Posts

Showing posts from April, 2019

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 3

పోతనకు శబ్దాలంకార ప్రియుడని పేరు ఉంది. శబ్దాన్ని ఎలా వాడుకోవాలో తనకు బాగా తెలుసును. ఈ వ్యాసంలో “ణ” శబ్దాన్ని వాడతూ ద్వంద్వ శిల్పం నిర్మించారో చూద్దాం. “ణ”కారంలో ఒక సొగసు ఉంది. “గుడిలో గంటలు ఎలా మ్రోగుతాయి?” అని ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? “ గణ గణ ” మ్రోగుతాయి అంటాం. వాటిని మంగళకరమైన శబ్దంగా భావిస్తాం. పోతన భాగవతం మొదలు పెట్టాడు. ఇష్టదేవతా స్తుతి చేసాడు. వ్రాయించేది శ్రీరాముడన్నాడు. కథ మొదవలబోతోంది. శౌనకాది మునులతో ఉత్సాహంగా “గంట” కొట్టించేడు - “ణ”కారంతో ఒక పద్యం వచ్చింది - భూషణములు, అఘపేషణములు, భీషణములు, తోషణములు, విశేషణములు అంటూ “గణగణ”లాడించాడు. దానికి తోడు శ్రీకృష్ణుడులో కూడా “ణ”కారం ఉన్నది కదా. 1-46-క .  భూషణములు వాణికి నఘపేషణములు మృత్యుచిత్త భీషణములు హృ  త్తోషణములు కల్యాణ విశేషణములు హరి గుణోపచితభాషణముల్.   పోతన వ్రాస్తూపోతున్నాడు. తొమ్మిది స్కంధాలు అయిపోయాయి. దశమ స్కంధం మొదలయింది. దశమ స్కంధం, రెండు భాగాలు - పూర్వ భాగంలో శ్రీకృష్ణుడు బ్రహ్మచారి, ఉత్తరభాగంలో సంసారి. పూర్వభాగంలో శ్రీకృష్ణ జననం, మధుర లీలలు, కంస వధ అయిపోయినాయి. యవ్వన దశవచ్చింది. ఇంక “ రుక్మిణీకల్యాణం” ఘట్టంతో పూర్తిచేయాల

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 2

పోతన (1450 - 1510) భాగవతంలోని ద్వంద్వ శిల్పం గురించి ముందు పోస్టులో ప్రస్తావించాను. ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం.  మొదటి కథ. రుక్మిణీకల్యాణం ఘట్టంలోనిది. శ్రీకృష్ణుడు అప్పటికింకా బ్రహ్మచారి. రుక్మిణి, శ్రీకృష్ణుడిని ఎప్పుడూ చూసినది కాదు. కానీ, వచ్చి పెళ్లిచేసుకోమని లేఖ వ్రాసింది. శ్రీకృష్ణుడు రానేవచ్చాడు. అప్పుడే మొదటి సారి చూసింది. రెండవ కథ. శ్రీకృష్ణుడు-రుక్మిణికి మగ సంతానం కలిగింది. ప్రద్యుమ్నుడు పుట్టాడు. కిడ్నాప్ నకు గురైనాడు. శత్రువు ఇంటిలోనే పెరిగి పెద్దవాడైనాడు. పెద్దవాడై ఆ శత్రవును అంతం చేసి, నిజం తెలుసుకొని రుక్మిణి మందిరానికి వచ్చాడు. చెలికత్తెలు అతడిని మొదట చూసారు. ఏమరపాటుతో, కృష్ణుడే అనుకొని పక్కకు తప్పుకున్నారు. పోతన ఈ రెండు సంఘటనలను ఎలా చెప్పాడో చూద్దాం. ఈ రెండు సందర్భాలలోనూ ఎదుటనున్న మనోహరమైన వ్యక్తిని వర్ణించాలి. అందునా, ప్రద్యమ్నుడు అచ్చుగుద్దినట్టు (యవ్వనంలో ఉన్న) శ్రీకృష్ణుడులాగానే ఉన్నాడట. రుక్మిణి మొదటిసారి చూసినప్పుడు కృష్ణుడు ఎలా ఉన్నాడో, ఇప్పుడు ప్రద్యుమ్నుడు కూడా అలాగే ఉన్నాడట. అందుకనే పోతన రెండు పద్యాలను ఒకటే (మత్తేభ) వృత్తంలోనే నడిపించారు. పోలికలు కూడా యదాతథం

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 1

పోతన (1450 - 1510) భాగవతం గత 15 ఏళ్లగా అడపా దడపా చదువూతూనే ఉన్నాను. చాలా వరకూ రుక్మిణీ కల్యాణం, గజేంద్రమోక్షం ఘట్టాల వరకే పరిమితమై ఉన్నాను. గత ఏడాది పోతన భాగవతం ఆండ్రాయిడ్ యాప్ చేసినప్పటినుండి, మరికొన్ని ఘట్టాలు (ప్రహ్లాదచరితం, వామనావతారం మొ.) తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నంలో భక్తి భావం అట్లా ఉంచితే పోతన వాడిన భాష, రచనా శైలి నన్ను ఆలోచింప చేస్తున్నాయి.  ఇంకో విషయం. ఉద్యోగరిత్యా, గత పది ఏళ్లగా, ఒక పని తరచూ ఎదురవుతోంది. ఇంగ్లీషులో, రెండు పదాలు/వాక్యాలు ఎంత దగ్గరగా ఉన్నాయి, అని తెలుసుకోవటానికి కంప్యూటరు ప్రోగ్రాములు రాయవలసిన అవసరం వచ్చింది. ఉదాహరణకి John/Johnson, Rob/Robert మొదలైనవి. వీటికి ఆంగ్లంతో Dice Coefficient వంటి పద్ధతులు ఉపయోగించి పదాలు ఎంత “దగ్గరగా” ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఈ “శబ్ద/పద సామీప్యం” దృష్టి ఉండేసరికి, మొబైల్ యాప్ తయారు చేస్తున్నప్పుడు, నన్ను రెండు పద్యాలు ఆకర్షించాయి. రెండు పద్యాలు వేరువేరు స్కందాలలోనివి. ఒకటి రాముని గురించి, మరొకటి కృష్ణుని గురించి. రెంటి ఎత్తుగడ ఒకే లాగా ఉన్నాయి. రెండు పద్యాలూ, “నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు” అంటూ మొదలవుతాయి. క్రింద చ