Posts

పోతన భాగవతంలో భారత వర్షం

పోతన ( 1450 - 1510) వ్రాసిన ఆంధ్రమహాభాగవతంలో భారతవర్షం యొక్క భౌగోళిక వివరాలు తెలియజేసాడు. పంచమ స్కంధంలోని ఉత్తరభాగంలో ఈ వివరాలు ఉన్నవి. మలయపర్వతము వంటి రకరాకాల పర్వతాలు, చంద్రవటి వంటి నదులు (తూర్పునకు ప్రవహించేవి, నర్మద వంటి నదాలు (పశ్చిమాని ప్రవహించేవి), వీటిలో పుట్టిపెరిగిన మనుషులు ఉత్తమగతులు చెందుతారు (5.2-55) ".....మలయపర్వతంబును..<<>>..రామగిరియును నాదిగాఁ గల పుణ్య పర్వతంబు లనేకంబులు గలవా పర్వతపుత్రిక లైన చంద్రవటయు, దామ్రపర్ణియు,.. <<>> ..విశ్వయు నను నీ మహానదులును,నర్మద,.. <<>> ..యను నదంబులును నైన మహా ప్రవాహంబు లీ భారతవర్షంబునఁ గల; వందు సుస్నాతులైన మానవులు ముక్తిం జెందుదురు;మఱియు నీ భారత వర్షంబున జన్మించిన పురుషులు శుక్ల లోహిత కృష్ణవర్ణ రూపంబు లగు త్రివిధ కర్మంబులంజేసి క్రమంబుగ దేవ మనుష్య నరక గతులను త్రివిధ గతులం బొందుదురు; వినుము; రాగద్వేషాది శూన్యుండు, నవాఙ్మానసగోచరుండు, ననాధారుండు నగు శ్రీవాసుదేవమూర్తి యందుఁ జిత్తంబు నిలిపి భక్తియోగంబున నారాధించెడు మహాత్ముల విద్యాగ్రంథి దహనంబు గావించుట జేసి పరమ భాగవతోత్తములు పొందెడు నుత్తమగతిం జెందుదురు; క

ఎక్కడదీ పద్యం - జయ జయ దానవదారణకారణ?

ఆదిత్య 369 సినిమాలోని ఒక ఘట్టం. శ్రీకృష్ణదేవరాయలు పాత్ర కార్తీక పౌర్ణమి నాడు విష్ణుమూర్తి విగ్రహానికి పూజ చేస్తూ జయజయ అంటూ పద్యం గానం చేస్తుంది. ఈ పద్యం,  చారిత్రక రాయలు వ్రాసిన "ఆముక్తమాల్యద"  కావ్యంలోనిది.  క్లుప్తంగా కథ. విలుబుత్తూరు అనే ఊరిలో విష్ణుచిత్తుడు అనే గొప్ప విష్ణుభక్తుడు ఉన్నాడు. నిత్యమూ విష్ణుభక్తి పరాయణుడై ఉండేవాడు. అతడు  ఒకానొక నాడు శ్రీమహావిష్ణువును స్తుతించే సందర్భంలోనిది ఈ పద్యం.  చతుర్థాశ్వాసంలోనిది పద్యం. పూర్తి పద్యం, ఆముక్తమాల్యద - కవిరాజ విరాజితము - 4-16 జ య   జయ దానవ దా రణకారణ  శా జ్గ్రరధాంగగ దా సిధరా జ య   జయ చంద్రది నేం ద్రశతాయుత  సాం ద్రశరీరమ హా ప్రసరా జ య   జయ తామర సో దర సోదర  చా రుపదోజ్ఘిత గాం గఝరా జ య   జయ కేశవ  కే శినిషూదన  శౌ రి శరజ్జల జా క్ష హరీ పద్యం  టీకా, తాత్పర్యము  - వేదము వేంకటరాయశాస్త్రి పుస్తకం నుండి. సినిమాలోని ఘట్టము  ఇక్కడ  -- ఇదే పద్యం కాస్త మార్పుతో పెద్దన వ్రాసిన స్వారోచిషమనుసంభవం (మనుచరిత్ర) అనే కావ్యం లో ఉన్నది.  జ య   జయ దానవ దా రణకారణ  శా జ్గ్రరధాంగగ దా సిధరా జ య   జయ చంద్రది నేం ద్రశతాయుత  సాం ద్రశరీరమ హా ప్రసరా జ య   జయ త

ఎక్కడిదీ పద్యం - "మరుద్వృథా" ?

 తెనాలి రామకృష్ణ సినిమాలోని ఒక ఘట్టం. శ్రీకృష్ణదేవరాయని సభకు నరసరాజు అనే కవి వచ్చి "ఘంటం ఆపకుండా వ్రాస్తా"ననే సవాలు చేస్తాడు. అప్పుడు  ముక్కుతిమ్మన "మరు ద్వృథా" అంటూ ఒక పద్యం చదువుతాడు. ఈ పద్యం, ముక్కుతిమ్మన వ్రాసి పారిజాతాపహరణము కావ్యంలోనిది అని  ఈ మథ్యనే తెలిసింది. మూడవ ఆశ్వాసం చివరలోని పద్యం. శ్రీకృష్ణదేవరాయలుని పొగుడుతూ సాగే పద్యం.  పూర్తి పద్యం, పారిజాతాపహరణం - పంచచామరం - 3.61 మ రు ద్వృథా తటస్థ శత్రు మం డలీ గళాంతర క్ష ర న్నవాసృగాపగాభి సా రికాదృతాంబుధీ! మ రు త్పతిస్వరుక్షతిక్ర మ త్రుటత్కుభృద్వర స్ఫు ర ద్ధ్వనిప్రవృద్ధ యుద్ధ  పుం ఖితానకార్భటీ! పద్యం టీకా, తాత్పర్యము - నాగపూడి కుప్పుస్వామి పుస్తకం నుండి. సినిమాలోని ఘట్టము ఇక్కడ  -- మిత్రులు శ్రీనివాస కె. శివరాజు గారికి ధన్యవాదాలతో.

డా. మృణాళిని - ఉపన్యాసం

 జూన్ 18 2023. నేపర్విల్ (చికాగో).  డా. మృణాళిని గారు ప్రసంగించిన అంశం - "సాంప్రదాయ, ఆధునిక తెలుగు సాహిత్యంలో మహిళా రచయితలు" వారు గంటన్నర పాటు అనర్గళంగా చేసిన ప్రసంగాన్ని, పూర్తిగా వ్యాసరూపంలో వ్రాసే సాహసం చేయలేను. చేసినా న్యాయం చేయలేను. వారు ప్రస్తావించిన విషయాలను నేను నా మొబైల్ ఫోనులో వ్రాసుకున్న "బరికిన నోట్సు". గమనిక : తప్పులు నావే.  -- మొదటి రచయిత్రులు (16వ శతాబ్దం) తిమ్మక్క - సుభద్రా పరిణయం - ద్విపద కావ్యం మొల్ల - రామాయణం మోహనాంగి - మరీచి పరిణయం నాయక రాజులు (17వ శతాబ్దం) రఘునాథనాయకుడు, విజయరాఘవనాయకుడు) మధురవాణి - రంగాజమ్మ - మన్నారుదాసు విలాసం - ఉషా పరిణయం - 8 భాషల ప్రావీణ్యం - భోగపత్ని 1730+ - 18వ శతాబ్దం ముద్దు పళని - ప్రతాపసింగుని భోగపత్ని - రాధికా స్వాంతనం. బ్రిటీషు కాలంలో నిషేధం. 1950లో బెంగుళూరు నాగరత్నమ్మ చొరవ వలన ప్రకాశం పంతులు నిషేధాన్ని ఎత్తివేసారు. 1825+ - 19వ శతాబ్దం తరిగొండ వెంగమాంబ - వితంతువు - శతకాలు, యక్షగానం, దండకం ————————— 1840 - 1920 ఆడపిల్లలకు చదువులేదు. బాల్యవివాహాలు. బాల వితంతువులు. ————————— 1902 - బండారు అచ్చమాంబ - స్త్రీవిద్య భావ ——— బ

శ్రీకృష్ణదేవరాయలు - తెలుగు నాట యుద్ధాలు

Image
శ్రీకృష్ణదేవరాయలను కృతిపతిగా పొగుడుతూ ముక్కుతిమ్మన వ్రాసిన పారిజాతాపహరణము, అల్లసాని పెద్దన వ్రాసిన స్వారోచిషమనుసంభవము (మనుచరిత్ర) అనే కావ్యాల నుంచి, ఈ క్రింది పద్యాలను చూడండి.  పారిజాతాపహరణము - 1.23 ఉ దయాద్రి వేగ య త్యు ద్ధతి సాధించె,          వి ను కొండ మాటమా త్ర న   హరించెఁ గూ టము ల్సెదరంగఁ  గొం డవీ డగలించె,          బె ల్లముకొండ య చ్చె ల్లఁ జెఱిచె,  దే వరకొండ యు ద్వృ త్తి భంగము సేసె,          జ ల్లి పల్లె సమగ్ర శ క్తి డులిచెఁ,  గి నుక మీఱ ననంత గి రి క్రిందుపడఁ జేసె,          గం బంబుమెట్ట గ్ర క్క నఁ గదల్చె గ టకమును నింక ననుచు ను త్క లమహీశుఁ డ నుదినమ్మును వెఱచు నె వ్వ నికి నతఁడు రా జమాత్రుండె! శ్రీకృష్ణ రా యవిభుఁడు. బ ల నికాయము కాలిమ ట్టు ల నె యడఁచుఁ భావం: ఉదయాద్రి, వినుకొండ, కొండవీడు, బెల్లంకొండ, దేవరకొండ, జల్లిపల్లె, అనంతగిరి, కంబంబుమెట్ట వంటి వాటిని జయించిన శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడు తన దాకా వస్తాడోనని, కటకం మహారాజు అనుదినమూ చింతిస్తున్నాడు. మనుచరిత్ర - 1.37 తొ లు దొల్త నుదయాద్రి  శి లఁ   దాఁకి తీండ్రించు,       న సిలోహమున వెచ్చ నై   జనించె,  మ ఱి కొండవీ డెక్కి  మా ర్కొని నలియైన,  

చం. చదువది యెంత - 100 పద్యాలు

  చ. చదువది యెంత గల్గిన చ దు వది యెంత గల్గిన ర స జ్ఞత యించుక చాలకున్న నా చ దు వు నిరర్థకంబు ,  గుణ   సం యుతులెవ్వరు మెచ్చ రెచ్చటం బ ద నుగ మంచికూర నల పా కము చేసిననైన నందు నిం పొ ద వెడొ నుప్పు లేక రుచి   పు ట్టఁగ నేర్చు నటయ్య భాస్కరా!   1.      చదువది యెంత గల్గిన 2.      రసజ్ఞత యించుక చాలకున్నన్ 3.      ఆ చదువు నిరర్థకంబు 4.      గుణ సంయుతులెవ్వరు  5.      మెచ్చరు ఎచ్చటం 6.      పదనుగ మంచికూర  7.      నలపాకము చేసిననైనన్ 8.      అందున్ ఇంపు ఒదవెడున్  9.      ఉప్పు లేక  10.            రుచి పుట్టఁగన్  11.            ఏర్చునటయ్య  12.           భాస్కరా! అర్ధాలు : రసజ్ఞత   =   సహృదయత ;   యించుక   =  కొంచెము ;   నిరర్థకమ్ము   =  పనికిరానిది ;   గుణ  =  మంచి గుణములు ;   సంయుతులు  =  ఉన్నవారు ;   మెచ్చరు   =  మెచ్చుకోరు ;   ఎచ్చటన్   =  ఎక్కడైన ;   పదనుగ   =  చక్కగా ;   నలపాకము   =  మంచి వంటకము (నల మహారాజు చేసిన వంటకం వంటిది) ;   ఇంపు   =  చక్కగ ;   ఉప్పు   =  ఉప్పు ;   ఏర్చును  =  చక్కగా ఉండుట ;  భావం: భాస్కరా!    చదువులు ఎంత చదువుకున్నా, మానవునికి  “ రసజ్ఞత ”  అనేది   తగినట్టుగా ఉండాలి. అలా లేని

చం. సుడిగొని రామపాదములు - 100 పద్యాలు

  చ. సుడిగొని రామపాదములు  -  మొల్ల సు డి గొని రామపాదములు   సో కిన ధూళి వహించి రాయి యే ర్వ డ   ఒక కాంత యయ్యెనట ,   ప న్నుగ నీతని పాదరేణు లి య్యె డ   వడి నోడ సోక నిది   ఎ ట్లగునో యని సంశయాత్ముడై క డి గె గుహుండు రామపద కం జయుగంబు శుభంబు పెంపునన్ 1.       సుడి గొని  2.       రామపాదములు   సో కిన  3.       ధూళి వహించి రాయి  4.       యే ర్వడ   5.       ఒక కాంత యయ్యెనట ,   6.       ప న్నుగన్  7.       ఈతని పాదరేణు లి య్యెడ   వడి  8.      నోడ సోక నిది   ఎ ట్లగునో యని  9.       సంశయాత్ముడై  కడి గె  10.    గుహుండు  11.     రామపద కం జయుగంబు  12.    శుభంబు పెంపునన్ అర్ధాలు : సుడి గొని  =  గాలివాటున ;  రామపాదములు  =  శ్రీరాముని పాదములు ;   సో కిన  =  తగిలితే ;  ధూళి  =  దుమ్ము ; వహించి  =  అంటుకుని ;  రాయి  =  రాయి ;  యే ర్వడ  =  చక్కగా ;  ఒక కాంత  =  ఒక స్త్రీ వలె ;  అయ్యెనట  =  మారినది అట ;   ప న్నుగన్  =  చక్కగా ;  ఈతని  =  ఈ శ్రీరాముని ;  పాదరేణులు  =  పాదముల దుమ్ము ; ఇ య్యెడ   వడిన్  =  ఇక్కడ పడి ;  ఓడ సోకన్  =  పడవకు తాకితే ;  ఇది   ఎ ట్లగునో  =  ఇది ఎట్లా మారిపోతుందో ; అని  =  అని ;  సంశయాత్ము