Posts

Showing posts with the label గోనబుద్ధారెడ్డి

యుద్ధకాండ: 310-314 - విభీషణుడు రావణాసురుని వారించుట

 సందర్భము: రావణాసురుడు మంత్రులతో కొలువుతీరి వారి ప్రతాపాలు వింటుండగా, విభీషణుడు యుద్ధం వద్దని వారిస్తున్నాడు. యుద్ధకాండ - 310-314 మే టి వానరు లిట  మీ ఱక మున్నె -  కో ట లు వారిచేఁ  గూ లకమున్నె,  సౌ మి త్రిబాణవ ర్ష ము రాకమున్నె -  రా ము నికోపాగ్ని  రాఁ జకమున్నె,  యా య గ్నిచే లంక  య డఁగకమున్నె -  యీ య సురావళి  యీ ల్గ కమున్నె,  సీ తఁ   బుచ్చుఁడు వేగ  శ్రీ రాముకడకు -  సీ తఁ   దెచ్చినకీడు  చేఁ   జేతఁ గుడుపు  ధ ర్మా త్ముఁ డౌ రామ  ధ రణీశ్వరుండు -  ధ ర్మం బువలననే  త గ నుండు జయము   భావం: ఆ వానర వీరులు చెలరేగక ముందే, కోటలు వారి ద్వారా కూలక మందే, లక్ష్మణుడి బాణవర్షము రాక ముందే, శ్రీరాముని కోపాగ్ని రాజుకోక మందే, ఆ అగ్నివలన లంకా నగరము నాశనము కాక ముందే, రాక్షసజాతి చనిపోక ముందే, వేగమే సీతను శ్రీరాముని వద్దకు పంపించు, సీతను తీసుకువచ్చిన పాపము అనుభవించు, ధర్మాత్ముడైన శ్రీరాముడుకు ధర్మము వలననే గెలుపు తధ్యము. ఈలుగు  = చచ్చు పుచ్చు  = పంపు -- రంగనాథ రామాయణం - PDF -  ht...

యుద్ధకాండ: 266-277 - రాక్షస వీరులు రావణునికి ప్రతాపములు చెప్పుట

సందర్భము: శ్రీరాముడు అటుతీరంలో కపివీరులతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడని రావణాసురుడు మంత్రులతో సమాలోచన ఏర్పాటు చేసాడు. రాక్షస వీరులందరూ కలసి తమ ప్రతాపము తెలియచేస్తున్నారు. నా ది గాఁ గల్గు మ హా దైత్యవరులు -  నా దై త్యవల్లభు  న గ్రభాగమునఁ  గ న్ను లఁ గోపంబు  గ డలుకొనంగ -  మి న్ను లు ముట్టంగ  మీ టి పల్కుచును  బ్ర ళ యావసర మహా ప వన నిర్ధూత  -  కు ల పర్వతములన  గుం భిని యదర  నొం డొ రుఁ జూచుచు  ను ద్దండవృత్తి -  నొం డొ రు మెచ్చక  యు గ్రత మెఱసి  యూ ర్పు లు నిగుడ న త్యు గ్రత మగ్గు -  స ర్పం బులును బోలె  స రభస వృత్తి . శూ లం బు లంకించి   సు రియలు బిగిచి -  వా ల ము ల్జళిపించి  వ ర తనుత్రాణ   స బ ళంబు అమరించి  చ క్రము ల్ద్రిప్పి -  ప్ర బ లంబు లగు భిండి వా లము ల్దిగిచి  ప ట్ట సం బెసఁగించి  ప్రా సము   ల్ద్రిప్పి  -  గ ట్టి  విండ్లు ను గుణ కం పము ల్చేసి  యు డు గక యెలుగు లొం డొం టితో రాయ -  మి డు గురు ల్మంటలు  మి క్కుటంబుగను  ఒం ...

యుద్ధకాండ - 104-115 - యుద్ధానికి కపివీరుల ఉత్సాహము

  సందర్భము: లంక మీదకు యుద్ధానికి సిద్ధం అవమని రాముని ఆజ్ఞ విని కపి వీరులు ఉత్సాహంతో బయలుదేరి నడుస్తున్నారు. యుద్ధకాండ:  104-115 న ప్పు డు కపివీరు   లం దఱు చెలఁగి -  య ప్ప రమేశ్వరుఁ   డా నందమొంద   నా ర వంబున మ్రోసె   నా కాశవీథి -  నా ర వంబున భూమి   య టునిటు పడియె   నా ర వంబు నఁ బెల్చ   న ద్రులు వణఁకె -  నా ర వంబున మ్రొగ్గె   నా దిగ్గజములు.   నా ర వంబున భార   మ య్యె శేషునకు -  నా ర వంబునఁ గూర్మ   మ ణఁచె శిరంబు   భావం: యుద్ధానికి శ్రీరాముని పిలుపును విన్న కపివీరులు ఉత్సాహంతో గర్జించారు. ఆ గర్జనకు దిక్కులు పిక్కటిల్లాయి. భూమి కంపించింది. పర్వతాలు ఊగిసలాడాయి. అష్టదిగ్గజాలు తలవంచాయి. భూమిని మోసే ఆదిశేషునికి బరువెక్కింది. ఆదికూర్మము తలవంచింది.   ఇ టు సేన నడవంగ   నె గసినధూళి -  ప ట లంబు మిన్నంది   బ హువర్ణములను   ఆ ర వంబున భార మై   యిల నెసఁగు -  తో రం పు నిశ్వాస  ధూ మంబు లనఁగ భావం: అశేషమైన వానర సేన నడుస్తుంటే పైకి ఎగసిన ధూళి, ఆ వీరులు భీకర గర్జనలకు భూమికి భార...

బాలకాండ: 465-472 - రావణాసురుని వరములు - రంగనాథ రామాయణం

 సందర్భము: దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి, తను ఇచ్చిన వరాల వలన విజృంభిస్తున్న రావణాసురుని గురించి బాధలు చెప్పుకున్నారు. బ్రహ్మదేవుడు వారికి రావణాసురుని వరాల గురించి తెలియజేస్తున్నాడు. బాలకాండ: 465-472 "య మ రులచేఁ జావఁ  డ సురులచేత -  స మ యఁడు గంధర్వ స మితిచేఁ జెడఁడు  ర జ నీచరుల చేత  గ్రా గ డెన్నఁడును -  భు జ గ సంఘములచేఁ  బొ లియఁ డెన్నఁడును  య క్షు లచే నీల్గఁ  డా లంబు లోనఁ -  బ క్షి   యూథంబుచేఁ  బ డఁడు, వానికిని  వ ర మిచ్చునప్పుడు  వా క్రువ్వఁ డయ్యె -  న రు లఁ గావున వాఁడు  న రులచేఁజచ్చు  వి శ దంబుగా నింక  వి నుఁడు హిరణ్య -  క శి పుఁడు లోకముల్  గా రించు నాఁడు  న ర సింహరూపంబు  నా రాయణుండు -  ధ రి యించి వాని వి దా రించినాఁడు   వాఁ డె   వీఁడై విశ్ర వ సునకుఁ బుట్టి -  వాఁ డు   గావున నేఁడు  నా రాయణుండు  వీ ని   నిర్జించు న వ్వి ష్ణుని నభయ -  దా నం బు మనమింకఁ  ద గ వేఁడవలయు" భావం: దేవతల చేత చావడు, అసురుల చేత నశించడు, గంధ...

బాలకాండ: 230-239 - అయోధ్యానగర వర్ణన - రంగనాథ రామాయణం

సందర్భము: అయోధ్యా నగర వర్ణన  బాలకాండ: 230-239 ద్వా ద శయోజనా త్యా యం బగుచు -  నై దు యోజనముల  న దివెడ ల్పగుకు ని పు ణత మయునిచే  ని ర్మితంబగుచు -   నె పు డు శాత్రవ కోటి  కె దురుచుక్క గుచు  కొ లఁ ది మీఱిన భాను కు లజులకెల్ల -  కు ల రాజధానియై  కొ నియాడఁ బరఁగి స ర యువు పొంత కో స లదేశమునను -  ధ ర ణికిఁ దొడ వయో ధ్యా పురం బొప్పు ; భావం: పన్నెండు యోజనాల పొడవు, ఐదు యోజనాల వెడల్పుతో, మయుని ద్వారా నిర్మించబడి, శత్రువలకు దుర్భేద్యమైనది, ఎందరో సూర్యవంశస్థులకు రాజధానిగా పేరొంది, సరయు నది ఒడ్డున, కోసల దేశములో అయోధాపురం భూమిపై గొప్పాగా ఉన్నది.  మ ణి గోపురంబుల  మ ణితోరణముల -  మ ణి కుట్టిమంబుల   మ ణిగవాక్షములఁ  గే ళి కా గృహములఁ  గృ తక శైలముల -  బా లా  నిలంబులఁ  బ టహ నాదముల  మ హి త వారణముల  మా నితాశ్వముల -  బ హు రథ ప్రతతుల  భ ట కదంబముల  వి మ ల సౌధంబుల  వి పణి మార్గములఁ -  గ మ నీయ వనములఁ  గ మలాకరములఁ జె ఱు వుల బావులఁ  జె ఱకుదోఁటలను -  ద ఱు చైన శాలి క...