కిష్కింధా కాండ: 726-733 - శరత్కాల ఆగమనం
సందర్భము: సుగ్రీవునికి పట్టం కట్టి, శ్రీరాముడు వర్షాకాలం తరువాత శరత్ ఋతువు రాక కోసం చూస్తున్నాడు.
కిష్కింధా కాండ: 726-733
నంత వానలు వెల్చె నవనిపై నపుడు - నంతంత దివి నున్న యభ్రము ల్విరి సె
దెలివొంది కిరణము దిశె లెల్ల నిండెఁ - జెలువొంద రవి ప్రకాశించె లోకముల
ధరణి నిష్పంకమై తనరె నెంతయును - గరమొప్ప గొలఁకులఁ గమలంబు లమరె
గూలము ల్మదకరుల్ గ్రుచ్చి గోరాడె - రేలు నక్షత్రచంద్రికలు పెంపారె
వచ్చె నంచలు సరోవనికిఁ గాపురము - మెచ్చెఁ దామరతూండ్లు మెలఁత లుల్లమున
చెఱుకు రాజనమును చేనులపంట - తఱు చయ్యె వృషభయూథము రంకె వేసి.
గలక నంతయుఁ బాసి కనుపట్టె జలము - ఇలఁ దెరువరులకు నిచ్చె సౌఖ్యంబు
చదల నిర్మలములై జలదంబు లొప్పె - నదు లెల నింకి కాల్నడలయ్యె నంత

భావం: వానలు తగ్గి, ఆకాశము విరిసింది. దిక్కులన్నీ వెలుగు నిండుతూ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. బురద నేలలు ఎండిపోయి, చెరువులలో కలువలు విరుస్తున్నాయి. ఏనుగులు నీటి గుంటలలో ఆడుకుంటున్నాయి. రాత్రి పూట చంద్రుడు, నక్షత్రాలు చక్కగా కనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచో హంసలు సరోవరంలోనికి వచ్చాయి. తామర తూళ్లు, ఆడవారు మెచ్చే విధంగా ఉన్నాయి. చేలలో చెఱకు, ధాన్యము పంట గొప్పగా ఉన్నది. దున్నపోతులు బలంగా రంకెలు వేస్తున్నాయి. భూమి అందరికి సౌఖ్యము ఇస్తోంది. నీరు ప్రశాంతంగా ఉన్నది. నదులన్నీ ఇంకి పోయి, కాలి నడకకు వీలుగా ఉన్నాయి.
--
అభ్రము = ఆకాశము
కొలకులు = సరస్సులు
కూలము = గుంట
కోరాడు = కొమ్మలతో నేలను పొడిచి పైకెత్తుట
రాజనము = ధాన్యము
కలక = కలత
--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php
Comments
Post a Comment