Posts

Showing posts from February, 2021

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 43

ఈ భాగంలో శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శన చక్రాన్ని వర్ణించే పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. ప్రధమ స్కంధంలోనిది. ఉపపాండవులను చంపిన అశ్వత్థామను చంపకుండా, పాండవులు, కేవలం తలలోని మణిని పెరికి విడిచిపెట్టేసారు. అశ్వత్థామ, ఉత్తర కడుపులోనున్న బిడ్డ మీదకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆమె వచ్చి శ్రీకృష్ణునికి మొర పెట్టుకుంది. అంగుష్ఠమాత్రుడై, భగవంతుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. రెండవది. అష్టమ స్కంధంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలోనిది. మొసలితో పోరాడుతూ గజేంద్రుడు అలసిపోయాడు. భగవంతునికి శరణాగతి చేసాడు. వైకుంఠపురములోనున్న శ్రీహరి హుటాహుటిన వచ్చి, తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఇవిగో పద్యాలు. 1-184-మ.  (ఉత్తర గర్భాన్ని రక్షించుట) తన సేవారతిచింత గాని పరచింతాలేశమున్ లేని స జ్జనులం బాండుతనూజులన్ మనుచు వాత్సల్యంబుతో ద్రోణనం దను బ్రహ్మాస్త్రము నడ్డుపెట్టఁ బనిచెన్ దైత్యారి సర్వారి సా ధన నిర్వక్రము, రక్షితాఖిల సుధాంధశ్చక్రముం, జక్రమున్ 8-109-మ.  (గజేంద్రుడిని రక్షించుట) కరుణాసింధుఁడు శౌరి వారిచరమున్ ఖండింపఁగాఁ బంపె స త్త్వరితాకంపిత భూమిచక్రము, మహోద్యద్విస్ఫులింగచ్ఛటా పరిభూతాంబర

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 42

ఈ భాగంలో పద్య శిల్పం ద్వారా చెప్పే విషయాన్ని కవి ఎలా పండిస్తాడో చూద్దాం. రెండూ, ప్రథమ స్కంధంలోని, ఒకటే కథా సందర్భంలోనివి. మొదటిది. సూతుడు సౌనకాది మునులకు భాగవతం చెప్పడం మొదలు పెట్టాడు - మహాభారత యుద్ధం పూర్తయింది. తొడలు విరిగి పడి ఉన్న దుర్యోధనుడికి, "పాండవుల వంశ నాశనం చేస్తా"నని, అశ్వత్థామ మాట ఇచ్చాడు. రాత్రిపూట వెళ్లి, నిదురిస్తున్న ఉప పాండవులను చంపివేశాడు. పారిపోయిన అశ్వత్థామను అర్జునుడు, శ్రీకృష్ణుడు వెళ్లి పట్టుకున్నారు. ఆవేశంలో ఉన్న అర్జునుడిని కృష్ణుడు, అశ్వత్థామను ఎందుకు చంపకూడదో చెప్తున్నాడు. రెండవది. అశ్వత్థామను బంధించి, విలపిస్తున్న ద్రౌపది దగ్గరకు, తీసుకువచ్చారు. నిదురిస్తున్న వారిని చంపడానికి నీకు చేతులెలా వచ్చాయని ద్రౌపది, అశ్వత్థామను ప్రశ్నిస్తోంది. ఇవిగో పద్యాలు. 1-156-చ. (శ్రీకృష్ణుడి మాటలు) వెఱచినవాని, దైన్యమున వేఁదుఱు నొందినవాని, నిద్ర మై మఱచినవాని, సౌఖ్యమున మద్యము ద్రావినవాని, భగ్నుడై పఱచినవాని, సాధు జడభావమువానిని, గావు మంచు వా చఱచినవానిఁ, గామినులఁ జంపుట ధర్మము గాదు, ఫల్గునా! 1-163-శా. (ద్రౌపది మాటలు) ఉద్రేకంబున రారు, శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు, కిం చి

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 41

ఈ భాగంలో భాగవతంలోని కథా ప్రారంభంలోని పద్యాలు రెండు చూద్దాం. మొదటిది. శౌనకాది మహామునులు, నైమిశారణ్యంలో ఉన్న సూతుని దగ్గరకు వచ్చారు. భగవంతుని గురించి చెప్పమని అడిగారు. సూతుడు భాగవతం చెప్పటానికి నిర్ణయించుకుని, "ఈ భాగవతాన్ని వ్యాసుడు, తన కుమారుడైన శుక మహర్షికి చెప్పాడు. ఆ శుక మహర్షి, గంగానదిలో ప్రాణం విడవబోతున్న పరీక్షిత్తు మహారాజుకు చెప్పాడు" - అంటూ మొదలుపెట్టాడు. "అదేమిటీ అత్యంత బలము, సంపద, వంశము కలిగిన పరీక్షిత్తు అన్నీ వదులుకొని ప్రాణాలు విడవటమేమిటి. వివరంగా చెప్పండి" అంటూ కథలో లీనమవుతున్నారు శౌనకాది మునులు. రెండవది. సూతుడు కథ మొదలు పెడుతున్నాడు. మహాభారత యుద్ధము పూర్తయింది. శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వెడుతున్నాడు. కుంతీదేవి శ్రీకృష్ణుడిని చూడటానికి వచ్చింది. ఇంత కాలం తననూ, తన సంతానాన్ని కాపాడిన శ్రీకృష్ణుడికి నమస్కృతులు తెలియచేసుకుంటోంది. 1-79-సీ. (శౌనకాదుల ప్రశ్న)  పాండవ వంశంబు బలము మానంబును వర్ధిల్లఁ గడిమి నెవ్వాఁడు మనియెఁ బరిపంథిరాజులు భర్మాదిధనముల నర్చింతు రెవ్వని యంఘ్రియుగముఁ గుంభజకర్ణాది కురుభటవ్యూహంబు సొచ్చి చెండాడె నే శూరుతండ్రి గాంగేయసైనికాక్రాంత గోవర్గ

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 40

ఈ భాగంలో బాలకృష్ణుడి మీద రెండు పద్యాలు చూద్దాం. రెండూ దశమస్కంధం పూర్వభాగంలోనివి. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. బాలకృష్ణుడికి సుమారు మూడు నెలల వయసు. ఒత్తిగిల్ల పడుతున్నాడని, యశోద నలుగురినీ పిలిచి పేరంటం చేసింది. ఆ హడావుడి అయినాక పిల్లవాడిని పడుకోపెట్టింది. ఆ పడుకొన్న పిల్లవాడికి ఆకలివేసింది. అటూఇటూ కదులుతూ, కాళ్లూచేతులు ఆడిస్తూ ఒక బండిని తన్నాడు. ఆ బండిరూపంలో ఉన్న మాయా రాక్షసుడు ఆకాశంమీదకు ఎగిరి క్రిందపడి చనిపోయాడు. పక్కనే ఉన్న పిల్లలు బాలకృష్ణుడే తన్నాడని చెప్పారు. "పిల్లవాడేమిటి బండిని తన్నటమేమిటి" అంటూ గోపగోపికలు ఆశ్చర్యపోతున్నారు. రెండవది. కృష్ణుడికి ఏడు సంవత్సరాల వయస్సు. తనకి పూజచేయడం లేదని, ఇంద్రుడు గొప్ప గాలివాన కురిపించాడు. అందరిని రక్షించేందుకు, బాలకృష్ణుడు, చిటికెన వ్రేలిపైన గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. దాని క్రిందకు చేరడానికి కొందరు సందేహిస్తున్నారు. "ఇతడు పిల్లవాడు, అంత పెద్దకొండని ఎత్తి ఉంచగలడా అని సందేహించకండి" అంటూ వారికి కృష్ణుడు చెప్తున్నాడు. ఇవిగో పద్యాలు. 10.1-257-శా. "బాలుం డెక్కడ? బండి యెక్కడ? నభోభాగంబుపైఁ జేడ్పడం గాలం దన్నుట యెక్క? డేల పడు