అయోధ్యాకాండ: 497-509 - శ్రీరాముడు కౌసల్యను ఊరడించుట - రంగనాథ రామాయణం

 సందర్భము: భర్తను విడచి, తనతో అడవులకు వచ్చెదనన్న కౌసల్యను, శ్రీరాముడు ఊరడించుట

అయోధ్యాకాండ: 497-509

నునయాలాప దీనాస్యుఁడై రాము - నియె నో యమ్మ! యిట్లాడంగఁ దగునె 
తియె ప్రాణపదంబు తియె చుట్టంబు - తియె దైవత మాత్మఁ రికింప నట్టి 
తిఁ బాసి నావెంటఁ ఱతెంతు ననుట - తిఁ దలంపఁగ ధర్మమా తల్లి నీకు
భావం: తల్లి దీనంగా అడుగగా, రాముడు ఇలా అన్నాడు, "అమ్మా! ఇలా మాట్లాడ తగునా? భర్త ప్రాణ సమానుడు, బంధువు, దైవము. భర్తను విడచి నాతో వస్తాను అనటం ధర్మమా?"

సుధేశు నానతి సుమతి భార - మెసఁగ నా భరతున కిచ్చుట తప్పె ?
నీశుఁ డిచ్చెద న్న వరంబు - వి రెండు కైకేయి డుగుట తప్పె ?
నృతంబునకు నోడి కట రాజేంద్రుఁ - డొరంగ వరము నిట్లొసఁగుట తప్పె ?
మా తండ్రి యానతి ది నిర్వహించి - యే తెఱంగునఁ బూను టిది నాకు దప్పె ?
భావం: "ఇచ్చిన మాట ప్రకారం రాజ్య భారము భరతునికి ఇవ్వటం తప్పా? తనకు ఇచ్చిన రెండు వరములను కైకేయి అడగటం తప్పా? ఇచ్చిన మాట ప్రకారం దశరథుడు వరములు ఇవ్వటం తప్పా? తండ్రి మాటను పాలించి నేను ఇలా పూనుకోవటం తప్పా?"

చే
కొని పతిపంపు చెల్లింపకున్న - నీకైనఁ దప్పదు నిక్కువం బరయఁ 
బోని కానల కేను బోయిన మిగుల - దీనుఁడై పొగలు పార్థివుని నీవెపుడు 
నునయించుచు సపర్యలు నొనర్పుచును - సునుమ్మలికంబు మాన్పంగ వలదె 
దురితదూరుండు బంధురనీతిరతుఁడు - తుండు నాకన్న క్తి నిన్నరయు 
నీవు శోకింపకు నీకలనై న - భావింప దశరథ తి యొప్పుఁ దనకు 
కైకేయి విడువక లిసి వర్తింపు - నాకు సేమము గోరి ను వీడుకొలుపు
భావం: "భర్త ఆజ్ఞను పాలించకపోతే నీకైనా తక్కువే కదా. పోనీ, నేను అడవులకు పోయిన తరువాత బాధపడే దశరథుని నీవు ఎల్లప్పుడూ అనునయిస్తూ, సపర్యలు చేస్తూ, మనసులోని బాధను తగ్గించాలి కదా? ఆ భరతుడు నాకన్నా ఎక్కువ భక్తితో నిన్ను చూసుకుంటాడు. నీవు శోకించకు. కైకేయితో విభేదించక కలిసి ఉండు. నా క్షేమము కోరి నాకు వీడ్కోలు చెప్పు."


ఇక్కువ = స్థానం


--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/

Comments