అయోధ్యకాండ: 1369-1380 - భరతుని శోకము - రంగనాథ రామాయణం

 సందర్భము: శ్రీరాముడు అడవులకు వెళ్లిపోయాడని తెలుసుకున్న భరతుడు, కౌసల్యను పరామర్శించ వచ్చాడు. కౌసల్య అతడిని "పతిని, సుతుని పోగొట్టుకున్న నేను బాధపడాలిగానీ, నీకెందుకు దుఃఖం. నీవు కోరినట్లుగానే నీ తల్లి కైకేయి చేసింది. ఇంక రాజ్యము చేయి వెళ్లి" అని నిష్ఠూరమాడింది. దానికి ప్రతికా భరతుని సమాధానం.

శ్రీరామునకుఁ గీడుఁ జేసితి నేని ? - ధాణి నే నేలఁలఁచితి నేని ?
నేను గైకతలంపు నెఱిఁగితి నేని ? - నే నొక కీడైన నెఱిఁగితి నేని? 
వినుము మద్యంబు ద్రావినవాని గతికి - పెను పేద విప్రు జంపినవాని గతికిఁ
దెగి గురుపత్ని బొందినవాని గతికి - తిపైఁ దానోడి నువాని గతికి 
చెనఁటియై పసిఁడి మ్రుచ్చిలువాని గతికి - నెసి గోహత్య చేసినవాని గతికి 
న్యాయంబు దప్పిన రనాథు గతికి - నేయెడఁ గొండెగాఁ డేగెడు గతికి 
ణార్థుఁ బ్రోవని దురితాత్ము గతికి - ధర్మ విక్రయ వాంఛితు గతికి 
గురువుల దిట్టిన కుటిలాత్ము గతికి - య స్వామిద్రోహి గువాని గతికిఁ
ల్లిదండ్రులఁ దిట్టు నయుని గతికిఁ - ల్ల లాడెడు పాపర్ముని గతికిఁ 
 ధనంబుల కాస డువాని గతికి - సతిఁ గలిసిన పాపాత్లు గతికిఁ 
జనువాఁడ నిందుకు సాక్షి దేవతలు -  పాప కర్మురా లిటుచేసెఁ గాక 
యేను రాముని కేల యెగ్గు గావింతు - నీ నీచ కర్మంబు లేడ? నేనేడ ?

భావం:  శ్రీరామునికి కీడు చేసానా నేను? రాజ్యం కావాలని తలచినది నేనా? కైక తలపులు ఎరుగుదునా? నేను ఒక్క కీడు కూడా ఎరిగితినా? విను, మద్యము త్రాగిన వాని వలె, పేద విప్రుని చంపినవాని వలె, గురుపత్నిని చెడు దృష్టితో చూసిన వాని వలె, భూమిపై ఓడిపోయి పారిపోయిన వాని వలె, బంగారం దొంగలించిన వాని వలె, గోహత్య చేసిన వాని వలె, న్యాయము తప్పిన రాజు వలె, చాడీలు చెప్పే వాని వలె, శరణు కోరిన వాడిని రక్షించని వాని వలె, మంచి ధర్మాని అమ్మకానికి పెట్టిన వాని వలె, గురువులను తిట్టిన వాని వలె, స్వామిద్రోహి వలె, తల్లిదండ్రులను తిట్టు కొడుకు వలె, అబద్ధాలు చెప్పే పాపి వలె, ఇతరుల ధనము ఆశ పడువాని వలె, పరస్త్రీని కాంక్షించు వాని వలె - నేను కూడా అధోగతి పాలగుదును. దీని దేవతలు సాక్షి. ఈ పాపకర్మురాలు ఇలా చేసింది కానీ, నేను రామునికి కీడు ఎందుకు చేస్తాను. ఈ నీచ పనులు ఎక్కడ? నేనెక్కడ?


--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/

Comments