Posts

Showing posts from June, 2018

రాగం తానం పల్లవి - ఒక పరిచయం

పరిచయం: “ రాగం తానం పల్లవి ” (రా.తా.ప), అంటూ సాగే పాట, శంకరాభరణం (1980) సినిమాలోనిది. వేటూరి వ్రాసారు. నా చిన్నప్పుడు, మా మేనమామ, మా అమ్మకు ఇంట్లోని ముగ్గురు పిల్లల క్షేమం అడుగుతూ, “రాగం, తానం, పల్లవి ఎలా ఉన్నారు?” అని ఉత్తరం వ్రాసాడట. మా అమ్మ, ఆ విషయం ఇప్పటికీ మరిపెంగా గుర్తుచేసుకుంటారు. నాకు చాలా కాలం, రా.తా.ప. అంటే ఫలానా సినిమాలోని పాట అనే తెలుసు. అసలు, రాగం-తానం-పల్లవి (రా.తా.ప - RTP ), నేటి కర్ణాటక సంగీత కచ్చేరీలలో ప్రదర్శించే ఒక ప్రక్రియ. ఈ వ్యాసం కార్ణాటక సంగీతంలోని ఈ ప్రక్రియ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారికోసం వ్రాసినది. ప్రవేశం ఉన్నవారు సరదాకి చదువుకోవచ్చును. సంగీతంలోని లోతులలోకి పోకుండా పైపైన గీసే రేఖాచిత్రం మాత్రమే. రా.తా.ప - రేఖాచిత్రం:  రా.తా.ప అనే ప్రక్రియను గాత్రం (vocal) లేదా వాయిద్య (instrument) విద్వాంసులు చేయవచ్చు. వీరిని ముఖ్యవిద్వాంసులనుకుంటే, వారితో పాటే “పక్క వాయిద్యాలు” కూడా ఉంటారు. ఈ పక్క విద్వాంసులు సాధారణంగా, పాటకు సాయం ( వయెలిన్ లేక/ఇంకా వీణ ) చేసేవారు, తరువాత లయకు సాయం చేసే తాళ వాయద్యాలు (percussion - మృదంగం లేక/ఇంకా ఘటం ). రా.తా.ప ను మూడు ఘట్టా