బాలకాండ: 465-472 - రావణాసురుని వరములు - రంగనాథ రామాయణం

 సందర్భము: దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి, తను ఇచ్చిన వరాల వలన విజృంభిస్తున్న రావణాసురుని గురించి బాధలు చెప్పుకున్నారు. బ్రహ్మదేవుడు వారికి రావణాసురుని వరాల గురించి తెలియజేస్తున్నాడు.

బాలకాండ: 465-472

"యరులచేఁ జావఁ సురులచేత - యఁడు గంధర్వమితిచేఁ జెడఁడు 
నీచరుల చేత గ్రాగ డెన్నఁడును - భుగ సంఘములచేఁ బొలియఁ డెన్నఁడును 
క్షులచే నీల్గఁ డాలంబులోనఁ - క్షి యూథంబుచేఁ డఁడు, వానికిని 
మిచ్చునప్పుడు వాక్రువ్వఁడయ్యె - రులఁ గావున వాఁడు రులచేఁజచ్చు 
విదంబుగా నింక వినుఁడు హిరణ్య - శిపుఁడు లోకముల్ గారించునాఁడు 
సింహరూపంబు నారాయణుండు - రియించి వాని విదారించినాఁడు 
వాఁడె వీఁడై విశ్రసునకుఁ బుట్టి - వాఁడు గావున నేఁడు నారాయణుండు 
వీని నిర్జించు నవ్విష్ణుని నభయ - దానంబు మనమింకఁ గ వేఁడవలయు"

భావం: దేవతల చేత చావడు, అసురుల చేత నశించడు, గంధర్వుల చేత పతనమవడు, పాముల చేత చావడు, యక్షల చేతిలో ఓడడు, యద్ధములో పక్షుల చేత పడిపోనివాడు - కానీ నేను వరములు ఇచ్చినప్పుడు మనుషుల గురించిన వరము లేదు కావున మనషుల ద్వారా చావు తప్పదు. ఇంక వివరంగా వినండి, హిరణ్యకశిపుడు లోకాలను బాధించినపుడు, నారాయణుడు నరసింహ రూపము ధరించి వానిని చీల్చినాడు. ఆ హిరణ్యకశిపుడే, ఇప్పుడు రావణాసురడై పుట్టినాడు. కావున, నేడు నారాయణుడు వీనిని చంపును. ఆ విష్ణువు అభయము గురించి మనము ప్రార్థించుదాము.

--

పొలియు = చెడు, చచ్చు
ఆలము = యుద్ధము
వాక్రుచ్చు = చెప్పు
కారించు = బాధించు
విదారించు = చీల్చు

--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/

Comments