అరణ్యకాండ: 200-206 - అగస్త్యుని ఆశ్రమము - రంగనాథ రామాయణం
సందర్భము: శ్రీరాముడు సుతీక్షణడును ముని ద్వారా, అగస్త్యుడు వాతాపి, ఇల్వలుండు అనే రాక్షసులను అంతము చేసిన చరిత్ర తెలుసుకొని, ఆ అగస్త్యుని ఆశ్రమము చూడాలని అనుకున్నాడు. ఆ అగస్త్యుని ఆశ్రమ ప్రదేశం మనోహరంగా ఉన్నది.
అరణ్యకాండ: 200-206
మఱునాఁడు మునిపతి మార్గంబుఁజూప - తెఱఁ గొప్పఁ బూజించి దీవింప వెడలి
చనిచని యొక్క యోజన ముత్తరించి - పనస దాడిమ శమీ బదరికాశ్వత్థ
పాల ప్రియాళు రసాల తమాల - మాలూర ఖర్జూర మందార తరుల
తరులఁ గ్రిక్కిరిసిన తావి క్రొవ్విరుల - విరుల తేనియ లాని వెలయు తుమ్మెదల
మెదలు నింపగునట్టి మేటి పూపొదలఁ - బొదలలోఁ బగలేక పొదలు మృగముల
కలకంఠకల కుహూకార నాదములు - విలసిల్లు బహుశాస్త్ర వేదనాదములఁ
జెలఁగుచుఁ గిన్నర సిద్ధగానముల - కలిమి దీపించు నగస్త్యునా శ్రమము

భావం: మరునాడు, సుతీక్షణుని ద్వారా అగస్త్యుని ఆశ్రమానికి మార్గము తెలుసుకుని వెళ్లారు. వెళ్లగా వెళ్లగా, ఒక యోజన దురం నంచే పనస, యాలకు, జమ్మి, రావి మొదలైన చెట్ల నున్న తేనెలు త్రాగుతున్న తుమ్మెదలు, పొదలలో తిరుగాడుతున్న జంతువులు, పక్షుల కూతలు, బహుశాస్త్ర, వేద పఠనాలతో, పాటలతో ఆ ప్రదేశం మారుమ్రోగుతోంది.
--
ఉత్తరించు = దాటు
దాడిమ = దానిమ్మ, ఏలకు
శమీ = జమ్మి
పొదలు = పెరుగు, వర్ధిల్లు
--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php
Comments
Post a Comment