అయోధ్యాకాండ: 890-903 - అయోధ్య ప్రజల మనస్థితి - రంగనాథ రామాయణం
సందర్భము: అడవులకు వెడుతున్న లక్ష్మణ సహిత సీతారాములను చూసి అయోధ్య ప్రజల మనస్థితి.
అయోధ్యాకాండ: 890-903
అంత బౌరులు వృద్దు లాప్తులు మంత్రు - లింతులు పౌరులు హితులు నాశ్రితులు
వంత బ్రాహణరాజవై శ్యశూద్రులును - అంతంత నలుగడ నడలుచు వెడలి
ముందట నిరుపార్శ్వముల బిఱుందటను - సందడించుచు మది జడిగొన్న వగల
నరనాథ పుత్త్రు డెన్నఁడు గానరాఁడు - సురుచిర స్థితి నేఁడు చూత మింపారఁ
జంద్రు తేజము నవ్వఁజాలు నీరామ - చంద్రు మోములఁ జూడఁ జనుదెంచువారు
వంత బ్రాహణరాజవై శ్యశూద్రులును - అంతంత నలుగడ నడలుచు వెడలి
ముందట నిరుపార్శ్వముల బిఱుందటను - సందడించుచు మది జడిగొన్న వగల
నరనాథ పుత్త్రు డెన్నఁడు గానరాఁడు - సురుచిర స్థితి నేఁడు చూత మింపారఁ
జంద్రు తేజము నవ్వఁజాలు నీరామ - చంద్రు మోములఁ జూడఁ జనుదెంచువారు
భావం: అంత, పౌరులు, వృద్ధులు, ఆప్తులు, మంత్రులు, ఆడవారు, హితులు, ఆశ్రితులు, ప్రజలు అందరూ, నలదిక్కులా హడావిడిగా వెడలి, ముందట, అటుఇటూ, వెనుక పక్క సందడి చేస్తూ, మనసులోని బాధ పడుతూ, "శ్రీరాముడు ఇంక కనిపించడు, కళ్లారా చూసొద్దాం రండి" అంటూ చంద్రుని వంటి తేజము కల శ్రీరామచంద్రుడిని చూడటానికి వచ్చేవారు కొందరు,
కడఁగి యిక్ష్వాకుల గౌరవం బెల్ల - నడఁచెనే మంథర యని తిట్టువారు
తగవేది రఘురాముఁ దపసిగాఁ జేయ - నగు నమ్మ! కైకేయి కని దూఱువారు
దాలిమి దిగనాడి దశరథాధీశు - డాలికి వెఱచునే? యని రోయువారు
జను వెల్లఁ జెడి రామసౌమిత్రు లంత - ననదలై పోదురె? యని వేగువారు
భావం: మంథర ప్రోద్బలంతో ఇక్ష్వాకుల గౌరవం మొత్తం నడచి పోతోందే అని తిట్టువారు కొందరు, అన్యాయంగా రఘురాముడు తపసిగా చేసిందే కైకేయి అని నిందించేవారు కొందరు, దయ లేకుండా ఆ దశరథుడు భార్యకు భయపడినాడే అని అసహ్యము వెలిబుచ్చువారు కొందరు, రామలక్ష్మణులు అనాథలై పోయారే అని కొందరు
పనిగొని తమ తండ్రి పనుపునఁ గాని - పొనుపడి యిట్లేల పోదు రన్వారు
ఈ పదునాలుగేం డ్లెట్లు వీరడవి - నాపద వేగింతు ?రని పొక్కువారు
ఈ నోము నోచెనో యిమ్మహీపుత్రి - తా నంచు మదిలోనఁ దలపోయువారు
నతి మృదుగాత్రి యీయతివ భూపుత్రి - పతిఁ బాయలే దని ప్రణుతించు వారు
ఈ సుతుఁ బాయంగ నెట్లోర్చె నట్టి - కౌసల్య మది యెంత గట్టనువారు
భావం: తండ్రి ఆజ్ఞను అనుసరించి ఇలాగు పోవుట ఎందుకు అనేవారు కొందరు, అయ్యో ఈ పద్నాలుగేళ్లు వీరు అడవిలో ఆపదలు ఎలా వేగుతారో అని బాధపడువారు కొందరు, ఏ నోము నోచినదో జానకి అని మనసులో అనుకునే వారు కొందరు, అతి మృదుగాత్రి ఈ సీత, పతిని విడచి ఉండలేదు అని పొగుడువారు కొందరు, తన కొడుకును విడిచి ఉండే కౌసల్య మనసు ఎంత గట్టిదో అనేవారు కొందరు.
--
నలుగడ = నాలుగు ప్రక్కల
అడలుచు = భయపడు
పిఱుందు = వెనుక
కడగించు = ప్రోత్సహించు
తగవేది = తగవుమాలి
దూరు = నిందించు
తాలిమి = క్షమ
వెరచు = భయపడు
రోయు = నిందించు
అనద = అనాథ
పొనుపడు = వ్యర్థమగు
--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
Comments
Post a Comment