అయోధ్యాకాండ: 444-459 - లక్ష్మణుని కోపము - రంగనాథ రామాయణం

 సందర్భము: శ్రీరాముడు వనవాస నిర్ణయము విని లక్ష్మణుడు ఆవేశముతో మాటలాడుట.

అయోధ్యాకాండ: 444-459


గఁటిమి దిగనాడి మానంబు విడిచి - గు నుత్తమ క్షత్ర ర్మంబు వదలి 
వాలిన తేజంబు మ్ముగాఁ జేసి - యే యీ దీనోక్తు లిట్లాడ నీకు ?
భావం: (రామా!) మగతనాన్ని వదలి, ఆత్మగౌరవం వదలిపెట్టి, ఉత్తమ క్షత్రియ ధర్మము వదలి, నీ శక్తిని విడనాడి ఈ దీనమైన పలుకులు ఎందుకు నీకు?

క్కటా వీతజ్ఞుఁగు తండ్రి పనుపు - స్రుక్కగ ధిక్కరించుట కాదుకాక
కామాతురుఁడు పాపర్ముండు వృద్దుఁ- డేమిటి కీరాజు నింతపాటింపఁ? 
గై కేయి కిచ్చి బొంకఁగనేర ననుచు - నీకిచ్చి యోడక నేఁడెట్లు బొంకె? 
రి వసిష్ఠాదు లందఱు వినఁగ - డఁగి నిన్ బట్టంబు ట్టెదనన్న
లుకు సత్యంబుగాఁ బాటింపవలదె? - లఁపంగ నది యసత్యముగాదె తొలుత
నెక్కడి దశరథుం ?డెక్కడివరము? - లెక్కడి భరతుండు ?నెక్కడికైక 
భావం: అయ్యో! చేతకాని తండ్రి వెళ్లమన్న మాట ధిక్కరించుటం అనిపించుకోదు, ఒక కామాతురుడు, పాపకర్ముడు, వృద్ధుడు అసలు రాజేనా? ఆ మాట నీవు పాటించవలెనా? కైకేయికి ఇచ్చిన మాట తప్పనంటున్న వాడు, నీకిచ్చిన మాట ఎలా తప్పుతాడు? వసిష్ఠుడు మొదలైన వారందరూ వింటుండగా నీకు పట్టము కడతానని అన్న మాట పాటించ వలసిన అవసరం లేదా? ఆలోచిస్తే ఇది అసత్యము కాదా? ఎక్కడి దశరథుడు? ఎక్కడి వరములు? ఎక్కడి భరతుడు? ఎక్కడి కైక?  

విను మేను నిజముగా విల్లెక్కువెట్టి - కొనియున్న నన్ను మార్కొన నెవ్వఁడోపు ?
తుని మొదలుగాఁ గవారిఁ జంపి - నెసి యీపుర మెల్ల నీఱు గావింతు ;
రిహర బ్రహ్మాదు డ్డమై రేని - మిడి తోలి యుద్ధము సేయువాఁడఁ, 
భావం: వినుము, నేను నిజముగా విల్లు ఎక్కు పెట్టితే నన్ను ఎదుర్కొని ఎవ్వడు ఆపగలడు. భరతునితో మొదలు పెట్టి శత్రువలను చంపి, ఈ అయోధ్యను నీరుకార్చుతాను. త్రిమూర్తులు అడ్డమొచ్చినా సరే, తరిమి కొట్టి యుద్ధము చేస్తాను.

నీయ కేయూర కంకణాలంకృ - ములు మనోజ్ఞ చంన చర్చితములు 
గునా భుజమ్ముల భిషిక్తు జేసి - తురఁ జంపుదుఁ బాల్పడి యిపుడె; 
పాటింప నావంటి బంటు గల్గియును - నేటికి సామ్రాజ్య మెల్ల వర్ణింప ?
వుల కేఁగెద నునట్టి బుద్ది - విడిచి కౌసల్యకు వేడ్కలుప్పొంగ
నెట్టనఁ గడిమిమై నిజశక్తి మెఱసి - ట్టంబుఁ బూనుచుఁ బ్రజఁల బాలింపు
భావం: కమనీయమైన కేయూరము, కంకణములతో అలంకరించి, మనోహరమైన చందనాల పూతలతో, నా చేతులతో అభిషిక్తుని చేసి, అడ్డువచ్చిన శత్రువులను చంపివేస్తాను. అసలు, నా వంటి బంటు ఉండి కూడా, సామ్రాజ్యము పాలింపకుండా అడవులకు వెళ్లాలనే బుద్ధి ఎందుకు? కౌసల్యకు సంతోషం కలిగించు, నీ శక్తిని చూపి పట్టం చేపట్టి ప్రజలను పాలించు!

--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/

Comments