Posts

Showing posts from August, 2021

బాలకాండ: 230-239 - అయోధ్యానగర వర్ణన - రంగనాథ రామాయణం

సందర్భము: అయోధ్యా నగర వర్ణన  బాలకాండ: 230-239 ద్వా ద శయోజనా త్యా యం బగుచు -  నై దు యోజనముల  న దివెడ ల్పగుకు ని పు ణత మయునిచే  ని ర్మితంబగుచు -   నె పు డు శాత్రవ కోటి  కె దురుచుక్క గుచు  కొ లఁ ది మీఱిన భాను కు లజులకెల్ల -  కు ల రాజధానియై  కొ నియాడఁ బరఁగి స ర యువు పొంత కో స లదేశమునను -  ధ ర ణికిఁ దొడ వయో ధ్యా పురం బొప్పు ; భావం: పన్నెండు యోజనాల పొడవు, ఐదు యోజనాల వెడల్పుతో, మయుని ద్వారా నిర్మించబడి, శత్రువలకు దుర్భేద్యమైనది, ఎందరో సూర్యవంశస్థులకు రాజధానిగా పేరొంది, సరయు నది ఒడ్డున, కోసల దేశములో అయోధాపురం భూమిపై గొప్పాగా ఉన్నది.  మ ణి గోపురంబుల  మ ణితోరణముల -  మ ణి కుట్టిమంబుల   మ ణిగవాక్షములఁ  గే ళి కా గృహములఁ  గృ తక శైలముల -  బా లా  నిలంబులఁ  బ టహ నాదముల  మ హి త వారణముల  మా నితాశ్వముల -  బ హు రథ ప్రతతుల  భ ట కదంబముల  వి మ ల సౌధంబుల  వి పణి మార్గములఁ -  గ మ నీయ వనములఁ  గ మలాకరములఁ జె ఱు వుల బావులఁ  జె ఱకుదోఁటలను -  ద ఱు చైన శాలి కే దా ర వారములఁ బ రి ఘలఁ గోటలఁ  బ సిఁడి మాడువు లఁ -  గ ర మొప్ప లోక వి ఖ్యా తమై పరఁగు భావం:  మణిగోపురములతో, మణితోరణములతో, మణులు పొదగబడిన గచ్చులతో, మణులతో అలంక

బాలకాండ: 105-110 - కథా ప్రారంభము - రంగనాథ రామాయణం

 సందర్భం: శ్రీరామ కథ వ్రాయనారంభ ఘట్టం. వాల్మీకి నారదుడిని అడుగుతున్నాడు.  బాలకాండ: 105-110 ఎ వ్వఁ డు శ్రీమంతుఁ?  డె వ్వఁడుశాంతుఁ -  డె వ్వఁ డుఘనపుణ్యఁ  డె వ్వడున్నతుఁడు?  ఎ వ్వఁ డు నీతిజ్ఞుఁ?  డె వ్వఁడుప్రాజ్ఞుఁ -  డె వ్వఁ డు దుర్దముం?  డె వ్వఁ డుత్తముఁడు?  ఎ వ్వఁ డుజితకాముఁ  డె వ్వఁడజేయుఁ? -  డె వ్వ డు నిరసూయుఁ  డె వ్వఁడాఢ్యుండు ? ఎ వ్వఁ డు సువ్రతుం  డె వ్వఁడుదారుఁ? -  డె వ్వం డుసుచరిత్రుఁ  డె వ్వఁడు సముఁడు ? ఎ వ్వ నికిన్కకు  నిం ద్రాదిసురలు -  ద వ్వు దువ్వులనుండి  త లఁకుచుండుదురు ? అ ట్టి వాఁడిలఁబుట్టి  య రిగెనో? యిప్డు -  పు ట్టె నో? యిఁకమీదఁ బు ట్టనున్నాఁడొ? భావం: (ఓ నారదా!) ఎవడు శుభప్రదుడు? ఎవడు శాంతమూర్తి? ఎవడు ఘనపుణ్యుడు? ఎవడు ఉన్నతుడు? ఎవడు నీతిపరుడు? ఎవరు ప్రాజ్ఞుడు? ఎవడు దుష్టశిక్షకుడు? ఎవడు ఉత్తముడు? ఎవడు గెలుపుకోరుకునే వాడు? ఎవడు అజేయుడు? ఎవడు అసూయ లేనివాడు? ఎవడు పూజించదగినవాడు? ఎవడు సుపుత్రుడు? ఎవడు సుచరిత్రుడు? ఎవడు సౌమ్యుడు? ఎవరి కినుక చూసి ఇంద్రుని వంటివారు కూడా దూరం నుండే భయపడతారు?  అటువండి వాడు ఈ భూమి మీద ఇంతకు పూర్వం పుట్టాడా? ఇప్పుడు పుట్టాడా? ఇక మీద పుట్టబోతున్నాడా

కుమారీ శతకం - పరిచయం

నిన్న అమ్మ ద్వారా తెలిసిన విషయం. 1960-1970ల కాలం వరకూ, "కుమారీ శతకం" అనే పద్యాలు ఆడవాళ్లకు నేర్పేవారట.  ఈ శతకంలో ఆడవాళ్లు,  అత్తవారింట్లో అందునా ఉమ్మడి కుటుంబాలలో, మెసలుకునే పద్ధతి గురించిన పద్యాలు ఉన్నాయి. నలుగురు ఉన్న కుటుంబాలలో ఎలా సర్దుకు పోవాలో చెప్పే పద్యాలు ఇవి.  కోపం చేయకు, బాధ పడకు, మనసులో పెట్టుకోకు, సర్దుకుపో, మాట విను - ఇలాంటి నీతులతో నడిచే పద్యాలు.  కాలక్రమేణా ఉమ్మడి కుటుంబాలు లేకపోవడంతో, మారిన విలువలతో ఆ పద్యాలకూ కాలం చెల్లింది.  ఈ పద్యాలు వ్రాసినది పక్కి వేంకటనరసింహ కవి. క్రింది లింకులో లభిస్తున్న పుస్తకం 1932లో ముద్రించబడినది. మొదటి ముద్రణ 1869లో జరిగినదని వికీపీడియా ద్వారా తెలుస్తున్నది. అన్నీ  కంద పద్యాలు. ఇదిగో ఆ పద్యాలకు లింకు.  https://archive.org/details/SaiRealAttitudeManagement-Telugu-Devotional-Spiritual-Free-eBooks-Satakalu/SH015-KumariShatakmu మచ్చుకు కొన్ని పద్యాలు: ఆ ట ల బాటలలో నే  మా ట యు రాకుండఁ దండ్రి  మం దిరమందున్ బా టి ల్లు కాపురములో  వా ట మెఱిగి బాలతిరుగ  వ లయు కుమారీ - #2 నో రె త్తి మాటలాడకు  మా ఱాఁ డకు గోపపడిన  మ ర్యాదలలో గో రం త తప్పితి