Posts

Showing posts from January, 2023

శ్రీకృష్ణదేవరాయలు - తెలుగు నాట యుద్ధాలు

Image
శ్రీకృష్ణదేవరాయలను కృతిపతిగా పొగుడుతూ ముక్కుతిమ్మన వ్రాసిన పారిజాతాపహరణము, అల్లసాని పెద్దన వ్రాసిన స్వారోచిషమనుసంభవము (మనుచరిత్ర) అనే కావ్యాల నుంచి, ఈ క్రింది పద్యాలను చూడండి.  పారిజాతాపహరణము - 1.23 ఉ దయాద్రి వేగ య త్యు ద్ధతి సాధించె,          వి ను కొండ మాటమా త్ర న   హరించెఁ గూ టము ల్సెదరంగఁ  గొం డవీ డగలించె,          బె ల్లముకొండ య చ్చె ల్లఁ జెఱిచె,  దే వరకొండ యు ద్వృ త్తి భంగము సేసె,          జ ల్లి పల్లె సమగ్ర శ క్తి డులిచెఁ,  గి నుక మీఱ ననంత గి రి క్రిందుపడఁ జేసె,          గం బంబుమెట్ట గ్ర క్క నఁ గదల్చె గ టకమును నింక ననుచు ను త్క లమహీశుఁ డ నుదినమ్మును వెఱచు నె వ్వ నికి నతఁడు రా జమాత్రుండె! శ్రీకృష్ణ రా యవిభుఁడు. బ ల నికాయము కాలిమ ట్టు ల నె యడఁచుఁ భావం: ఉదయాద్రి, వినుకొండ, కొండవీడు, బెల్లంకొండ, దేవరకొండ, జల్లిపల్లె, అనంతగిరి, కంబంబుమెట్ట వంటి వాటిని జయించిన శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడు తన దాకా వస్తాడోనని, కటకం మహారాజు అనుదినమూ చింతిస్తున్నాడు. మనుచరిత్ర - 1.37 తొ లు దొల్త నుదయాద్రి  శి లఁ   దాఁకి తీండ్రించు,       న సిలోహమున వెచ్చ నై   జనించె,  మ ఱి కొండవీ డెక్కి  మా ర్కొని నలియైన,