607-618 : హనుమంతుడు అశోకవనాన్ని చెరచుట - రంగనాథ రామాయణం - ద్విపద కావ్యం

సందర్భం: హనుమంతుడు అశోకవనాన్ని పాడుచేయటం.

సుందరాకాండ: #607-#618

నిత్యమతి యశోకారామభూమి - మానై నహర్మ్యము హిఁ గూలఁ దన్ని 
యొర కేళీగృహంబులు నుగ్గుఁ జేసి - మహీరుహములు డి నేలఁ గలిపి 
కొమ్మలు ఖండించి కుసుమము లాల్చి - మ్మతేనెలు చల్లి కాలువ ల్చెఱిచి 
పూవుఁదీఁగెలు దెంచి పొదరిండ్లు చదిపి -  వాపులు గలఁచి దోర్బల కేళిఁ దేలి
కంఠ బకబిస కంఠికా క్రౌంచ - హంసశుకశారికామయూరాది 
పక్షు లా ర్తరాములతోఁ బాఱ - పాలకులు భీతి డి మేలుకాంచి .
నుమంతుసేఁతకు గ్నులై మండి - నుపమ కరవాల స్తులై కదియఁ 
 పేరు తనరాక నపరాక్రమము - వినఁ జెప్పి శ్రీరామవిభు కూర్మిబంట -
నొక్కొక్కరాక్షసు నొద్దండవృత్తి - నొక్కొక్క తరువుతో నొగిఁ గూలనేసి 
ప్రమసంగర కళాపారంభుఁ డగుచుఁ - బృథివిపైఁ బీనుఁగుఁబెంటలు గాఁగ 
భూరిసత్వంబులఁ బొలుపొందువారి - వీరుల నెనిమిదివేల రాక్షసులఁ 
మానతనయుఁ డ ప్రతిముఁడై పేర్చి - లీలఁ దెగటార్చి యార్చినఁ జూచి 
యేఱి ధృతిదూలి యినవంశుదేవి - కావున్న ఘోరరాక్షసభామ లరిగి

భావం: ఆ అశోకవనంలో ఉన్న అందమైన కట్టడాలను కూలదన్ని, ఆట స్థలాలను పిండిపిండి చేసి, వృక్షాలను నేలకూల్చి, కొమ్మలు ఖండించి, పూవులు రాల్చి, ఆ పూవులతేనెలు నేలమీద కాలువలుగా పారగా, పూవుతీగెలు తెంచి, పొదరిళ్లను త్రొక్కి, బావులు చెడగొట్టి, సకల పక్షులూ పారిపోవునట్లుగా చేసి, కాపలావారు కత్తులు పట్టుకని రాగా, హనుమంతుడు తన పేరు, తన రాక, తన పరాక్రమము చెప్పి ఒక్కొక్క రాక్షసుడినీ ఒక్కొక్క విధంగా ఒక్కొక్క చెట్టుతో కొట్టి, శవాలను కుప్పలు కుప్పలుగా చేసాడు. మొత్తం ఎనిమిది వేల మంది రాక్షసులను చంపుట చూసి,సీతమ్మ కాపలాగా ఉన్న రాక్షసస్త్రీలు వెళ్లి....

--
నుగ్గుచేయు = పొడిచేయు
చదియ  = చదును చేసి, నలగు చేసి
వాపి = బావి
పెంట = కుప్ప, పోగు

--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php

Comments