యుద్ధకాండ: 266-277 - రాక్షస వీరులు రావణునికి ప్రతాపములు చెప్పుట
సందర్భము: శ్రీరాముడు అటుతీరంలో కపివీరులతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడని రావణాసురుడు మంత్రులతో సమాలోచన ఏర్పాటు చేసాడు. రాక్షస వీరులందరూ కలసి తమ ప్రతాపము తెలియచేస్తున్నారు.
నాదిగాఁ గల్గు మహాదైత్యవరులు - నాదైత్యవల్లభు నగ్రభాగమునఁ
గన్నులఁ గోపంబు గడలుకొనంగ - మిన్నులు ముట్టంగ మీటి పల్కుచును
బ్రళయావసర మహాపవన నిర్ధూత - కులపర్వతములన గుంభిని యదర
నొండొరుఁ జూచుచు నుద్దండవృత్తి - నొండొరు మెచ్చక యుగ్రత మెఱసి
యూర్పులు నిగుడ నత్యుగ్రత మగ్గు - సర్పంబులును బోలె సరభస వృత్తి .
శూలంబు లంకించి సురియలు బిగిచి - వాలము ల్జళిపించి వర తనుత్రాణ
సబళంబు అమరించి చక్రము ల్ద్రిప్పి - ప్రబలంబు లగు భిండివాలము ల్దిగిచి
పట్టసం బెసఁగించి ప్రాసము ల్ద్రిప్పి - గట్టి విండ్లును గుణకంపము ల్చేసి
యుడుగక యెలుగు లొండొంటితో రాయ - మిడుగురు ల్మంటలు మిక్కుటంబుగను
ఒండొరు విపుల కేయూరంబు లొరయ - నొండొరు మకుటంబు లుగ్రత రాల
భాసుర మౌక్తిక ప్రకరము ల్చెదర - రాసిన నవ హేమ రజములు దొఱుగ

సందడింపుచు మహాసంరంభ మెసఁగ - బృందారకారితో బేర్చి యిట్లనిరి
భావం: ముందుగా ఉన్న రాక్షసవీరులు, రావణాసురుని ఎదురుగా, కళ్లలో కోపం ఆకాశాన్నంటగా పలికారు, దాని వలన ప్రళయకాలంలోని గాలుల వల్ల పర్వతాలు, భూమి దద్దరిల్లినట్లు అయింది. ఆ రాక్షసవీరులు ఒకరినొకరు చూసుకుని, రెట్టించిన కోపంతో బుసలు కొడుతున్నారు. ఆ కోపం చూస్తుంటే కోపంతో మగ్గిన పాములవలే ఉన్నారు. శూలాలు పట్టుకుని, చురకత్తులు బిగించి పట్టుకుని, కత్తులు ఝళిపించి, గొప్ప కవచాలను, ఈటెలను అమర్చుకుని, చక్రాయుధాలను త్రిప్పి, భిండివాలాలనే ఆయుధాలను లాగి, గొడ్డళ్లను పట్టుకుని, ఈటెలను త్రిప్పుతూ, విల్లుల వింటినారులతో గొప్ప ధ్వనులు చేస్తూ, భీకరంగా ఒకరికొకరు అరుస్తూ, నిప్పుకణికల వలే ఒకరికొకరు భుజకీర్తులను ఒరుసుకుంటూ, వారి కిరీటాలు క్రిందికి పడిపోతుండగా, ముత్యాలహారాలు చెదరిపోగా, రాసుకున్న బంగారు పూతలు కారుతుండగా, కోలాహలంతో ఆ దైవవిరోధి అయిన రావణాసురునితో ఇలా అన్నారు...
అర్థాలు:
కడలుకొను = అతిశయించు
మీటు = ఎగసిపడు
నిర్ధూత = విడువబడిన, రాలిన
ఒండొరు = పరస్పరం
మగ్గు = మాగు
సరభస = తొందర కలవాడు
లంకించు = పట్టుకొను
సురియలు = చురకత్తులు
వాలము = కత్తి
తనుత్రాణ = కవచము
సబళము = ఈటె
భిండివాలము = బాణము వంటి ఆయుధము
తిగుచు = ఈడ్చు
పట్టసము = గొడ్డలి వంటి ఆయుధము, అడ్డకత్తి
బెసకు = జార్చు
ప్రాసము = ఈటె
విండ్లు = విల్లులు
ఎలుగు = కంఠస్వరము
మిడుగురు = అగ్నికణము, మిణుగురు
కేయూరము = భుజకీర్తులు
ఒరయు = ఒరుసుకొను, రాచుకొను
మౌక్తికము = ముత్యము
ప్రకరము = సమూహము
రజము = దుమ్ము, రవ
తొరుగు = కారు
బృందారక = దేవతలు
--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
Comments
Post a Comment