మీద వేయుట
- 1125-1131 - రావణాసురుడు గొప్పలు చెప్పుకొనుట
- 1406-1418 - శబరి ప్రార్థన
- 1451-1469 - ఋష్యమూక పర్వత వర్ణన
- 1477-1489 - ఋష్యమూకమున చెట్టు వర్ణన
- కిష్కంధా కాండ (1286)
- 20-25: ఋష్యమూక పర్వతప్రాంతం చూసి శ్రీరాముని భావనలు
- 26-32: వసంతకాల వర్ణన
- 33-41: శ్రీరాముడు సీత గురించి బాధ పడుట
- 467-478: వాలి సుగ్రీవుల పోరు
- 688-725: వర్షాకాల వర్ణన
- 726-733: శరత్కాల ఆగమనం
- 1058-1065 - కపి వీరులు విచారముతో ప్రాయోపవేశము చేయపూనుట
- సుందరాకాండ (1127)
- 5-13: హనుమంతుడు లంకను చూచుట
- 64-68: హనుమంతుడు లంకలో సీతను వెదకుట - 1
- 69-76: హనుమంతుడు లంకలో సీతను వెదకుట - 2
- 80-87: హనుమంతుడు లంకలో సీతను వెదకుట - 3
- 89-97 : చంద్రుని వర్ణన
- 120-128: నిద్రిస్తున్న రావణాసురుని వర్ణన
- 193-203: హనుమంతుని విచారము
- 213-218: అశోక వనంలో సీత
- 309-314: సీతాదేవి తృణీకరణ - 1
- 315-320: సీతాదేవి తృణీకరణ - 2
- 361-367: మండోదరి రావణుడికి నీతిబోధ చేయుట
- 406-417 - త్రిజట స్వప్నము
- 532-537: హనుమంతుడు సీతతో శ్రీరామలక్ష్మణుల క్షేమము తెల్పుట
- 607-618 - హనుమంతుడు అశోక వనాన్ని చెఱచుట
- 653-665: హనుమంతుడు అశోకవనములో రాక్షసులను చంపుట
- 936-952: హనుమంతుడు లంకను కాల్చుట
- యుద్ధకాండ (8818)
Comments
Post a Comment