5-13 : హనుమంతుడు లంకను చూచుట - రంగనాథ రామాయణం - ద్విపద కావ్యం

సుందరాకాండ: #5 - #13 (page: 230, pdf page: 250)

 దక్షిణము చూచి ప్పు డిట్లనియె - టఁ ద్రికూటాద్రిపై మరెడుదాని
లక ధర్మార్థకామము ల్మూడు - పొదిగొన్న సిరివోలెఁ బొలుపొందుదాని
రావతీపురం బ్ధిమధ్యమునఁ - నీయగతి నొప్పు లిగినదాని
క కుబేరుతో లుకమై నచట - నెకొన్న కైవడి నెగడెడుదానిఁ 
కాలమును నధోతి నుండలేక - తెలివిమై భోగవతీనగరంబు
రాశి వెలువడి రి త్రికూటమున - వెసిన కైవడి విలసిల్లుదాని
నంబుధి యావరణాంబువు లాఁగఁ - బండిన ప్రభ నొప్పు బంగారుకోట
బ్రహ్మాండవిధముగాఁ రికింప నొప్పు - బ్రహ్మాద్యభేద్యమై రఁగెడుదాని
మొసి లోకములకు మొన యెక్కుడగుచుఁ - ....

భావం: అటు దక్షిణ దిశగా చూసి హనుమంతుడు ఇలా అనుకున్నాడు - "ఆ త్రికూట పర్వతం మీద, ధర్మ, అర్ధ, కామములు మూడు కలగలసి ఉన్నట్టుగా, దేవతల అమరావతీ పురం సముద్రం మధ్యలో ఉన్నట్టుగా, అలకాపురి రాజైన కుబేరుడు ఇంకా లంకలోనే నివాసమున్నాడా అన్నట్టుగా, భూమి మధ్యలో ఉండలేక సముద్ర గర్భంనుండి భోగవతీ నగరము బయటకు వచ్చి ఈ త్రికూటము మీద వెలసినదా అన్నట్టుగా, బంగారు రంగుతో వెలుగుతూ, బ్రహ్మాదులకు కూడా అభేద్యమైనదిగా, పైకి కనిపిస్తున్నది"

--
పూర్వకథ - కుబేరుడు తన రాజ్యమైన అలకాపురిని కోల్పోయి లంకలో నివాసమేర్పరచుకున్నాడు. వానిని వెళ్లగొట్టి రావణాసురుడు లంకను చేజిక్కించుకున్నాడని కథ.

పూర్వకథ - నాగులు పాతాళంలో ఉంటారు. వారి నగరము అత్యంత సుందరమైనది, దాని పేరు భోగవతీ నగరము.
--
త్రికూటాచలం = భూమి మధ్యలో ఉన్న స్థానం
త్రికూటం = మూడు శిఖరములు ఉన్న పర్వతం
నెగడు = వర్ధిల్లు
నలుకువ = బాధ, శ్రమ
మొన యెక్కుడు = పోవుటకు కష్టమనిపించు ప్రదేశము

--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php

Comments