కిష్కింధా కాండ: 20-25 - ఋష్యమూక పర్వత ప్రాంతం చూసి శ్రీరాముని భావనలు - రంగనాథ రామాయణం
సందర్భము: ఋష్యమూక పర్వత ప్రాంతం సౌందర్యాన్ని చూసి శ్రీరాముని భావనలు.
కిష్కింధా కాండ: 20-25
సౌమిత్రి యిది వనస్థలి గాదు చూడఁ - గాముని యాయుధాగారంబు గాని
చింతింప నివి మావిచిగురులు గావు - కంతుని క్రొవ్వాడి కత్తులు గాని,
భావింప నివి పూవుబంతులు గావు - భావజాతుని వాడి బాణముల్ గాని,
యీయెడ భృంగఝంకృతు లివి గావు - డాయు మన్మథు చాప టంకృతు ల్గాని. -
వర్ణింప నివి పిక ధ్వనులుగా వతను - కర్ణకఠోర హుంకారము ల్గాని,
ఎటు గాన నావంటి యంగనా రహితు - లెటువలె వేగింతు రీకాననమునఁ

భావం: ఓ లక్ష్మణా! ఇది కేవలం వనము కాదు. చూస్తుంటే, మన్మథుని ఆయుధాగారం వలెనే ఉన్నది. ఇవి మావి చిగురులు కావు, అతని చురకత్తులు. ఇవి పూబంతులు కావు, అతని పదునైన బాణాలు. ఇవి తుమ్మెదల ఝంకారాలు కావు, అతని విల్లు నుంచి వచ్చే టంకార ధ్వనులు. ఇవి కోకిల రవములు కాదు, భరించలేని హుంకారములు. నాలాంటి భార్యా వియోగులు, ఎలా భరిస్తారో కదా ఈ మనోహరమైన అడవి యొక్క సౌందర్యాన్ని.
కాముడు, కంతుడు, భావజాతుడు = మన్మథుడు
డాయు = దాయు, సమీపించు
--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php
Comments
Post a Comment