532-537 - హనుమంతుడు సీతతో శ్రీరామలక్ష్మణుల క్షేమము దెల్పుట - రంగనాథ రామాయణం - ద్విపద కావ్యం

సందర్భం: హనుమంతుడు సీతతో శ్రీరామలక్ష్మణుల క్షేముము తెల్పుట.

సుందరాకాండ: #532-#537

వివమ్మ నీప్రాణవిభుని సేమంబు - నినుఁ బాసినది మొదల్నిత్య వేదనల
నేపైఁ బవళించు నిద్ర యెఱుంగఁ - డోలి మాంసాహార మొల్లఁ డెన్నఁడును 
వాసిమై దండకానములో నిన్ను - మోపోవుట లెంచు; మోమరవాంచు ;
నిట్టూర్పు నిగుడించు; నించుఁ గన్నీరు; - నెట్టన మూర్ఛిల్లు నేలపైఁ ద్రెళ్లుఁ ;
దెలివిమై లేచు; నల్దిక్కులు చూచు; - లఁకు నివ్వెఱగందుఁ ;ళవళంబందు ;
హాసీత హాసీత ని ప్రలాపించు - నాసుమిత్రాపుత్రుఁ ది చూచి వగచుఁ

భావం: వినవమ్మా! నీ ప్రాణవిభుడు, నిన్ను పోగొట్టుకున్నప్పటి నుండి నిత్యము వేదనతో నేలపై పడుకుంటున్నాడు, కానీ నిద్ర ఎరుగుడు. మాంసాహారము తినటంలేదు. ఆనాడు దండకారణ్యంలో నిన్ను మోసపోయినది గుర్తుచేసుకొని, రక్షించ వలసినదని అనుకుంటాడు. నిట్టూర్పులు విడుస్తూ, కన్నీరు నింపుకుంటాడు. మూర్ఛపోయి, క్రింద పడిపోతుంటాడు. తెలివి తెచ్చుకొని లేచి, నాలుగువైపులా చూసి, నివ్వెరపోతుంటాడు. కలత చెందుతాడు. "హా! సీతా! హా! సీతా!" అంటూ పలవరిస్తుంటాడు. అదంతా చూస్తూ లక్ష్ముణుడు బాధపడుతుంటాడు.

--
ఓము = రక్షించు
ఎట్టన = ఏదో విధంగా
ప్రలాపించు = పలవరించు

--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php

Comments