అరణ్యకాండ: 1477-1489 - చెట్టు వర్ణన - రంగనాథ రామాయణం
సందర్భము: శ్రీరాముడు ఋష్యమూక పర్వత ప్రాంతం చేరి లక్ష్మణునితో మాటలు.
అరణ్యకాండ: 1477-1489
వనవాస మిటు తుద వచ్చిన మొదలు - ఘనమైన యద్రులు ఘనపుణ్య నదులు
దరమిడి కంటిమి ;ధారుణి నిట్టి - తరు వెందుఁ గాన మీ తరువుకు సవతు
సురపతి మొదలగు సురలెల్లఁ గూడి - కరమర్థి నీతరు గావించి రొక్కొ?
యజుఁడె యీతరువున కాయువుఁ బోసి - నిజముగా నిచ్చట నిలిపినాఁ డొక్కొ
రవి సుతు తపమున రాగిల్లి బ్రహ్మ - భువిని నీతరువును బుట్టించినాఁడొ ?
సేవించి యమృతంబు చేకొని సురలు - భావించి రవిసుతు పక్షంబుగలిగి
యరయంగ మేలైన యమృతంబుతోడఁ - బురణింపఁ దరువుగాఁ బుట్టించినారొ ?
యినునితో నిష్టంబు లింపొందఁ జేయఁ - జను ధర్మమున నుండి శాఖ లున్నతము
లష్టదిక్కులకును ననువందఁ బాఱి - యిష్టఫలంబుల వీఁ గోరినట్లు
పఱచు శాఖల రుచి ప్రభ నొప్పుమీఱి - తెఱచి పర్ణంబులు తేజంబు గొప్ప
రవిదృష్టి చొర నీదు ;రాత్రులఁబేర్మి - దవిలి యా శశిదీప్తి దనుఁగాన నీదు
ఫలము లాయమృతపు ఫలములకంటెఁ - గలశతగుణములఁ గడునొప్పుదాని,
తరురాజపట్ట మీ ధాత్రిపై వేడ్కఁ - గరమర్థి దివిజులు గట్టరో ప్రీతి ?

భావం: లక్ష్మణా! ఈ చెట్టు చూడు. వనవాసములో మనము గొప్ప కొండలు, నదులు చూసాము. కానీ, భూమి మీద ఇటువంటి చెట్టు చూడలేదు. బ్రహ్మదేవుడే ఈ చెట్టును సృష్టించి ఇక్కడ నిలిపినాడేమో. ఆ సూర్యుని కుమారుని తపమునకు మెచ్చి బ్రహ్మ ఈ చెట్టును పుట్టించినాడేమో. ఆనాడు అమృతము తమకు లభింపజేసి నందులకు, సూర్యుని కుమారునకు తోడుగా, దేవతలు ఆ అమృతాన్ని కాస్త పోసి ఈ చెట్టును పుట్టించిరారేమో. సూర్యునితో స్నేహాన్ని చాటుతూ, అష్టదిక్కులకూ చక్కటి పండ్లను పంచుతున్నట్లు ఈ చెట్లకొమ్మల మీది పండ్లు ఉన్నాయి. విస్తరించిన కొమ్మలు, ఆకులు తమ ప్రకాశంతో ఆ సూర్యరశ్మిని చొరనీయకుండా ఉన్నవి. రాత్రి వేళల్లో వెన్నెల చూడనివ్వదు. ఈ పండ్లు అమృతఫలముల కంటే వంద రెట్లు బాగున్నాయి. ఈ చెట్టు ఈ భూమి మీద అన్నింటి కంటే పట్టం కట్టదగ్గది అని దేవతలే అంటారు.
--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
Comments
Post a Comment