యుద్ధకాండ - 104-115 - యుద్ధానికి కపివీరుల ఉత్సాహము
సందర్భము: లంక మీదకు యుద్ధానికి సిద్ధం అవమని రాముని ఆజ్ఞ విని కపి వీరులు ఉత్సాహంతో బయలుదేరి నడుస్తున్నారు.
యుద్ధకాండ: 104-115
నప్పుడు కపివీరు లందఱు చెలఁగి - యప్పరమేశ్వరుఁ డానందమొంద
నారవంబున మ్రోసె నాకాశవీథి - నారవంబున భూమి యటునిటు పడియె
నారవంబునఁ బెల్చ నద్రులు వణఁకె - నారవంబున మ్రొగ్గె నాదిగ్గజములు.
నారవంబున భార మయ్యె శేషునకు - నారవంబునఁ గూర్మ మణఁచె శిరంబు
నారవంబున మ్రోసె నాకాశవీథి - నారవంబున భూమి యటునిటు పడియె
నారవంబునఁ బెల్చ నద్రులు వణఁకె - నారవంబున మ్రొగ్గె నాదిగ్గజములు.
నారవంబున భార మయ్యె శేషునకు - నారవంబునఁ గూర్మ మణఁచె శిరంబు
భావం: యుద్ధానికి శ్రీరాముని పిలుపును విన్న కపివీరులు ఉత్సాహంతో గర్జించారు. ఆ గర్జనకు దిక్కులు పిక్కటిల్లాయి. భూమి కంపించింది. పర్వతాలు ఊగిసలాడాయి. అష్టదిగ్గజాలు తలవంచాయి. భూమిని మోసే ఆదిశేషునికి బరువెక్కింది. ఆదికూర్మము తలవంచింది.
ఇటుసేన నడవంగ నెగసినధూళి - పటలంబు మిన్నంది బహువర్ణములను
ఆరవంబున భారమై యిల నెసఁగు - తోరంపు నిశ్వాస ధూమంబు లనఁగ
భావం: అశేషమైన వానర సేన నడుస్తుంటే పైకి ఎగసిన ధూళి, ఆ వీరులు భీకర గర్జనలకు భూమికి భారమై, భూమి వదిలే పెద్ద నిశ్వాసమా అన్నట్టుగా ఉన్నది.
నప్పుడు ముంగలి యై నీలుతోడ - నొప్పు సైన్యంబులత్యుగ్ర తుండముగ
నిరుదిక్కులందును నేపారినడుచు - తరుచరబలము లుద్దత పక్షములుగ
స్ఫురణ మొప్పఁగ మధ్యమున వచ్చువారు - ధరణీతలేశుడు తనయాత్మ గాఁగఁ
గడఁగ సొంపారి చక్కఁగ వెన్కఁ గాచి - వడివచ్చుసైన్యంబు వాలంబుగాఁగ
నురగపాశంబుల నొందంగ నున్న - తరణి వంశజు నవస్థలు తొలఁగింప
గరుడుండు భూస్థలిఁ గైకొని నడచు - కరణి నొప్పారె మర్కట మహాసేన
భావం: వానర వీరుడైన నీలుడు ముందర ముక్కులాగా, ఇరుప్రక్కల నడచు సైన్యములు రెండు రెక్కలుగా, మధ్యలో ఉన్న శ్రీరాముడు ఆత్మలాగా, వెనుకనే వచ్చు సైన్యంబు తోకలాగా - ఒక పాముచేత చిక్కి బాధలలో నున్న జానకి అవస్థలు తొలగించడానికి, గరుత్మంతుడు భూమి మీద నడుస్తున్నట్టుగా ఉన్నది - ఆ వానర మహాసేన.
--
ఆరవము = నినదము, మోత
ఎసగు = అతిశయించు
తుండము = పక్షిముక్కు
పక్షములు = రెక్కలు
ఉరగ = పాము
--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
Comments
Post a Comment