అయోధ్యకాండ: 1499-1508 - భరతుడు తల్లులను పరిచయం చేయుట
సందర్భము: భరతుడు, అడవులకి వెళ్లిన శ్రీరాముడిని వెతుక్కుంటూ, తల్లులతోనూ సపరివారంతోనూ బయలుదేరాడు. మార్గమధ్యంలో భరధ్వాజ ఋషి ఆశ్రమంలో ఆగాడు. భరతుడు, భరధ్వాజ ఋషికి తన ముగ్గురు తల్లులనూ పరిచయం చేస్తున్నాడు.
అయోధ్యకాండ: 1499-1508
"ధీరాత్మ నృపుపెద్ద దేవులై యెల్ల - వారిలో వాసియు వన్నెయుఁ గాంచి
కడుపు చల్లఁగ రాముఁ గాంచియు వగల - నుడుకుచున్నది తద్వియోగాగ్నిశిఖలఁ
బరిచిత జన్మ సాఫల్య కౌసల్య - పరికింపు మిది మునిపతి సార్వభౌమ
కౌసల్య సతి వామ కర మంటఁ బట్టి - కైసేఁత లుడిపోయి గత పుష్పకర్ణి
కార శాఖయుఁ బోలి కైవ్రాలి యున్న - యీరామ శ్రీరాము నెడఁబాయ లేని
యాలక్ష్మణునిఁ గన్నయట్టి పుణ్యాత్ము - రాలు సుమిత్ర పరాకు! మునీంద్ర!
యే తల్లికై కానకేగె మాయన్న? - యేతల్లి కతమున నీల్గె మాతండ్రి ?
యేతల్లి కోర్కి నన్నింతకుఁ దెచ్చె? - నీతల్లి మాతల్లి హిత పుణ్యపాక
కైకఁ గన్గొను" మంచు గద్గద కంఠుఁ - డై కడపట శోక మగ్గలంబైన
నూరక యున్నచో నూరార్చి యతని - నాఋషి భావికార్యముఁ జూచి పలికె

భావం: "ఓ ధీరాత్మ! అందరిలోకి పెద్దది, పేరు ప్రతిష్ఠలు పొందినది, కడుపు చల్లగ రాముని కన్నది, వియోగమనే నిప్పుల బాధతో వేగిపోతున్నది, తన జన్మము సాఫల్యము చేసుకున్నది - కౌసల్య. ఇటు చూడు, ఆ కౌసల్య ఎడమ చేయి పట్టుకుని, చేతలుడిగి, ఎండిపోయిన పూలచెట్టుకొమ్మని పోలి, వాలిపోయి ఉన్నది, శ్రీరాముని విడచి ఉండలేని ఆ లక్ష్మణుని కన్నటువంటి పుణ్యాత్మురాలు - సుమిత్ర. హెచ్చరిక! మునీంద్ర! ఏ తల్లి కోసం అడవులగు వెళ్లాడో మా అన్న, ఏ తల్లి కారణంగా మా తండ్రి చనిపోయినాడో, ఏ తల్లి కోరిక వలన ఇంత దూరము వచ్చానో, ఈ తల్లి, మా తల్లి, మహా తల్లి - కైక, చూడుము" అంటూ గద్గదమైన కంఠంతో ఉన్న భరతుడిని, ఊరడించి ఆ ఋషి తరువాత జరుగబోవు విషయము గురించి ఇలా అన్నాడు...
కతము = కారణము
నీలుగు = చచ్చు
--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
Comments
Post a Comment