69-76 : హనుమంతుడు లంకలో వెతకుట - 2 - రంగనాథ రామాయణం - ద్విపద కావ్యం

సందర్భము - హనుమంతుడు లంకలో సీతాదేవి కోసం, రకరకాల ప్రదేశాలన్నీ వెతికిన తరవాత ప్రముఖుల ఇళ్లు వెతికాడు.

సుందరాకాండ: #69 - #76

మాడువు ల్పరికించి ణిమయం బైన - మేల వాడల మిగులఁ జెన్నైన
మంత్రులయిండ్లు సామంతులయిండ్లు - తంత్రిపాలుర యిండ్లు దైవజ్ఞులిండ్లు
నావిభీషణుగేహ తికాయుగృహము - దేకాంతునియిల్లు త్రిశిరుమందిరము
గంభీరమగు కుంభర్ణుని నెలవు - కుంభునాలయము నికుంభుసద్మంబు
శ్రీమించు నయ్యింద్రజిత్తుని నగరు - నాహోదరుగేహ నాదిగా నయిన
నుజనాథులనికేన పంక్తు లచటఁ - నుఁగొంచు నద్భుతక్రాంతుఁడై వారి
యంతఃపురంబుల నంతయు వెదకి - కాంతాజనంబులఁ లయంగ నరసి
వెండియు దనుజుల వేశ్మముల్ గలయ - నొండొండఁ గనుఁగొంచు నొక్కొక్కచోట

భావం: మిద్దెలు, మేడలు, మంత్రులు, సామంతులు, విభీషణుడు, అతికాయుడు, దేవకాంతుడు, కుంభకర్ణుడు, కుంభునుడు, నికుంభుడు, ఇంద్రజిత్తు మొదలైన వారి ఇళ్లు వెదకుతూ అక్కడ ఉన్న వింతలూ విశేషాలకు ఆశ్చర్యపడుతున్నాడు.

--
మాడువు = మిద్దె
అరసి = వివరము తెలిసికొని
వేశ్మము = గృహము
తంత్రి = త్రాడు

--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php

Comments