Posts

Showing posts with the label తెలుగు

కనకన రుచిరా - త్యాగయ్య కృతి

  కనకన రుచిరా కనకవసన! నిన్ను  ॥కనకన॥ అర్థం: నిన్ను మరలమరలా చూడాలని (కన-కన) కోరికగా (రుచి) ఉన్నది! ఓ లక్ష్మీనివాసా! దినదినమును మనసున చనువున నిన్ను ॥కనకన॥ అర్థం: ప్రతిదినమూ మనసులో ఇష్టంతో నిన్ను ...(మరల మరల చూడాలని కోరికగా ఉన్నది) పాలుగారు మోమున శ్రీ యపార మహిమ దనరు నిన్ను ॥కనకన॥ అర్థం: పాలుకారుతున్న ముద్దులొలుకు ముఖాన్ని కలగిన నిన్ను... (మరల మరల చూడాలని కోరికగా ఉన్నది) కలకలమను ముఖకళగలిగిన సీత కులుకుచు నోరకన్నులను జూచె నిన్ను ॥కనకన॥ అర్థం: అందగాడివైన నిన్ను, జానకి తన ఓర చూపులతో చూచిన నిన్ను ... (మరల మరల చూడాలని కోరికగా ఉన్నది) బాలార్కాభ! సుచేల! మణిమయ మాలాలంకృత కంధర! సరసిజాక్ష! వర కపోల సురుచిర కిరీటధర! సతతంబు మనసారగ ॥కనకన॥ అర్థం: ఉదయిస్తున్న   సూర్యుడి తేజుడవైన నిన్ను, మంచి వస్త్రాలను ధరించే నిన్ను, మణిమయమైన మాలలతో అలంకరించిన నిన్ను, పద్మాలవంటి కన్నులు కలిగిన నిన్ను, చక్కటి చెక్కిళ్లు కలిగిన నిన్ను, అందమైన కిరీటము ధరించిన నిన్ను, ఎల్లప్పుడూ మనసు నిండునట్లుగా ... (మరల మరల చూడాలని కోరికగా ఉన్నది) సాపత్నీ మాతయౌ సురుచి వే కర్ణశూలమైన మాట వీనుల  చురుక్కున తాళక శ్రీహరిని ధ...

ఊర్వశి గ్లౌభా - మహర్షి సినిమా - సంస్కృతంలో పాట

మహర్షి (1987) సినిమాలో సంస్కృత భాషలో వ్రాసిన " ఊర్వశీ గ్లౌభా " పాట. రచయిత - జొన్నవిత్తుల సంగీతం - ఇళయరాజా గాయకుడు - బాలసుబ్రహ్మణ్యం దర్శకుడు - వంశీ -- ఊర్వశి గ్లౌభా ప్రేయసి హ్రీం మా  (2) గ్లౌ = చందమామ; భా = వెలుగు; హ్రీం = సిగ్గు; మా = మాను, వద్దు అస్మత్ విద్వత్ విద్యుత్ దీపిక త్వంయేవ రసవత్ విలసత్ విభవత్ గీతిక త్వంయేవ (2) అస్మత్ = నా ;  విద్వత్   = విద్య ; విద్యుత్ = మెరుపు ; దీపిక = వెలుగు; త్వం = నీవు ; ఏవ = మాత్రమే;  రసవత్ = రసవంతమైన; విలసత్ = విలాసవంతమైన, మెరిసే; విభవత్ = ఉన్నటువంటి; గీతిక = పాట; త్వం = నీవు ; ఏవ = మాత్రమే;  లసత్ చమత్కృతి నటత్ ప్రతిద్యుతి ఘనత్ హరిత్మణి త్వంయేవ శుంబత్ ప్రమోద ఝుంబత్ ప్రవాహ ధవళ గగనధుని త్వంయేవ లసత్ = ప్రకాశవంతమైన; చమత్కృతి = ఆశ్చర్యకరమైన ; నటత్ = ఆడుతున్న; ప్రతిద్యుతి = ప్రతిబింబిస్తున్న; ఘనత్ = గొప్పదైన; హరిత్మణి = పచ్చని మణి;  శుంబత్  = అందమైన ; ప్రమోద = ఆనందమైన ; ఝుంబత్ = ఝంకార; ప్రవాహ = ప్రవాహం; ధవళ = స్వచ్ఛమైన; గగన ధుని = ఆకాశవాణి;  భజే భజే భజరే భజే భజే - భజే భజే భజరే భజే భజే భజరే భజించరే - జపరే జపించరే (2) ...

పోతన భాగవతంలో భారత వర్షం

పోతన ( 1450 - 1510) వ్రాసిన ఆంధ్రమహాభాగవతంలో భారతవర్షం యొక్క భౌగోళిక వివరాలు తెలియజేసాడు. పంచమ స్కంధంలోని ఉత్తరభాగంలో ఈ వివరాలు ఉన్నవి. మలయపర్వతము వంటి రకరాకాల పర్వతాలు, చంద్రవటి వంటి నదులు (తూర్పునకు ప్రవహించేవి, నర్మద వంటి నదాలు (పశ్చిమాని ప్రవహించేవి), వీటిలో పుట్టిపెరిగిన మనుషులు ఉత్తమగతులు చెందుతారు (5.2-55) ".....మలయపర్వతంబును..<<>>..రామగిరియును నాదిగాఁ గల పుణ్య పర్వతంబు లనేకంబులు గలవా పర్వతపుత్రిక లైన చంద్రవటయు, దామ్రపర్ణియు,.. <<>> ..విశ్వయు నను నీ మహానదులును,నర్మద,.. <<>> ..యను నదంబులును నైన మహా ప్రవాహంబు లీ భారతవర్షంబునఁ గల; వందు సుస్నాతులైన మానవులు ముక్తిం జెందుదురు;మఱియు నీ భారత వర్షంబున జన్మించిన పురుషులు శుక్ల లోహిత కృష్ణవర్ణ రూపంబు లగు త్రివిధ కర్మంబులంజేసి క్రమంబుగ దేవ మనుష్య నరక గతులను త్రివిధ గతులం బొందుదురు; వినుము; రాగద్వేషాది శూన్యుండు, నవాఙ్మానసగోచరుండు, ననాధారుండు నగు శ్రీవాసుదేవమూర్తి యందుఁ జిత్తంబు నిలిపి భక్తియోగంబున నారాధించెడు మహాత్ముల విద్యాగ్రంథి దహనంబు గావించుట జేసి పరమ భాగవతోత్తములు పొందెడు నుత్తమగతిం జెందుదురు; క...

ఎక్కడదీ పద్యం - జయ జయ దానవదారణకారణ?

ఆదిత్య 369 సినిమాలోని ఒక ఘట్టం. శ్రీకృష్ణదేవరాయలు పాత్ర కార్తీక పౌర్ణమి నాడు విష్ణుమూర్తి విగ్రహానికి పూజ చేస్తూ జయజయ అంటూ పద్యం గానం చేస్తుంది. ఈ పద్యం,  చారిత్రక రాయలు వ్రాసిన "ఆముక్తమాల్యద"  కావ్యంలోనిది.  క్లుప్తంగా కథ. విలుబుత్తూరు అనే ఊరిలో విష్ణుచిత్తుడు అనే గొప్ప విష్ణుభక్తుడు ఉన్నాడు. నిత్యమూ విష్ణుభక్తి పరాయణుడై ఉండేవాడు. అతడు  ఒకానొక నాడు శ్రీమహావిష్ణువును స్తుతించే సందర్భంలోనిది ఈ పద్యం.  చతుర్థాశ్వాసంలోనిది పద్యం. పూర్తి పద్యం, ఆముక్తమాల్యద - కవిరాజ విరాజితము - 4-16 జ య   జయ దానవ దా రణకారణ  శా జ్గ్రరధాంగగ దా సిధరా జ య   జయ చంద్రది నేం ద్రశతాయుత  సాం ద్రశరీరమ హా ప్రసరా జ య   జయ తామర సో దర సోదర  చా రుపదోజ్ఘిత గాం గఝరా జ య   జయ కేశవ  కే శినిషూదన  శౌ రి శరజ్జల జా క్ష హరీ పద్యం  టీకా, తాత్పర్యము  - వేదము వేంకటరాయశాస్త్రి పుస్తకం నుండి. సినిమాలోని ఘట్టము  ఇక్కడ  -- ఇదే పద్యం కాస్త మార్పుతో పెద్దన వ్రాసిన స్వారోచిషమనుసంభవం (మనుచరిత్ర) అనే కావ్యం లో ఉన్నది.  జ య   జయ దానవ దా రణకారణ...

డా. మృణాళిని - ఉపన్యాసం

 జూన్ 18 2023. నేపర్విల్ (చికాగో).  డా. మృణాళిని గారు ప్రసంగించిన అంశం - "సాంప్రదాయ, ఆధునిక తెలుగు సాహిత్యంలో మహిళా రచయితలు" వారు గంటన్నర పాటు అనర్గళంగా చేసిన ప్రసంగాన్ని, పూర్తిగా వ్యాసరూపంలో వ్రాసే సాహసం చేయలేను. చేసినా న్యాయం చేయలేను. వారు ప్రస్తావించిన విషయాలను నేను నా మొబైల్ ఫోనులో వ్రాసుకున్న "బరికిన నోట్సు". గమనిక : తప్పులు నావే.  -- మొదటి రచయిత్రులు (16వ శతాబ్దం) తిమ్మక్క - సుభద్రా పరిణయం - ద్విపద కావ్యం మొల్ల - రామాయణం మోహనాంగి - మరీచి పరిణయం నాయక రాజులు (17వ శతాబ్దం) రఘునాథనాయకుడు, విజయరాఘవనాయకుడు) మధురవాణి - రంగాజమ్మ - మన్నారుదాసు విలాసం - ఉషా పరిణయం - 8 భాషల ప్రావీణ్యం - భోగపత్ని 1730+ - 18వ శతాబ్దం ముద్దు పళని - ప్రతాపసింగుని భోగపత్ని - రాధికా స్వాంతనం. బ్రిటీషు కాలంలో నిషేధం. 1950లో బెంగుళూరు నాగరత్నమ్మ చొరవ వలన ప్రకాశం పంతులు నిషేధాన్ని ఎత్తివేసారు. 1825+ - 19వ శతాబ్దం తరిగొండ వెంగమాంబ - వితంతువు - శతకాలు, యక్షగానం, దండకం ————————— 1840 - 1920 ఆడపిల్లలకు చదువులేదు. బాల్యవివాహాలు. బాల వితంతువులు. ————————— 1902 - బండారు అచ్చమాంబ - స్త్రీవిద్య భావ ——— బ...

శ్రీకృష్ణదేవరాయలు - తెలుగు నాట యుద్ధాలు

Image
శ్రీకృష్ణదేవరాయలను కృతిపతిగా పొగుడుతూ ముక్కుతిమ్మన వ్రాసిన పారిజాతాపహరణము, అల్లసాని పెద్దన వ్రాసిన స్వారోచిషమనుసంభవము (మనుచరిత్ర) అనే కావ్యాల నుంచి, ఈ క్రింది పద్యాలను చూడండి.  పారిజాతాపహరణము - 1.23 ఉ దయాద్రి వేగ య త్యు ద్ధతి సాధించె,          వి ను కొండ మాటమా త్ర న   హరించెఁ గూ టము ల్సెదరంగఁ  గొం డవీ డగలించె,          బె ల్లముకొండ య చ్చె ల్లఁ జెఱిచె,  దే వరకొండ యు ద్వృ త్తి భంగము సేసె,          జ ల్లి పల్లె సమగ్ర శ క్తి డులిచెఁ,  గి నుక మీఱ ననంత గి రి క్రిందుపడఁ జేసె,          గం బంబుమెట్ట గ్ర క్క నఁ గదల్చె గ టకమును నింక ననుచు ను త్క లమహీశుఁ డ నుదినమ్మును వెఱచు నె వ్వ నికి నతఁడు రా జమాత్రుండె! శ్రీకృష్ణ రా యవిభుఁడు. బ ల నికాయము కాలిమ ట్టు ల నె యడఁచుఁ భావం: ఉదయాద్రి, వినుకొండ, కొండవీడు, బెల్లంకొండ, దేవరకొండ, జల్లిపల్లె, అనంతగిరి, కంబంబుమెట్ట వంటి వాటిని జయించిన శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడు తన దాకా వస్తాడోనని, కటకం మహారాజు అనుదినమూ చింతిస్తున్నాడు. మనుచరిత్ర - 1.37 తొ...

యుద్ధకాండ: 310-314 - విభీషణుడు రావణాసురుని వారించుట

 సందర్భము: రావణాసురుడు మంత్రులతో కొలువుతీరి వారి ప్రతాపాలు వింటుండగా, విభీషణుడు యుద్ధం వద్దని వారిస్తున్నాడు. యుద్ధకాండ - 310-314 మే టి వానరు లిట  మీ ఱక మున్నె -  కో ట లు వారిచేఁ  గూ లకమున్నె,  సౌ మి త్రిబాణవ ర్ష ము రాకమున్నె -  రా ము నికోపాగ్ని  రాఁ జకమున్నె,  యా య గ్నిచే లంక  య డఁగకమున్నె -  యీ య సురావళి  యీ ల్గ కమున్నె,  సీ తఁ   బుచ్చుఁడు వేగ  శ్రీ రాముకడకు -  సీ తఁ   దెచ్చినకీడు  చేఁ   జేతఁ గుడుపు  ధ ర్మా త్ముఁ డౌ రామ  ధ రణీశ్వరుండు -  ధ ర్మం బువలననే  త గ నుండు జయము   భావం: ఆ వానర వీరులు చెలరేగక ముందే, కోటలు వారి ద్వారా కూలక మందే, లక్ష్మణుడి బాణవర్షము రాక ముందే, శ్రీరాముని కోపాగ్ని రాజుకోక మందే, ఆ అగ్నివలన లంకా నగరము నాశనము కాక ముందే, రాక్షసజాతి చనిపోక ముందే, వేగమే సీతను శ్రీరాముని వద్దకు పంపించు, సీతను తీసుకువచ్చిన పాపము అనుభవించు, ధర్మాత్ముడైన శ్రీరాముడుకు ధర్మము వలననే గెలుపు తధ్యము. ఈలుగు  = చచ్చు పుచ్చు  = పంపు -- రంగనాథ రామాయణం - PDF -  ht...

కావ్య భాష - పత్రికల భాష - పోలిక

 సరదాగా కొన్ని చొప్పదంటు ప్రశ్నలు. పోతన భాగవతంలోని కావ్యభాషలో ఏ అక్షరం ఎక్కవ వాడబడినది? పొడి అక్షరాలు ఎక్కువ వాడబడ్డాయా లేకపోతే సంయుక్తాక్షరాలా? ద్విత్వాలా? అసలు ఎన్ని అక్షరాలు వాడబడ్డాయి? ఏ అక్షరం ఎన్నిసార్లు వాడబడినదో ఒక పట్టిక తయారుచేయచ్చా? అలాగే, ఈ కాలంలోని వార్తాపత్రికలలోని తెలుగు భాషకు కూడా ఒక అక్షరాల పట్టిక తయారుచేసి, పోతన భాగవతం ద్వారా వచ్చిన అక్షర పట్టికతో పోలిస్తే ఏమవుతుంది? ఏమి విషయాలు తెలుకోవచ్చు? మొబైల్ యాప్స్ చేసిన అనుభవంతో ఇలాంటి గణాంకాల పట్టిక ఒకటి తయారు చేసాను. ఈ క్రింది పట్టిక లోని మొదటి రెండు నిలువరసలు చూడండి. పోతన భాగవతంలో ఎక్కవగా వాడబడిన మొదటి 25 అక్షరాలు. మూడవ వరుసలో ఆ పాతిక అక్షరాలు, వార్తాపత్రికలలో, ఎలా వాడబడినాయో గణాంకాల శాతం. పోతన భాగవతం ~1500 CE వార్తాపత్రికలు - 2020 CE న 3.66% 2.14% ల 2.83% 1.99% ము 2.66% 0.62% ని 2.23% 1.97% డు 2.18% 0.92% అ 2.07% 1.66% న్ 2.06% 0.41% ను 2.02% 0.98% క 1.93% 1.70% లు 1.81% 2.19% త 1.71% 1.41% వ 1.62% 1.58% ర 1.61% 1.47% మ 1.46% 1.34% ప 1.39% 1.25% వి 1.24% 0.86% బు 1.15% 0.17% గ 1.13% 0.76% ద 1.13% 0.92% రు 1.12% 1.25% ...