కిష్కింధా కాండ: 26-32 - వసంతకాల వర్ణన - రంగనాథ రామాయణం

సందర్భము: ఋష్యమూక పర్వత ప్రాంతంలో వసంత ఋతువు వచ్చుట.

కిష్కింధా కాండ: #26-32

కంఠకల కుహూకార నిస్వనము - చెలఁగించు వనము గర్జిలు ఘనాఘనము 
గులుకు పుప్పొడి మించుఁ గ్రొక్కారు మించు - లిరుగొమ్మలు శక్ర నువుల యనువు 
సుధ రాలెడి విరుల్ ర్షోపలములు - మురు తేనియసోన ముంచినవాన 
గా నొప్పుచు వసంతకాలంబుఁ జూడ - వాకాలముఁ బోలి సుధ నొప్పియును 
జిగురాకు శిఖలతోఁ జిట్టాడు తేటి - పొలతోఁ బొగడ పుప్పొడి బూదితోడ 
బూరుగుపూవు నిప్పుకలతో నెగడి - యాయ విరహుల గ్నియై నిగుడి 
కంతు ప్రతాపాగ్నికం టెను గడఁగి - యెంతేని నాచిత్త మెరియింపఁ దొడఁగె.

భావం: కోకిల కూతలతో అడవిప్రాంతమంతా గర్జిల్లుతోంది. అందమైన పూవుల పుప్పొడి రాలుతుంటే తొలకరి జల్లులలాగా ఉన్నది. చిగురిస్తున్న కొమ్మలను చూస్తే ఇంద్రధనుస్సుల లాగా ఉన్నాయి. నేల మీద రాలుతున్న పూవులు వర్షపు నీటి బిందువుల లాగా ఉన్నాయి. వసంతకాల పూవుల నుంచి కారుతున్న తేనె వర్షంలాగా ఉన్నది. చూస్తుంటే, ఈ వసంతకాలము వర్షాకాలం లాగా ఉన్నది. చిగురాకు కొమ్మలతో, సంచరిస్తున్న తుమ్మెదలతో, పరితపిస్తున్న పొగడ పూవుల పుప్పొడితో, బూరుగు పూవుల అగ్నకణాలతో వేసిన చలిమంటలా, విరహాగ్ని పెంచుతూ, మన్మథుని ప్రతాపాగ్ని మించిపోయి నా మనస్సును కాల్చుతున్నది.

--
కలకంఠ = కోకిల
తలిరు = చిగురు
శక్ర = ఇంద్రుడు
చిట్టాడు = సంచరించు
తేటి = తుమ్మెద
పొగలు = పరితపించు
నెగడి = చలిమంట
ఆరయు = విచారించు
నిగుడించు = వ్యాపించు
కడగు = ప్రయత్నించు
ఎరియించు = కాల్చు

--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php

Comments