936-952: హనుమంతుడు లంకను కాల్చుట - రంగనాథ రామాయణం - ద్విపద కావ్యం

 సందర్భము: హనుమంతుని తోకకు నిప్పుపెట్టారు. ఇక హనుమంతుడు, నిప్పుతొక్కిన కోతి చందాన, లంక మొత్తానికి నిప్పు పెడుతున్నాడు.

సుందరాకాండ: 936-952

యొచోటఁ దప్పక యుండ నాలంక - లంబుగాల్చి యుత్సవకేళిఁ దేలి 
యెపక పైవ్రాలు నెఱ మంటతునుక - లుడుగక మ్రోయుచు నొగి దూలి తూలి 
సోలి సురాపాన సుఖసుప్తి మునిఁగి - కాలు యెఱుఁగక కాలెడు వారు 
నాయెడ మృదుల శయ్యలయందు నిదుర - పోయి పోయినయట్లుఁ బొందులు నమలి
తమ బంధులఁ మ వధూమణులఁ - తమ బిడ్డలఁ మ ప్రాణసఖులఁ 
తమ వారలఁ గఁ దోడుకొనుచు - గుమురులుగట్టి యేగుచు మగ్గువారు. 
తెగి యిండ్ల సరుకులు దిగిచి తేఁబోయి - గిడి రానేరక మ్రగ్గెడువారు ;
తులఁ గౌఁగిటఁ జేర్చి రి తెచ్చితెచ్చిధృతి దూలి వాకిండ్లఁ ద్రెళ్ళెడువారు 
నై లంక ఘూర్జిల్ల నంతంతఁ గలయ - నాలోక భయదంబు లై మీఱిమీఱి
యురుసింహములఁ బోలె నుగ్రతఁ బట్టి - రి కుంభ విదళన తి మండిమండి; 
యో పెంపారు నాహుతుల చందమున - వాజుల మీఁదికి డి దాఁటి దాఁటి 
గిలించు వర విటోత్తముల చందమున - మొగి కామినీ కుచంబులఁ ద్రాకి ప్రాకి ;
భావించి యన్యులఁ బ్రహసించువారు - కై డి నాలుక ల్గఱచియు గఱచి 
గిలి సంతాపంబు లకొన్నవారు - మిగిలి యుబ్బెడుగతి మిన్నంది యంది 
బెలుకుఱి పఱతెంచు భీతుల పగిది - తొలఁగక నిగుడి గొందుదూరి దూరి 
వాలుచు నిబ్బంగి వాయునందనుని - వాలాగ్ను లొగి లంక డి చుట్టుఁ గాల్చె;

భావం: హనుమంతుడు ఒకచోటని కాకుండా, లంక మొత్తం కాల్చిపారేస్తున్నాడు. మంట తునుకలు ఒకచోటి నుండి మరొక చోటుకు తూలుతన్నందున నిప్పు ఆరటంలేదు. సురాపానము చేసి మైకంతో పడి ఉన్నవారు అలాగే కాలిపోతున్నారు. మెత్తటి మంచాలనందు పడుకున్నవారు, అలాగే చనిపోతున్నారు. బంధువులు, స్త్రీలు, బిడ్డలు తోడురాగా అందరూ కాలిపోతున్నారు. కాలుతున్న ఇళ్లలో సరుకులు తీసుకురాబోయి కొందరు మ్రగ్గిపోతున్నారు. భార్యలను కౌగిలిలో ఎత్తుకు రాబోయి, తూలి పడిపోయి కాలిపోతున్నారు. అందరూ భయాందోళనలకు గురి అవుతున్నారు. ఒక సింహము కోపంతో ఏనుగు కుంభస్థలం వేరుచేసినట్లు కాలుతూ. యజ్ఞ కుండములలో ఎగసిపడు ఆహుతిలాగా, గుర్రాలకన్నా వేగంగా దాటుకొని,  విటులు కామినుల మీదిమీది పోయినట్లుగా, ప్రక్కవారిని గేలిచేసేవారి నాలుకల వలె, అత్యంత దుఃఖంలో ఉన్నవారు వెక్కివెక్కి ఏడ్చునట్లుగా, భయపడి పారిపోయేవారి వలెనే ప్రక్క సందుల, గొందులలో దూరి - ఆ వాయుపుత్రుడు హనుమంతుని తోకకున్న నిప్పు లంకనంతా చుట్టివేసింది.

[ వాడిన పదాన్నే మరలమరల వాడి, లంకా దహనంలోని బీభత్సాన్ని, కవి కళ్లకు కడుతున్నాడు.]

--
ఎడపక = ఎడతెరిపి లేకుండగ
పైవ్రాలు = మీద పడు
ఒగి = వరుసగా, క్రమముగా
కమురులు = కాలినవి (వాసన వచ్చునట్లు)
యోజ = విధము
మొగివరుసగా, క్రమముగా
పెలుకుఱి = భయపడు, విలవలలాడు
పఱతెంచు = పారిపోవు
నిగుడి = వ్యాపించు

--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php


Comments