అరణ్యకాండ:161-174 - శ్రీరాముని అరణ్యవాసము - రంగనాథ రామాయణం

 సందర్భం: అరణ్యవాసములో శ్రీరాముని కార్యములు

అరణ్యకాండ:161-174

ఱియు మహాటవి మార్గంబునందు - నెసిన కడిమిపై నెఱి నేగునపుడు 
మునులకు మ్రొక్కుచు మునులున్న పుణ్య - నులకుఁ జొక్కుచు నజకహ్లార 
సులఁ దేలుచు త్కథాలాప - సుల నేలుచుఁ ల్లని గాలి 
తాలఁ బొగడుచు ణితి ఝల్లికల - జోలఁ దెగడుచు శుకమయూరాది 
ములఁ బట్టుచుఁ రి వరాహాది - మృములఁ గొట్టుచు మేఘాస్త్ర మేసి 
ములు నడపుచుఁ ముఁ జూచువారి - ములు నడపుచు రువంపు లతల 
పువ్వులు చిదుముచుఁ బొదులు తుమ్మెదల - వ్వలఁ గదుముచు భమంటఁ దాఁకు 
శైలంబు లెక్కుచు జానకి యలయ - మేలంబు దక్కుచు మృదురీతి గుహల 
మెల్లనె దార్పుచు మెలఁతకు నెక్కు - ల్లన నేర్పుచు చటి చెంచెతల 
బీముల్ మెచ్చుచు భేదింపరాని - యీముల్ చొచ్చుచు నినరశి లేని 
కోలఁ గానలఁ గుమ్మరు చట్లు - జాకి తాను లక్ష్మణుఁడు కొన్నేండ్లు 
పుణ్యతీర్థంబులు పుణ్యవాహినులు - పుణ్య తపో వనభూములఁ గలయఁ 
దిరుగుచుఁ బదియేండ్లు దీరిన పిదప - లి సుతీక్షాశ్రమునకు మఱియు 
చ్చి యమ్మనిచంద్రుద్దఁ గొన్నాళ్లు - చ్చిక నుండి రా క్షితీశ్వరుడు

భావం: ఆ మహారణ్యంలో, అత్యంత పరాక్రమము-బుద్ధితో, మునులకు మ్రొక్కుతూ, ఆ మునులున్న పుణ్య వనాలకు వెడుతూ, అక్కడి సరసులను సందర్శిస్తూ, మంచి విషయాలను తెలుసుకుంటూ, అక్కడి గాలి తెమ్మెరలను ఆస్వాదిస్తూ,  ఈల పురుగుల రణగొణ ధ్వనులను తిరస్కరిస్తూ, చిలుకలు, నెమళ్లు వంటి పక్షులను పట్టుకుంటూ, ఏనుగు, వరాహము వంటి జంతువలను సంహరిస్తూ, మేఘాస్త్రాలను ప్రయోగించి అక్కడ తపస్సులు చేసుకుంటూ తమకు ఆశ్రయమిచ్చే తపసులకు వర్షాలు కురిపిస్తూ, తీగెలను, పువ్వులను తప్పుకుంటూ, తుమ్మెదలను తప్పుకుంటూ, ఎతైన కొండలను ఎక్కుతూ, సీతాదేవి అలసిపోతే హాస్యము చేస్తూ, మెల్లగ గుహలలో సేదదీర్చుతూ, అక్కడి చెంచు వనితల పరాక్రమములను మెచ్చుకుంటూ, జొరబడలేని పొదలలో నుంచి వెడుతూ, సూర్యరశ్మి లేని లోయలు, అడవులలో తిరుగుతూ - అట్లు సీతాదేవి, శ్రీరాముడు, లక్ష్మణుడు కొన్ని ఏళ్లు పుణ్యస్థలాలు, పుణ్యనదులు, తపోభూములు తిరుగుతూ పది ఏళ్లు గడచిపోయినాయి. తరువాత తిరిగి సుతీక్షుడు అనే ముని ఆశ్రమానికి వచ్చి అక్కడ కొన్నాళ్లు మంచిగా ఉన్నారు.

--
నెఱసి = శూరుడు
నెరకొను = నిండుకొను
కడిమి = మిక్కిలి
నెఱి = అందము, విధము
రణిత = మ్రోత
ఝల్లిక = ఈల పురుగు
జోక = విధము
చెంచెత చెంచు వనిత
కుమ్మరు = సంచరించు

--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php

Comments