అరణ్యకాండ: 953-962 - మాయా సిద్ధుని పలకరింపు - రంగనాథ రామాయణం

సందర్భము: మాయా సిద్ధుని వేషంలో ఉన్న రావణాసురుడు జానకిని పలకరించుట. 

అరణ్యకాండ: 953-962

యో భామ! నీవిట్టి యుగ్ర దుర్గములు - నేభంగిఁ జరియించె దిట్లొంటి నిలిచి
తివొ ?శ్రీసతివొ భాతివొ? కాకున్న - క్షితి మర్త్యసతుల కీ చెలువంబు గలదె
నీ మోము పండువెన్నెల పిండుఁ దెగడు - నీ మోవి కెంపు తానిగ్గులఁ దెగడు 
నీ మేను సౌదామినీ లతఁ గేరు - నీమాట సుధతేట నీటులఁ దేరు
నీవేణి జలద వేణికలఁ బోదరుము - నీవిలాసంబు వర్ణింప నాతరమె ?
రుణి వీకౌఁగిటఁ విలి సుఖించు - పురుషుఁడే తలపోయఁ బురుషోత్తముండు
కామిని నీపొందు లవాఁడె పూర్ణ - కాముఁ డాతఁడు నిత్యల్యాణుఁ డరయ .
నిచ్చట నీయున్కి కెంతయు వగపు - చ్చెరు వయ్యెడి బ్జాక్షి మాకు
వెలఁత నీవెవ్వరు ?నీ వేల యింత - లఁగెద విక్కానములోన నిలిచి ?
యంయు నెఱిఁగింపు నిన నాసీత - యెంయు భక్తితో నిట్లని పలికె

భావం: "ఓ భామ! నీవు ఇటువంటి భయంకరమైన అడవులలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? ఆ మన్మథుని భార్య రతీదేవివా? లక్ష్మీ దేవివా? సరస్వతివా? లేకపోతే మానవస్త్రీలకి ఇంత అందమా?  నీ ముఖము ముందర పండు వెన్నెల దిగదుడుపే. నీ ముఖము ముందర కెంపుల వెలుగు దిగదుడుపే. నీ శరీరము ముందర  బంగారు లతలు దిగదుడుపే. నీ మాటల ముందర అమృతధారలు దిగదుడుపే. నీ జుట్టు ముందర నల్లని మేఘాలు దిగదుడుపే. నీ విలాసము నేను వర్ణించగలనా? తరుణీ! నీ కౌగిలిలో సుఖించు పురుషుడే అసలైన పురుషోత్తముండు. నీ సాహచర్యము కలవాడే సంపూర్ణుడు. నీవు ఇలాంటి చోట ఉండటం మాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. నీ వెవరు? ఎందుకు ఈ అడవిలో ఉన్నావు? అంతా మాకు తెలుపుము" అనిన ఆ సీతాదేవి అత్యంత భక్తితో ఇలా అన్నది.

--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/

Comments