అయోధ్యాకాండ: 201-211 - కైక అలక దీర్చుట - రంగనాథ రామాయణం

సందర్భము: దశరథుడు, శ్రీరామ పట్టాభిషేకము నిర్ణయము చేసి, కైకేయి మందిరానికి వచ్చి, అలిగి నేలమీద పడుకున్న కైకను చూసి, అలుక తీర్చుటకు ప్రయత్నించుట. 

అయోధ్యాకాండ: 201-211

ఇందీవరాక్షి పూర్ణేందునిభాస్య - ఇందిందిరాలక! యేల యీయలుక 
ళింప నేలనే బాలేందు ఫాల ? - విరళ మృదుల పర్యంకంబు లుండ, 
గోల మృదుల దుకూలంబు లుండ - నీ మైల చీర నీవేల కట్టితివి? 
సిఁడి శలాకతోఁ బ్రతియైన మేన - బొసఁగ భూషణములఁ బూన వేమిటికి? 
పట్టి వెన్నెల చందమౌ నుదుటఁ - పట్టు లేల? నీలఁ పెట్టు పుట్టె? 
నీలాలకంబుల నిగ్గులుదేర - నే పాపటదీర్ప విన్నాళ్ళరీతిఁ ?
గెమ్మోవి కినుమడి కెంపు సంధిల్ల - మ్మతమ్మల మేల గైకోవు బాల !
జిలుఁగు వన్నెలతేట చిఱునవ్వుమొలక - మొపింప వేటికి ముఖచంద్రునందు 
నిది యేమి కైక !నీవిటు చిన్నవోయి - ది దూలి నీకింత రుగ నేమిటికి ?
నెవ్వరు నీదెస నెగ్గులు పలికి - రెవ్వరు మాటాడి రెదిరి నీతోడ 
వారి నెఱింగింపు వారిజ నయన - వారి వారింతు నెవ్వారల నైన

భావం: నల్లకలువల వంట్టి కన్నులు కలదానా, పూర్ణచంద్రుని వంటి ముఖము కలదానా, తుమ్మెదల వంటి ముంగురులు కలదానా, ఎందుకు ఈ అలుక? ఒత్తైన, మెత్తనైన మంచాలు ఉండగా, ఎందుకని నేలపై పవళించావు? కోమలమైన, మృదువైన బట్టలు ఉండగా, ఈ మైల చీర నీవు ఎందుకు కట్టుకున్నావు? బంగారు కమ్మ వంటి, నీ వంటి మీద ఆభరణాలు ధరించలేదేమి? కోపంతో, నీ తలకు ఆ కట్టు ఎందుకు? నీ తల దువ్వుకుని పాపట తీసుకోలేదేమి? నీ పెదవుల ఎరుపు రంగు ఇనుమడించేందుకు చక్కని తాంబూలము వేసుకోలేదేమి? నీ ముఖ మనే చంద్రునిలో వెలుగులు చిందే చిరునవ్వు లేదేమి? ఏమిటి కైక? నీవు ఇలాగ చిన్నబోయి, ఏమీ పట్టించుకోవటం లేదేమి? నిన్ను ఎదిరించి ఎవ్వరు నిన్ను నిందించారు? నాకు తెలియచేయి, వారు ఎవ్వరైనా సరే వారిస్తాను. 

--
ఇందీవరము = నల్లకలువ
ఇందిందిరము = భ్రమరము
అలక = ముంగురులు
అలుక = కోపము
అవిరళ = ఒత్తైన
పర్యంకము = మంచము
దుకూలము = సన్నటి, మెత్తటి వస్త్రము
శలాక = సన్నటి బద్ద
చలపట్టు = కోపగించు
ఇనుమడి = రెట్టించు
కమ్మతమ్మ = చక్కని తాంబూలము
ఎగ్గులు = నిందలు

--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/

Comments