315 - 320 - సీతాదేవి తృణీకరణ - రంగనాథ రామాయణం - ద్విపద కావ్యం

సందర్భం: అశోకవనంలో ఉన్న తన దగ్గరకు వచ్చిన రావణాసురుని తృణీకరించి, సీతాదేవి మాటలు.

సుందరాకాండ: #309-#314

 లంక యేలుచు నుబ్బెద వీవు - ల లోకములకు స్వామి రాఘువఁడు
ఖిలకంటకుఁడ వీ న్నిలోకముల - ఖిలలోకారాధ్యుఁ డారాఘవుండు
వేచోరుఁడ వవివేకివి నీవు - వేదంబులకునెల్ల వేద్యుం డతండు
ర్మపూరిత ఘనకాయుండ వీవు - నిర్మల గుణయశోనిధి రాఘవుండు
ర్వజీవాళి భక్షకుఁడవు నీవు - ర్వజీవులకును ముఁడు రాఘవుఁడు

భావం: నీవు కేవలం ఒక లంకను ఏలుతూ, అదే గొప్ప అనుకుంటున్నావు, శ్రీరాముడు అన్ని లోకాలకూ అధిపతి, నీవు సకల లోకాలనూ కష్టపెడుతున్నావు, శ్రీరాముడిని సకల లోకాలూ ఆరాధిస్తున్నాయి,
నీవు వేదాలను దొంగిలించే అవివేకివి, శ్రీరాముడు వేదాలలో చెప్పబడిన పూజ్యుడు,
నీవు భౌతికమైన వాటితో  గొప్పలు పోయేవాడివి, శ్రీరాముడు ఎటువంటి అవలక్షణాలు లేనివాడు,
నీవు అన్ని జీవాలనూ కష్టపెట్టేవాడివి, శ్రీరాముడు సర్వజీవులనూ సమంగా చూసేవాడు

--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php

Comments