361-367 - రావణుడికి మండోదరి బోధచేయుట - రంగనాథ రామాయణం - ద్విపద కావ్యం

సందర్భం: అశోకవనంలో ఉన్న సీతాదేవిని రావణాసురుడు నానా మాటలు అన్నాడు, చంపుతానని బెదిరించాడు. సీతాదేవి తృణీకరించింది. మండోదరి రావణుడికి బోధచేసింది.

సుందరాకాండ: #361-#367

మ్రుచ్చిలి పరసతి మునుఁ దెచ్చు టొకటి - చెచ్చెఱ భువి నిందఁ జెందుట రెండు
తెగువ తోడుతఁ బట్టి తెచ్చిన మొదలు - గఁగొని యుండు టేర్పరుపఁగా మూఁడు
ర దుర్బద్ధి నాయువిదను గూడి - నుభవించెద నను టారయ నాల్గు
 నుత్తమస్త్రీలఁ డఁగి పల్మాఱు - విరాని పల్కులు వెసఁ బల్కు టేను
గా మణఁపలేక కామినిఁ జంపఁ - దా ది నెంచుట నుజేశ యాఱు
 వెంచనేర కెంయుఁ జేసి తుదిని - గఁటిమి వోవుట ఱియును నేడు
నేఁడు చేటులు నయ్యె నీయింతి వలన - నేఁడు గడపఁరాదు నిజముగా నెన్నఁ
బొరి పాతకంబులఁ బుట్ట యీ మేను - దొరఁగిన సద్గతి దొరకునె నీకు

భావం: దొంగలాగా పరస్త్రీని తీసుకుని రావటం మొదటిది, దాని వలన చెడ్డపేరు రావడం రెండవది, తెచ్చినప్పటి నుండి ఆమెపై పగబట్టినట్టుగా ఉండటం మూడవది, ఆమెను బలాత్కరించెదను అనటం నాలుగవది, ఎవరూ వినలేని మాటలతో ఆమెను దూషించటం ఐదవది, కామంతో ఆమెను చంపుతాననటం ఆరవది, ఇదంతా మగతనమనుకోవటం ఏడవది - ఆ సీతాదేవి వలన ఏడు తప్పులు చేసినావు. ఇన్ని పాపాలు చేసిన నీకు సద్గతులు దొరుకుతాయా?

--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php

Comments