అయోధ్యాకాండ: 275 - 284 - దశరథుడు కైకను బ్రతిమాలుట - రంగనాథ రామాయణం
సందర్భము: శ్రీరాముని సద్గుణాలను తెలిపి, దశరథుడు కైకను బ్రతిమాలుట.
అయోధ్యాకాండ: 275 - 284
యిది యేలకో కైక యింకొక మాట - ముదిత చెప్పెద నిక్కముగ నీవు వినుము
కలువరేకులఁ టోలు కన్నుల వాని - మొలక నవ్వుల మోము మురిపెంబు వాని
బలువైన యాజానుబాహుల వాని - నలరాజుఁ గేరు చెల్వము గలవాని
నలరు గల్వల కాంతి నగు మేనివానిఁ - జల్లచూపులు వెదఁజల్లెడువాని
కలువరేకులఁ టోలు కన్నుల వాని - మొలక నవ్వుల మోము మురిపెంబు వాని
బలువైన యాజానుబాహుల వాని - నలరాజుఁ గేరు చెల్వము గలవాని
నలరు గల్వల కాంతి నగు మేనివానిఁ - జల్లచూపులు వెదఁజల్లెడువాని
సుధ లొల్కు తియ్యని సుద్దులవాని - బుధులకు హిత వాతఁ బూనెడు వాని
వలచి నా కెపుడు సేవలు సేయువాని - నిలువెల్ల ధర్మమై నెగడెడువాని
రాముని జిత భృగురామునిఁ గాంతి - సోముని సద్గుణస్తోముని కీర్తి
కాముని సౌందర్య కాముని శాంత - ధాముని రవి సమధామునిఁ బాసి
నిమిష మాత్రం బైననే నోర్వఁజాలఁ - గమలాక్షి నీవెఱుంగవె యిట్టివాని
నాయుతమోతము నడవుల కనుపఁ - బోయెఁ బ్రాణంబులు వోవు నాక్షణమె

భావం: ఓ కైక, మరొక మాట చెప్పెదను, విను. కలువ రేకుల వంటి కన్నుల కలవాడు, ముఖమున చిరునవ్వులతో మురిపించువాడు, ఆజానుబాహువులు కలవాడు, నలరాజును మరిపించగల అందము కలవాడు, వికసించిన కలువల వంటి కాంతి గల శరీరము కలవాడు, చల్లని చూపులు వెదజల్లువాడు, తన తియ్యని మాటలతో అమృతము కురిపించు వాడు, విద్వాంసులకు మంచి చేయువాడు, ఇష్టంతో నాకు సేవలు చేయువాడు, నిలువెల్ల ధర్మము మూర్తీభవించిన వాడు, పరశురాముని గెలిచిన వాడు, చంద్రుని వలే కాంతులు చిందువాడు, సద్గుణాల రాశి, కీర్తి కాముడు, అందగాడు, శాంత మూర్తి, సూర్యుని వంటి తేజోమూర్తి - అటువంటి రాముని విడచి నేను ఒక్క నిమిషమైనా ఉండలేను. రాముడు అడవులకు వెళ్లిన తక్షణమే నా ప్రాణాలు పోతాయి.
--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
Comments
Post a Comment