కిష్కింధా కాండ: 33-41 - శ్రీరాముడు సీత గురించి బాధ పడుట - రంగనాథ రామాయణం
సందర్భము: ఋష్యమూక పర్వతం ప్రాతంలోని, ప్రకృతి శోభ చూసి, శ్రీరాముడు సీతాదేవి గురించి లక్ష్మణుడి దగ్గర బాధ పడుట.
కిష్కింధా కాండ: 33-41
నేమి చేయుదు ?నింక నెట్లు వేగింతుఁ? గామినీమణి సీతఁ గాంతు నెన్నటికిఁ ?
బంపా సరోవర ప్రాంత కాంతార - సంపద తోడ వసంతంబు గూడి,
చెలువై న చందాన సీతతోఁ గూడఁ - గలుగునే నాకు నొకానొకనాఁడు ?
ఈ పంపలోఁ దమ్ము లేఁ జూచినట్లు - భూపుత్రి వదన మెప్పుడు చూచువాఁడ ?
నిందు మీన నిహార మీక్షించి నటుల - నిందువదన చూపులెప్పుడు చూతు ?
జలపక్షు లిచ్చట జతగూడినట్లు - జలజాక్షి నెన్నఁడు జతఁ గూడువాఁడఁ ?
దేటి యిచ్చటఁ దమ్మి తేనె గ్రోల్కరణి - బోటి కెమ్మోవి నెప్పుడు గ్రోలువాఁడ?
నెక్కడి తలపోత? లెక్కడి సీత - యెక్కడ వెడసేత ?లివి యెట్లు పొసఁగుఁ ?
దమ్ముడ నీవయోధ్యకుఁ జను మింక - నెమ్మేనఁ బ్రాణంబు లిఁక నిల్పఁ జాల ;

భావం: నేను ఏమి చేయాలి? సీతను ఎప్పటికి చూస్తానో కదా! ఈ పంపా సరోవర ప్రాంతముతో, వసంతుడు కలసినట్లు, సీతతో నేను ఏనాటికైనా కలవగలనా? ఈ పంపా సరోవరంలోని భూమిని చూచినట్లు ఆ భూమిజ ముఖాన్ని ఎప్పుడు చూడగలనో కదా? ఈ అందమైన మంచు బిందువులను చూసినట్లుగా ఆమె ముఖాన్ని ఎప్పుడు చూస్తానో కదా? ఈ నీటిలోన పక్షులు జత కూడినట్లు సీతను ఏనాడు కలుస్తానో కదా? తుమ్మెద పద్మలోని తేనె గ్రోలినట్లు, ఆమె అధరామృతం ఎప్పుడు గ్రోలగలనో కదా? ఎక్కడి ఆలోచనలు, ఎక్కడ సీత, ఎక్కడ ఎడబాటు, ఏది ఎలా జరుగుతుందో? తమ్ముడా! నీవు ఇంక అయోధ్యకు వెళ్లిపో. నేను శరీరములో ప్రాణములు నిలుపలేను.
--
దమ్ము = తడి మట్టి
మీన = మీద
ఎడసేయు = ఎడబాటు, దూరము చేయు
తమ్మి = పద్మము
బోటు = ఎత్తైన
క్రెమ్మోవి = పెదవి
--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php
Comments
Post a Comment