అరణ్యకాండ: 1406-1418 - శబరి ప్రార్థన - రంగనాథ రామాయణం
సందర్భము: తన ఆశ్రమానికి వచ్చిన రామలక్ష్మణలను శబరి ప్రార్థించుట.
అరణ్యకాండ: 1406-1418
దశరథవరపుత్ర! తాటకాజైత్ర! - కుశికసంభవ యాగకుశల ప్రయోగ!
చిర ముని ధ్యేయ! శిక్షిత తాటకేయ! - పరమ గంగాతీర పాదసంచార!
పద రజోనైర్మల్య పాలితాహల్య! - విదళిత హర చండ విపుల కోదండ!
భీమ భార్గవరామ బిరుదాభిరామ! - కామిత పితృవాక్య కరణ సుశ్లోక!
ప్రకటాపరాధ విరాఢ నిరోధ! - సకల మునిత్రాణ! సత్యప్రవీణ!
ఖరదూషణాది రాక్షసశిరశ్ఛేది - మరణార్థి మారీచ మర్దినారాచ!
సీతావియోగ సూచిత మోహరాగ! - ఖ్యాత ఖగాధ్యక్ష కల్పితమోక్ష!
యలఘు విక్రమధామ! యతిపుణ్యనామ! - నెలకొని రఘురామ నినుజూడఁగంటిఁ,
బరికింప నాతపఃఫల మందఁగంటి - నరుదైన పుణ్యంబు లన్నియుఁ గంటిఁ,
గాకుత్స్థ తెరువునఁ గడుడస్సితెందుఁ - బోక మా యాశ్రమంబున నేఁడు నిలువు
అనఘాత్మ మాగురుఁ డైన మతంగ - మునిచేత నీకథమును వినియుందు;
నీ వాద్యుఁడవు సర్వనిగమవేద్యుఁడవు - గావున నిను నుతుల్ గావింపఁదరమె ?
యిది యామతంగమునీందు నాశ్రమము - విదిత తపశ్చర్య విశ్రాంతికరము

భావం: శ్రీరామా! నిన్ను చూసానంటే, అది నా తపఃఫలం వలనే చూడగలిగాను. ఇది చాలా అరుదైన పుణ్యము. నీవు చాలా అలసి ఉన్నావు, మా ఆశ్రమంలో నేడు ఆగుము. మా గురువైన మతంగ మునిద్వారా నీ కథ తెలుసుకున్నాను. నీవు అందరికీ ఆద్యుడవు. నీవు సకల వేదశాస్త్రాలందూ పూజనీయుడవు. నిన్ను వర్ణింప ఎవరికీ సాధ్యము కాదు. ఇది ఆ మతంగ ముని ఆశ్రమము. నీవు విశ్రాంతి తీసుకొనుటకు అనువయిన ప్రదేశము.
--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
Comments
Post a Comment