కిష్కింధా కాండ: 467-478 - వాలి సుగ్రీవుల పోరు - రంగనాథ రామాయణం

సందర్భం: గజమాల ధరించిన సుగ్రీవుడు, వాలి కలసి ఒకరినొకరు నొప్పిస్తూ భయంకరమైన పోరు చేస్తున్నారు.

కిష్కింధా కాండ: 467-478

ధీరుఁడై శూరుఁడై దివిజు లుప్పొంగ - నా విజుని వైచె డరి శైలమున
రక సుగ్రీవుఁ డఁచె వాలమునఁ - ముల నొప్పించె లియుఁడై వాలి 
నఖంబుల వ్రచ్చెఁ డఁగి సుగ్రీవుఁ - డురుముష్టి నొప్పించె నుగ్రుఁడై వాలి 
యంటఁ దనియక నార్పులు నిగుడ నంకంతకు లావు డరి యిద్దఱును 
పదాపది కచాచి నఖానఖిని - చెసి ముష్టాముష్టి చెలఁగి పోరుచును 
హుమ్మని మ్రోయుచు నూర్పు లొండొండ - గ్రమ్మ సంగముల రక్తంబు లుబ్బుచును 
వాము ల్బాహులు రుస నొండొండఁ - గీలించి పెనఁగుచుఁ గినిసి తాఁకుచును 
బాయుచు డాయుచు లిమి నొండొరుల - వేయుచు ద్రోయుచు విపుల సత్త్వముల 
దూటుచు దాఁటుచుఁ దోడ్తోనఁ బగలు - చాటుచు మీటుచు సాంద్ర మర్మముల 
నిరువురు కడిమిమై నిబ్భంగిఁ బోర - సులోకనాయక సుతునకు లోగి 
ణితనూజుఁ డత్తఱిఁ జాల నొచ్చి - రువంబు దక్కి సంరభూమిఁ జిక్కి 
పెవులు దడపుచుఁ బెం పెల్లఁ బొలిసి కుదిసి భీతిల్లి దిక్కులు చూచుచుండె

భావం: వాలి పెద్ద బండరాతిని సుగ్రీవుని మీదకు విసరినాడు. సుగ్రీవుడు అదరక దానిని తన తోకతో అణచి వేసినాడు.  వాలి తన కాళ్లతో కొట్టాడు, సుగ్రీవుడు చేతి గోళ్లతో రక్కినాడు. వాలి రెండు చేతులోనూ పిడిగ్రుద్దులు చేసాడు. ఇద్దరూ రెచ్చిపోయి, కాళ్లతోనూ, జుట్లుపట్టుకొని, గోళ్లతోనూ, గుద్దులతోనూ యుద్ధము చేసారు. హుంకారములు చేస్తూ, రక్తాలు కారుతూ - తోకలతోనూ, భూజాలతోనూ పట్టుకొని, పెనుగులాడుతూ, కోపంతో కొడుతూ, తోస్తూ, తప్పించుకొంటూ ఒకరి కోపం మరొకరికి తెలిసేలా యుద్ధం చేసుకుంటున్నారు. చివరికి సుగ్రీవుడు అలసిపోయి, కూదేలయి భయముతో దిక్కులు చూస్తున్నాడు.


--
రవిజుడు = తరణి తనూజుడు = సుగ్రీవుడు
సురలోకనాయక సుతుడు = వాలి
అడరి = కలిగించి
అడచు = అణచు, నశింపచేయు
కడగి = చేసి, ప్రయత్నించి
తనియక = తనివి తీరక, తృప్తిచెందక
ఆర్పులు =
నిగుడ = వ్యాప్తిచెందు
కచ = వెంట్రుక
చెనసి = ఎదిరించి
క్రమ్మ = వెనుదిరుగు
కీలించి = పట్టుకొని
కినిసి = కినుక వహించు, కోపించు
దూటుచు = పొడుచుచు
కరువంబు = కొండ
పొలిసి = అలసి, చెడి
కుదిసి = కుదేలయి, తగ్గి

--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php

Comments