అరణ్యకాండ: 1029-1041 - జానకి శోకించుట - రంగనాథ రామాయణం
సందర్భము: అపహరింపబడిన జానకి, విమానము నుండి సకల జీవరాశులకూ తన బాధ చెప్పుకుంటున్నది.
అరణ్యకాండ: 1029-1041
"మిథిలేశుకూఁతుర మేదినిఁ బంక్తి - రథునకుఁ గోడల రామునిదేవి
వలతుఁలై కావ నెవ్వరు లేనిచోటఁ - బొలదిండి చెఱఁగొని పోవుచున్నాఁడు
తరులార! నా సహోదరులార మీరు - ధరణీశ్వరుని తోడఁ దగఁ జెప్పరయ్య
సురలార! మీరైన సురవైరిఁ దాఁకి - వెరవొప్ప నాచెఱ విడిపింపరయ్య
నిండిన భక్తితో నిన్నాశ్రయించి - యుండితి ;ననుఁగావ నుచిత మీవేళఁ ;
దగిలి నీవైన గోదావరీదేవి - జగతీశ్వరునితోడఁ జని తెల్పవమ్మ
ప్రల్లదుచేఁ జెఱఁబడి చిక్కువడితిఁ - దల్లి నీవైనను దగఁ గావవలదె ?
భూదేవి! రఘురామ భూపాలమణికి - నీదురవస్థ పెంపెఱిఁగింపవమ్మ
వీరు వారనక యివ్విధమునఁ జీర - నోరెండె ధృతిఁదూలి నొచ్చెఁ బ్రాణములు ;
ననుఁ గావరయ్య కిన్నరులార! పుణ్య - తనులార! ఘనులార! తాపసులార!
కృతులార! హతులార! ఖేచరులార! - వ్రతులార! యతులార! వనపక్షులార!
కరులార! హరులార! గంధర్వులార! - నరులార! సురలార! నాగేంద్రులార!"
యని పెక్కుభంగుల నమ్మహితనయ - పొనుపడి శోకింప భూదేవి వడఁకె

భావం: నేను మిథిలాపూరాధీశుని కూతురును, దశరథుని కోడలను, శ్రీరాముని భార్యను, ఎవరూ లేనప్పుడు ఎత్తుకొనిపోతున్నాడు. ఓ చెట్లలారా! నా సహోదరులు మీరు, రామునికి చెప్పండి. ఓ దేవతలారా! ఈ రాక్షసుని బారి నుండి నన్ను విడిపంచండి. ఓ గోదావరీ దేవీ! నిన్ను భక్తితో సేవించాను. నీవైన రామునితో చెప్పవమ్మా. తల్లీ! భూదేవీ! నీవైనా రఘురామునికి నా దురవస్థ ఎరింగించవమ్మా. వీరూ వారు అంటూ పిలుస్తూ నా నోరు ఎండిపోయి, శరీరం తూలిపోతున్నది, ప్రాణాలు పోతున్నాయి. నన్ను రక్షించండి. ఓ కిన్నరులార! పుణ్యతనులార! ఘనులార! తాపసులార! కృతులార! హతులార! ఖేచరులార! - వ్రతులార! యతులార! వనపక్షులార! కరులార! హరులార! గంధర్వులార! - నరులార! సురలార! నాగేంద్రులార! - ఇలా ఆ అవనిజ బాధపడుతుంటే విని భూదేవి వణికిపోయింది.
--
పొలదిండి = రాక్షసుడు
ప్రల్లదుడు = దుష్టుడు
--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php
Comments
Post a Comment