Posts

Showing posts from January, 2021

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 39

ఈ భాగంలో పంచభూతాలకు అధిపతి అయిన భగవంతుని గురించిన రెండు పద్యాలను చూద్దాం. రెండూ ఎనిమిదవ స్కంధంలోనివి. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. ఎనిమిదవ స్కంధంలోని రెండవ ఘట్టం, సముద్ర మథనం లోనిది. దేవతలు, రాక్షసులు మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని సముద్రాన్ని చిలుకుతున్నారు. మొదట హాలాహలం పుట్టింది. అందరూ వెళ్లి, "పంచభూతాలకూ అధిపతివి నీవే" అని శివుడిని శరణుకోరుతున్నారు.  రెండవది. ఎనిమిదవ స్కంధంలోని మూడవ ఘట్టం. వామన చరిత్రలోనిది. శ్రీమహావిష్ణువు, వామన అవతారమెత్తి బలి చక్రవర్తిని మూడు అడుగులు అడిగాడు. బలి తాను ఇచ్చిన మాట ప్రకారం దానం చేసాడు. వామనుడు, భూమి, ఆకాశాన్ని ఆక్రమించి మూడవ అడుగుతో బలి "తల"ను తొక్కివేసి, బంధించాడు. బ్రహ్మదేవుడు వచ్చి, "పంచభూతాలకూ అధిపతివి నీవే! అంతటి దానపరుడుని బంధించడం న్యాయమా!" అని అడుగుతున్నాడు. 8-222-సీ.   (శివునితో బ్రహ్మాది దేవతలు) భూతాత్మ! భూతేశ! భూత భావనరూప! దేవ! మహాదేవ! దేవవంద్య! యీ లోకముల కెల్ల నీశ్వరుండవు నీవ; బంధమోక్షములకుఁ బ్రభుఁడ వీవ; యార్త శరణ్యుండ వగు గురుండవు నిన్నుఁ; గోరి భజింతురు కుశలమతులు; సకల సృష్టిస్థితిసంహారకర్తవై; బ్రహ్మ

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 38

ఒక ప్రశ్నకు బదులు చెప్పడం కన్నా జోడీ ఏముంటుంది? అది కూడా ఒక రకమైన ద్వంద్వమే. ఈ భాగంలో ఇటువంటి "ప్రశ్న-బదులు" చూద్దాం. ముందుగా కథా సందర్భం. ఎనిమిదవ స్కంధంలోని వామన అవతార ఘట్టంలోనివి. శ్రీమహావిష్ణువు, కపట వడుగు వేషంలో బలి చక్రవర్తి దగ్గరకు వెళ్లాడు. బలి చక్రవర్తి ఏమి కావాలో కోరుకోమని తన దగ్గర సంపద చిట్టా చదివేడు. వామనుడు తనకు మూడు అడుగుల మేర చాలునని చెప్పాడు. "అంతేనా? ఇంకా ఏమైనా కోరుకో" అంటున్నాడు బలి చక్రవర్తి. "ఈ మాత్రం చాలు" అని బదులు ఇస్తున్నాడు వామనుడు. ఇవిగో పద్యాలు. 8-570-మ. (బలి ప్రశ్న) "వసుధాఖండము వేఁడితో? గజములన్ వాంఛించితో? వాజులన్ వెసనూహించితొ? కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో? పసి బాలుండవు; నేర వీ వడుగ; నీ భాగ్యంబు లీపాటి గా కసురేంద్రుండు పదత్రయం బడుగ నీ యల్పంబు నీ నేర్చునే?" 8-572-మ. (వామనుడి బదులు) గొడుగో, జన్నిదమో, కమండలువొ, నాకున్ ముంజియో, దండమో, వడుఁ గే నెక్కడ భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్. ఇప్పుడు ద్వంద్వ శిల

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 37

 ఈ భాగంలో వామనుడి నడకను వర్ణించే పద్యాలను చూద్దాం. అన్నింటి కథా సందర్భాలు ఒకటే. అష్టమ స్కంధంలోని వామనావతార ఘట్టంలోనివి. కశ్యప మహర్షి, అదితి పుత్రుడయిన వామనుడు, ఇంద్రునికి  మరలా రాజ్యం ఇప్పించాలనే ఉద్దేశంతో బలి చక్రవర్తి దగ్గరకు వెళ్తున్నాడు. ఆ సమయంలో బలి గొప్పయాగం చేస్తున్నాడు. పొట్టివాడయిన వామనుడు అందరిని పలుకరిస్తూ బలి చక్రవర్తి ఉన్న చోటుకు చేరుకున్నాడు. ఇవిగో పద్యాలు. 8-526-క. హరిహరి! సిరియురమునఁ గల  హరి హరిహయు కొఱకు దనుజునడుగన్‌ జనియెన్‌ బరహితరతమతియుతు లగు  దొరలకు నడుగుటలు నొడలి తొడవులు పుడమిన్‌.  8-538-క వెఱచుచు వంగుచు వ్రాలుచు  నఱిముఱి గుబురులకుఁ జనుచు హరిహరి! యనుచున్‌ మఱుఁగుచు నులుకుచు దిరదిరఁ  గుఱుమట్టపు పొట్టివడుగు గొంత నటించెన్‌ 8-541-క వెడవెడ నడకలు నడచుచు  నెడనెడ నడుగిడఁగ నడరి యిల దిగఁబడఁగన్‌ బుడిబుడి నొడువులు నొడువుచుఁ  జిడిముడి తడఁబడఁగ వడుగు సేరెన్‌ రాజున్‌ ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. మూడూ కంద పద్యాలు. మూడూ సర్వలఘువు కందాలు కాకాపోయినా, లఘువులు ఎక్కువగా ఉన్న పద్యాలు. మూడూ పొట్టివాడైన వామనుడి నడకను వర్ణిస్తున్న పద్యాలు. ఒక పొట్టివాని నడకకు పొడుగువాని నడకకు తేడా ఉంటుంది.

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 36

ఈ భాగంలో, చాలా రోజుల తరువాత ఇంటికి వచ్చిన భర్త, భార్యని అడిగే కుశల ప్రశ్నల పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. ప్రథమ స్కంధంలోనిది. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చాడు. భార్యలను కుశలప్రశ్నలు వేస్తున్నాడు. రెండవది. అష్టమ స్కంధంలోని వామనావతార ఘట్టం ఆరంభంలోనిది. కశ్యప మహాముని ఎన్నో రోజుల తపస్సు తరువాత ఇంటికి వచ్చాడు. తన భార్య అదితిని కుశల ప్రశ్నలు వేస్తున్నాడు. ఇవిగో పద్యాలు. 1-268-మ. (శ్రీకృష్ణుడు భార్యలను పరామర్శ చేయట) "కొడుకుల్ భక్తివిధేయు లౌదురు గదా? కోడండ్రు మీ వాక్యముల్గ డవంజాలక యుందురా? విబుధ సత్కారంబు గావింతురా?  తొడవుల్ వస్త్రములుం బదార్థ రస సందోహంబులుం జాలునా? కడమల్ గావు గదా? భవన్నిలయముల్ గల్యాణయుక్తంబులే? 8-463-మ. (కశ్యపుడు అదితిని పరామర్శ చేయుట) తెఱవా! విప్రులు పూర్ణులే? చెలగునే దేవార్చనాచారముల్? తఱితో వేలుతురే గృహస్థులు? సుతుల్ ధర్మానుసంధానులే? నెఱి నభ్యాగత కోటి కన్న మిడుదే? నీరంబునుం బోయుదే? మఱ లే కర్థుల దాసులన్ సుజనులన్ మన్నింపుదే? పైదలీ! ఇప్పుడు ద్వంద్వశిల్పం చూద్దాం. రెండూ మత్తేభవృత్త పద్యాలు. రెండింటిలోనూ భార్యను భర్త కుశ