అరణ్యకాండ: 1125-1131 - రావణాసురుడు గొప్పలు చెప్పుకొనుట - రంగనాథ రామాయణం

 సందర్భము: రావణాసురుడు సీతను అపహరించి లంకకు తీసుకుపోయి, ఆ పట్టణాన్ని చూపుట.

అరణ్యకాండ: 1125-1131

యివె నా నివాసంబు; లివె నా ధనంబు - లివె నా తురంగంబు లివి నా గజంబు; 
లివి యేను దివిజుల నెల్ల భంజించి -  తివుటమైఁ గైకొన్న దివ్యభూషణము ;
లిదె కుబేరుని గెల్చి యేను గైకొన్న - దికింపు గావించు ణిపుష్పకంబు ;
వీరె నా కుడిగముల్ వేర్వేఱఁ జేయు - చాణామర సిద్ధసాధ్య కామినులు
వారె నామాట గర్వమునఁ గైకొనక - కారాగృహంబులు గాసిల్లు సతులు ;
వె నాట్యశాల లల్లవె కేళివనము - లివి చంద్రశాల లో యిందీవరాక్షి ;
మర్థి నింతకుఁ ర్తవై నీవు - రుదార భోగింపు ఖిల సంపదల ;

భావం: "ఇవే నా నివాసాలు, ఇవే నా ధనరాశులు, ఇవే నా గుర్రాలు, ఇవే నా ఏనుగులు, ఇవి నేను దేవతలను ఓడించి సాధించిన దివ్యభూషణాలు, ఇది నేను కుబేరుడిని గెల్చి సాధించిన పుష్పక విమానము, వీరు నాకు సేవలు చేసే దేవతా స్త్రీలు, ఈ బంధీగా ఉన్న స్త్రీలు నా మాట విననవారు, అవి నాట్యశాలలు, అవి కేళీవనములు, అవి చంద్రశాలలు. నన్ను సేవించి ఈ సకల భోగాలనూ నీవు భోగింపుము."

--

తివుట = కోరిక
అరుదార = ఒప్పుగా

--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/

Comments