Posts

Showing posts from April, 2021

5-13 : హనుమంతుడు లంకను చూచుట - రంగనాథ రామాయణం - ద్విపద కావ్యం

సుందరాకాండ: #5 - #13 (page: 230, pdf page:  250 ) య ట   దక్షిణము చూచి  య ప్పు డిట్లనియె -  న టఁ   ద్రికూటాద్రిపై  న మరెడుదాని గ ద లక ధర్మార్థ కా మము ల్మూడు -  పొ ది గొన్న సిరివోలెఁ  బొ లుపొందుదాని న మ రావతీపురం  న బ్ధిమధ్యమునఁ  -  గ మ నీయగతి నొప్పు  గ లిగినదాని న ల క కుబేరుతో  న లుకమై నచట  -  నె ల కొన్న కైవడి  నె గడెడుదానిఁ  గ ల కాలమును నధో గ తి నుండలేక  -  తె లి విమై భోగవ తీ నగరంబు జ ల రాశి వెలువడి  స రి త్రికూటమున  -  వె ల సిన కైవడి  వి లసిల్లుదాని నం బు ధి యావర ణాం బువు లాఁగఁ  - బం డి న ప్రభ నొప్పు  బం గారుకోట బ్ర హ్మాం డవిధముగాఁ  బ రికింప నొప్పు  -  బ్ర హ్మా ద్యభేద్యమై  ప రఁగెడుదాని మొ న సి లోకములకు  మొ న యెక్కుడగుచుఁ - .... భావం: అటు దక్షిణ దిశగా చూసి హనుమంతుడు ఇలా అనుకున్నాడు - "ఆ త్రికూట పర్వతం మీద, ధర్మ, అర్ధ, కామములు మూడు కలగలసి ఉన్నట్టుగా, దేవతల అమరావతీ పురం సముద్రం మధ్యలో ఉన్నట్టుగా, అలకాపురి రాజైన కుబేరుడు ఇంకా లంకలోనే నివాసమున్నాడా అన్నట్టుగా, భూమి మధ్యలో ఉండలేక సముద్ర గర్భంనుండి భోగవతీ నగరము బయటకు వచ్చి ఈ త్రికూటము మీద వెలసినదా అన్నట్టుగా, బంగారు రంగుతో వెలుగుతూ, బ్ర

213-218 : అశోక వనంలో సీత - రంగనాథ రామాయణం - ద్విపద కావ్యం

సుందరాకాండ: #213 - #218 (page: 236, pdf page: 255 ) యి న   రశ్మి వాడిన   యె లదీగె బోలె - ఘ న ధూమయుత దీప క ళికయు బోలె జ ల దమాలికలోని   శ శికళవోలె - బ లు మంచు బొదివిన   ప ద్మిని వోలె చె ల గి పిల్లులలోని   చి లుకయు బోలె - బు లు లలో నావును   బో లె దుర్వార ఘో ర రాక్షస వధూ కో టిలో నున్న - నా రీ శిరోమణి   న లినాయతాక్షి మ లి నాంగి యలివేణి   మా తంగగమన - క లి తభూషణజాల   గ ద్గదకంఠి జ ని తోష్ణ నిశ్వాస   స తతోపవాస - జ న క తనూజాత   జ గదేకమాత భావం :  ఎండలో వాడిపోయిన తీగలాగా, మసిబారిపోయిన దీపంలాగా, మబ్బులు కమ్మేసిన చంద్రుని లాగా, పొగమంచు విరిసిన పద్మంలాగా, పిల్లుల మధ్యలో చిలుకలాగా, పులుల మధ్యలో ఆవులాగా – క్రూరమైన రాక్షసుల మధ్యలో – స్త్రీలలో గొప్ప స్త్రీ, చక్కటి కన్నులున్నది, అందమైనది, చక్కని జుట్టు ఉన్నది, ఆభరణాలు లేకున్నది, సామజవర గమన, గద్గదమైన కఠంతో, వెచ్చటి ఊపిరి వదులుతూ, ఉపవాసాలు చేస్తూ - జనకుని కూతురు జానకి ఉన్నది. -- రంగనాథ రామాయణం - PDF -  https://archive.org/details/in.ernet.dli.2015.329074/ ఛందస్సు రంగులు -  http://chandam.apphb.com/

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 50

ఈ భాగంలో రెండు స్తుతి పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. నవమ స్కంధంలోని అంబరీషోపాఖ్యానము లోనిది. అంబరీషుడనే చక్రవర్తి గొప్ప విష్ణు భక్తుడు. అతడు ఒకసారి దూర్వాస మహర్షి కోపానికి గురయినాడు. దూర్వాసుడు తన జటను ఊడపెరికి నేలకేసి కొట్టి, దాని నుంచి ఒక పిశాచిని సృష్టించాడు. తన భక్తుడిని రక్షించేందుకు, శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రాన్ని పంపించాడు. ఆ సుదర్శన చక్రానికి భయపడి, దూర్వాసుడు బ్రహ్మదేవుడిని, శివడిని ఆశ్రయించాడు. వారు తమ నిస్సహాయతను తెలియచేసారు. చివరికి శ్రీమహావిష్ణువు దగ్గరకే వెళ్లగా, "నేను నా భక్తులకే దాసుడను. నీవు వెళ్లి ఆ అంబరీషుడినే శరణు వేడుకో" అని విష్ణువు చెప్పాడు.  గత్యంతరం లేక, దూర్వాసుడు అంబరీషుడినే అర్ధించాడు. అంబరీషుడు, ఆ సుదర్శన చక్రాన్ని స్తుతిస్తున్నాడు. రెండవది. దశమ స్కంధం పూర్వభాగంలోనిది. బాలకృష్ణుడి అల్లరికి కోపం వచ్చిన యశోద, దండించడానికి చేతులు రాక, కృష్ణుడిని ఒక రోటికి కట్టివేసింది. బాలకృష్ణుడు ఆ రోటిని లాక్కుంటూ వెళ్లి, పెరటిలోని రెండు మద్ది చెట్లను కూల్చి వేసాడు. కూలిన మద్ది చెట్లనుంచి ఇద్దరు సిద్ధులు ప్రత్యక్షమైనారు. వారిద్దరూ బాలకృష్ణుడిని

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 49

గత భాగంలో ( ద్వ-48 )  లాగానే ఈ భాగంలో కూడా దశావతారముల గురించిన మూడు పద్యాలు చూద్దాం. అన్ని పద్యాలు, దశమ స్కంధం పూర్వభాగం లోనివే. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. బాలకృష్ణుడు తన ఇంటిలోని పెరుగు కుండను బ్రద్దలుచేసి, వెన్న తిని ప్రక్క ఇంటికి వెళ్లి అక్కడ కూడా అల్లరి చేస్తున్నాడు. యశోద కంటబడ్డాడు. యశోదను నానా తిప్పలు పెట్టి చివరికి చేతికి చిక్కాడు. యశోద బాలకృష్ణుడిని నిష్టూరాలు ఆడుతోంది. రెండవది. బాలకృష్ణుడు కాళింది మడుగులోని కాళీయుని మర్దనం చేసాడు. హేమంత ఋతువు వచ్చింది. ఆ  ఋతువులోని మొదటి నెల మార్గశీర్షం. గోపికలు ఆ నెలరోజుల పాటు కాత్యాయని వ్రతం చేయదలచారు.  శ్రీకృష్ణుడిని తామందరికీ పతిని చేయమని పార్వతిని కోరుకున్నారు. వ్రతనిష్టలో ఉన్న గోపికలు ఒకనాడు వస్త్రాలన్నీ ఒడ్డున విడిచి యమునా స్నానం చేస్తున్నారు. బాలకృష్ణుడు ఆ వస్త్రాలని దొంగిలించి కడిమి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. గోపికలు చిన్నికృష్ణుడిని ప్రార్ధిస్తున్నారు. మూడవది. శ్రీకృష్ణుడికి, అక్రూరుని ద్వారా, కంసుడి నుంచి పిలుపు వచ్చింది. ఆహ్వానం అందుకుని, బలరామకృష్ణులు మథురకు చేరుకున్నారు. అక్కడ చాణూరుడు, ముష్టికుడు అనే ఇద్దరు మల్లయోధులు ఉన్న

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 48

ఈ భాగంలో శ్రీమహావిష్ణువు దశావతార వర్ణన చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. రెండూ దశమ స్కంధం, పూర్వభాగం లోనివి. మొదటిది. కంసుని చెఱలోనున్న, దేవకి అష్టమ గర్భం ధరించింది. బ్రహ్మ తదితర దేవతలు వచ్చి గర్భంలో ఉన్న శ్రీమహావిష్ణువును స్తుతి చేస్తున్నారు. రెండవది. శ్రీకృష్ణుడు కంసుని సంహారం చేసిన అనంతరం, మథురను రాజధానిగా రాజ్యం చేస్తున్నాడు. జరాసంధుడిని ఓడించాడు. తరువాత కాలయవనుడు అనేవాడు మూడు కోట్లమందితో దండెత్తి వచ్చాడు. శ్రీకృష్ణుడు సముద్రం మధ్యలో ద్వారకను కట్టించి, ప్రజలను అక్కడకు తరలించాడు. కాలయవనుడికి చిక్కకుండా పారిపోయాడు. పారిపోతున్న శ్రీకృష్ణుడిని, కాలయవనుడు వెంబడించాడు. "ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటా"నని అంటున్నాడు. ఇవిగో పద్యాలు. 10.1-100-మ . (దేవకి గర్భంలోనున్న శ్రీకృష్ణుడిని స్తుతించుట) గురు పాఠీనమవై, జలగ్రహమవై, కోలంబవై, శ్రీనృకే సరివై, భిక్షుఁడవై, హయాననుఁడవై, క్ష్మాదేవతాభర్తవై, ధరణీనాథుడవై, దయాగుణగణోదారుండవై, లోకముల్ పరిరక్షించిన నీకు మ్రొక్కెద; మిలాభారంబు వారింపవే. 10.1-1625-మ . (శ్రీకృష్ణుని వెంబడిస్తూ కాలయవనుడి మాటలు) బలిమిన్ మాధవ! నేఁడు నిన్ను భువనప్రఖ్యాతిగాఁ బట్టుదున్ జలము