అయోధ్యాకాండ: 1572-1598 - రాముడు భరతుడిని క్షేమమడుగుట - రంగనాథ రామాయణం

సందర్భము: తనను అయోధ్యకు తోడ్కొని పోదామని వచ్చిన భరతునితో శ్రీరాముని పరామర్శ.

అయోధ్యాకాండ: 1572-1598

ణిజకును సుమిత్రా తనూజునకు - త శత్రుఘ్నులు ప్రణమిల్లి కొలువఁ 
గుపీఠముల నిల్వఁ గోరి రాఘవుఁడు - రథు సేమంబు ల్లుల శుభము
లుమాఱు నడుగుచు రత! నీవేల - యియేల కింత ద వ్వేగుదెంచితివి? 
భూలాధీశు పంపున రాజ వగుచు - నీతితో, జేయుదే నీవు రాజ్యంబు?
భావం: సీతకు, లక్ణ్మణునకు భరత శత్రఘ్నులు నమస్కరించిన పిదప, వారిని దర్భాసనాల మీద కూర్చుండమని కోరి, శ్రీరాముడు, వారిని దశరథుని క్షేమము, తల్లుల శుభము పలుమార్లు అడుగుచు, "భరతా! ఇలా ఎందుకు ఇంత దూరం వచ్చావు? దశరథుని ఆజ్ఞ మేరకు రాజుగా నీతితో రాజ్యము చేస్తున్నావా?"

రథేశునకు సత్యప్రకాశునకు - విద పుణ్యునకుఁ గావింతువే పూజ ?
ల్లుల నెల్ల నార ముల్లసిల్ల - నుల్లంబు చల్లఁగా నూఱడింపుదువె ?
కోవిదు మత్కుల గురుఁ దపోనిష్ఠు - నా సిష్ఠు గరిష్ఠు ర్చించి నీవు 
గ్నిహోత్రముల సంధ్యాకాల నియతి - గ్నంబు గాకుండఁ బాలింతె నీవు
భావం: "సత్యప్రకాశుడు, పుణ్యాత్మకుడు అయిన దశరథునకు పూజలు చేస్తున్నావా? తల్లులను చాలా ఆదరముతో, మనసు సంతోషపడు నట్లుగా, చల్లగా చూస్తున్నావా? పండితులు, మన కులగురువులు, తపోనిష్ఠులు అయిన ఆ వసిష్ఠులను అర్చిస్తున్నావా? సంధ్యాకాలముల యందు చేయు అగ్నిహోత్ర కార్యక్రమములు తప్పకుండా పాటిస్తున్నావా?"


సునులౌ మంత్రుల చొప్పెల్ల దెలిసి - వియంబు నా మంత విధి యెఱుంగుదువె? 
రరాత్రుల లేచి ర్థచింతనము - నిపుణతఁ జేయుదె నీవు నిత్యంబు ?
సి యుత్తమ మధ్యమాధమ జనుల - వెవుతోఁ బనిగొందువే తగినట్లు? 
వారియెడ నైన గవున దండ - నురక్తి జేయుదె పరాధ మెఱిఁగి ?
తిమంతు సకల సమ్మతు స్వామిహితుని - విత విక్రము సైన్య విభుఁ జేసినావె?
భావం: "మంత్రులు చెప్పిన విధముగా విజయము చేకూరునట్లు మంతనాలు చేస్తున్నావా? తెల్లవారా జామునే లేచి, న్యాయ చింతన చేస్తున్నావా? ఉత్తమ, మధ్యమ, అధమ జనులను నీవు చక్కగా పని చేయిస్తున్నావా? నీ వారైనా సరే తప్పు చేస్తే తగిన విధముగా దండిస్తున్నావా? తెలివి కలవాడిని, అందరు మెచ్చినవాడిని, నీ క్షేమం కోరేవాడిని, ధైర్యము కలవాడిని సైన్యాధ్యక్షునిగా చేసావా? "


కొలిచినవారికిఁ గోరి జీతములు - నిలువఁ గాకుండ నిచ్చలు నొసంగుదువె ?
చారుల వలన రాష్ర్రముల వర్తనము - వైరుల తెఱఁగు సర్వము నెఱుంగుదువె ?
జాలిఁ దూలెడి పేదసాదల మొరలు - వాలాయముగ విందువా గర్వ ముడిగి?
భావం: నిన్ను కొలిచే వారికి జీతములు ఆలస్యము కాకుండగ ఇస్తున్నావా? గూఢచారుల వలన రాజ్యములో శత్రువులు చేస్తున్న సర్వము తెలుసుకుంటున్నావా? కష్టాలు పడుతున్న పేదసాదల మొరలు నిగర్విగా తప్పకుండా వింటున్నావా?" 


ర్మిలి వర్ణాశ్రమాచార విహిత - ర్మంబు లరయుదె డఁబడకుండఁ ?
జోరుల జారుల సుడియంగనీక - వాల దండింతె దలక పట్టి? 
తురంగ బలముల న్నాహ పటిమ - తి యుక్తి జూతువె ప్పటప్పటికి ?
ధాన్య వస్తు సద్భట సమేతముగ - మునుపుగా, గడిదుర్గముల నుంచినావె ?
భావం: ప్రేమతో, వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తున్నావా? దొంగలు, వ్యభిచారులు తిరుగనీయక వారిని పట్టుకొని దండిస్తున్నావా? ఎప్పటికప్పుడు చతురంగ బలాలను సన్నద్ధముగా ఉంచుతున్నావా? ధనధాన్య వస్తువులను ముందుగానే రాజ్యము ఎల్లలోని కోటలలో ఉంచుతున్నావా?"


న్యాయములు సేసి ర్థముల్ గొనక - మాన్యతఁ బ్రోతువె ఱి కాపు జనుల? 
ర్థ లోభమున విప్రాగ్రహారముల - ర్థ మెత్తవు గదా రవీస మైన ?
నెపుడు గోబ్రాహ్మణ హితము గోరుచును - నిపుణుండవై ధర్మ నిష్ఠనుండుదువె
భావం: "కాపు జనుల వద్ద, అన్యాయంగా ధనాన్ని తీసుకోకుండా, గౌరవంగా చూసుకుంటున్నావా? ధన లోభముతో విప్రుల అగ్రహారాల మీద అరవీసమైనా పన్ను వేయవు కదా? గోవులు, బ్రాహ్మణుల మంచిని కోరుతూ ధర్మ నిష్ఠుడవై ఉంటున్నావా?"


క్తిత్రయంబును డ్గుణంబులును - క్తి పంచాంగముల్ తురుపాయములు 
దునాల్గు రాజ పాపంబులు దెలిసి - యుఁడై మనుధర్మ శాస్త్ర సంగతిని 
దేతా పితృ మహీ దేవతాపూజ - గావించి స్వర్గంబుఁ గాంచు భూవిభుఁడు 
నీవును నారీతి నీతిరాజ్యంబు - గావింతువే యంచు కాకుత్స్థుఁ డడుగఁ
భావం: "రాజనీతిని తెలిసి, సహృదయంతో మనధర్మ శాస్త్ర సంగతిని, దేవతలను, పితృదేవతలను, బ్రాహ్మణులను గౌరవించి నీవు ఈ విధంగా నీతమంతమైన రాజ్యము చేస్తున్నావా?" అని శ్రీరాముడు అడుగ..

--
కుశ = దర్భ
చొప్పు = మార్గము
మంత = ఆలోచించువాడు
అపరాత్ర = తెల్లవారుజాము
అర్థ = ధనము, న్యాయము
వెరవు = ఉపాయము, విధము
వాలాయము = తప్పకుండా
అర్మిలి = ప్రేమము

--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/

Comments