అరణ్యకాండ: 1064-1068 - జటాయువు హెచ్చరిక - రంగనాథ రామాయణం
సందర్భము: జటాయువు రావణాసురుని అడ్డగించుట.
అరణ్యకాండ: 1064-1068
"నిలు నిలు నిలు పోకు నిలు పోకు పోకు - నిలు నిలు రఘురామనృపచందుదేవిఁ
గుటిలరాక్షస యెందుఁ గొనిపోయెదింక - నెటుపోయె దెటుపోయె దెందుఁబోయెదవు
పోయినఁ బోనీను బోనీను నిన్ను - వేయుదు ఖండింతు విదళింతుఁ ద్రుంతు
దండింతు, దండింతుఁ, దల లుత్తరింతుఁ - జెండు బెండుగ" నంచు సీత నీక్షించి
"యోడకోడకు దేవి యుగ్రరాక్షసుని - నీడాడి నీచెఱ నేవిడిపింతు"
భావం: "ఓ రాక్షసా! ఆగాగు..ఆగాగు..ఆగాగు. శ్రీరాముని భార్యను ఎక్కడకు తీసుకొని పోతున్నావు? నిన్ను పోనీయను. నిన్ను ఖండించి, ముక్కలు చేసి, దండించిన, తల తీసివేస్తాను" అని తరువాత సీతను చూసి, "భయపడకు, భయపడకు తల్లీ! ఈ రాక్షసుని అడ్డగించి, నిన్ను ఈ చెరనుండి విడిపిస్తాను" అనెను.
--
ఉత్తరించు = ఖండించు
ఉత్తరించు = ఖండించు
ఈడాడు = అడ్డుపడు
ఓడు = భయపడు
--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
Comments
Post a Comment