బాలకాండ: 105-110 - కథా ప్రారంభము - రంగనాథ రామాయణం

 సందర్భం: శ్రీరామ కథ వ్రాయనారంభ ఘట్టం. వాల్మీకి నారదుడిని అడుగుతున్నాడు. 

బాలకాండ: 105-110

వ్వఁడు శ్రీమంతుఁ? డెవ్వఁడుశాంతుఁ - డెవ్వఁడుఘనపుణ్యఁ డెవ్వడున్నతుఁడు? 
వ్వఁడు నీతిజ్ఞుఁ? డెవ్వఁడుప్రాజ్ఞుఁ - డెవ్వఁడు దుర్దముం? డెవ్వఁ డుత్తముఁడు? 
వ్వఁడుజితకాముఁ డెవ్వఁడజేయుఁ? - డెవ్వడు నిరసూయుఁ డెవ్వఁడాఢ్యుండు ?
వ్వఁడు సువ్రతుం డెవ్వఁడుదారుఁ? - డెవ్వండుసుచరిత్రుఁ డెవ్వఁడు సముఁడు ?
వ్వనికిన్కకు నింద్రాదిసురలు - వ్వుదువ్వులనుండి లఁకుచుండుదురు ?
ట్టివాఁడిలఁబుట్టి రిగెనో? యిప్డు - పుట్టెనో? యిఁకమీదఁబుట్టనున్నాఁడొ?

భావం: (ఓ నారదా!) ఎవడు శుభప్రదుడు? ఎవడు శాంతమూర్తి? ఎవడు ఘనపుణ్యుడు? ఎవడు ఉన్నతుడు? ఎవడు నీతిపరుడు? ఎవరు ప్రాజ్ఞుడు? ఎవడు దుష్టశిక్షకుడు? ఎవడు ఉత్తముడు? ఎవడు గెలుపుకోరుకునే వాడు? ఎవడు అజేయుడు? ఎవడు అసూయ లేనివాడు? ఎవడు పూజించదగినవాడు? ఎవడు సుపుత్రుడు? ఎవడు సుచరిత్రుడు? ఎవడు సౌమ్యుడు? ఎవరి కినుక చూసి ఇంద్రుని వంటివారు కూడా దూరం నుండే భయపడతారు?  అటువండి వాడు ఈ భూమి మీద ఇంతకు పూర్వం పుట్టాడా? ఇప్పుడు పుట్టాడా? ఇక మీద పుట్టబోతున్నాడా?

-
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/

Comments