Posts

Showing posts with the label పరిచయం

కుమారీ శతకం - పరిచయం

నిన్న అమ్మ ద్వారా తెలిసిన విషయం. 1960-1970ల కాలం వరకూ, "కుమారీ శతకం" అనే పద్యాలు ఆడవాళ్లకు నేర్పేవారట.  ఈ శతకంలో ఆడవాళ్లు,  అత్తవారింట్లో అందునా ఉమ్మడి కుటుంబాలలో, మెసలుకునే పద్ధతి గురించిన పద్యాలు ఉన్నాయి. నలుగురు ఉన్న కుటుంబాలలో ఎలా సర్దుకు పోవాలో చెప్పే పద్యాలు ఇవి.  కోపం చేయకు, బాధ పడకు, మనసులో పెట్టుకోకు, సర్దుకుపో, మాట విను - ఇలాంటి నీతులతో నడిచే పద్యాలు.  కాలక్రమేణా ఉమ్మడి కుటుంబాలు లేకపోవడంతో, మారిన విలువలతో ఆ పద్యాలకూ కాలం చెల్లింది.  ఈ పద్యాలు వ్రాసినది పక్కి వేంకటనరసింహ కవి. క్రింది లింకులో లభిస్తున్న పుస్తకం 1932లో ముద్రించబడినది. మొదటి ముద్రణ 1869లో జరిగినదని వికీపీడియా ద్వారా తెలుస్తున్నది. అన్నీ  కంద పద్యాలు. ఇదిగో ఆ పద్యాలకు లింకు.  https://archive.org/details/SaiRealAttitudeManagement-Telugu-Devotional-Spiritual-Free-eBooks-Satakalu/SH015-KumariShatakmu మచ్చుకు కొన్ని పద్యాలు: ఆ ట ల బాటలలో నే  మా ట యు రాకుండఁ దండ్రి  మం దిరమందున్ బా టి ల్లు కాపురములో  వా ట మెఱిగి బాలతిరుగ  వ లయు కుమారీ - #2 నో రె త్తి మాటలాడక...