193-203 - హనుమంతుని విచారము - రంగనాథ రామాయణం - ద్విపద కావ్యం

సందర్భము: హనుమంతుడు లంకలోని వీధులు, భవనాలు, అంతఃపురాలు వెదకి, సీతాదేవి కనిపించక, ఏమి చేయాలో తోచక, పరిపరి విధాల ఆలోచనలు చేస్తున్నాడు. 

సుందరకాండ:  #193-#203

క్కట సంపాతి యాడిన మాట - నిక్కంబుగా నమ్మి నీరధి దాఁటి
యిచ్చటి కొంటిమై యే వచ్చుటెల్ల - చ్చుగా వృథయయ్యె నౌఁగాక యేమి
త్రిశులతోఁ గూడఁ దెగువమైఁ బేర్చి - త్రిశేంద్రుఁ బట్టి బాధింతు నొండేని 
చెలఁగి కీలలతోడ శిఖి నీటముంచి - యిలఁ బ్రామి ప్రభలు మాయింతు నొండేని 
కందుగా జముని గింరులతోఁ బట్టి - డెందంబుఁ బగుల దండింతు నొండేని
మొప్ప నిరృతిరాక్షసులతోఁ గూడఁ - బెలుకురఁ బట్టి నొప్పింతు నొండేని
రువలి నయ్యేడు గాడ్పులఁ బెనచి - కెలి యందంద శిక్షింతు నొండేని
లిరేగి ధనదుఁ గిన్నరులతోఁ బట్టి - చెలువేది కూల భర్జింతు నొండేని
యెయఁ బ్రమథులతో యీశానఁ బట్టి - చెసి యొండొండ శిక్షింతు నొండేని
కులంబుఁ గిరులతోఁ గుమ్మరసాలె - తిఁ ద్రిప్పి యుక్కడఁగుతు నొండేని
యీలంకదైత్యుల నీయబ్ధి ముంచి - లీమైఁ గలఁచి కాఱింతు నొండేని
యే నింత చేసిన నెల్లదేవతలు - నాతులై వచ్చి తివఁ జూపెదరు
కాకున్న రాఘవు ల్కరుణమైఁ దామె - యీకీడు వలదని యింక మాన్పెదరు

భావం: అయ్యో! సంపాతి మాట నిజమని నమ్మి, సముద్రం దాటి ఒంటరిగా ఎందుకు వచ్చానో కదా. అంతా వృథా. ఆ దేవతలతో పోరు పెట్టుకొని వారి నాయకుడైన ఇంద్రుడి ఇబ్బంది గురిచేస్తేనో, ఆ అగ్నిదేవుడిని నీట ముంచి వేస్తేనో, యముని కింకరులతో సహా గుండెలు పగలగొడితేనో, ఆ నిరృతిని రాక్షసులతో సహా నొప్పిస్తేనో, ఆ వాయుదేవుడిని కదలకుండా కట్టివేస్తేనో,  ఆ కుబేరుడిని కిన్నరులకు బాధలు కలిగిస్తేనో, భూమిని కుమ్మరి చక్రం వలెనే గిరగిరా ద్రిప్పి పడేస్తేనో, శివుడిని ప్రమథగణాలతో సహా శిక్షిస్తేనో, ఈ లంక మొత్తాన్నీ సముద్రంలో ముంచి పారేస్తేనో ఆ దేవతలే దిగి వచ్చి సీతాదేవిని చూపిస్తారేమో! కనీసం, శ్రీరాముని దుఃఖాన్ని, ప్రాణత్యాగాన్ని మానిపించెదరేమో.

[అన్ని దిక్కులు కలయ తిరిగి, దిక్కు తోచక, ఆ అష్టదిక్పాలురనూ, వారి అనుచర గణాన్నీ మాటలనుకోవడం చాల సహజంగా, సమంజసంగా ఉన్నది.]

--
ఉక్కడుగు = శక్తి ఉడుగు, చచ్చు
కుతలము = భూమి
కరువలి = వాయువు
త్రిదశ = దేవత, వేల్పు
మాయించు = మాపు, పోగొట్టు
జముడు = యముడు
నిరృతి = దిక్పాలవిశేషము

--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php

Comments