120-128 - నిద్రిస్తున్న రావణాసురుని వర్ణన - రంగనాథ రామాయణం - ద్విపద కావ్యం

సందర్భము: హనుమంతుడు లంకలో అంతఃపురము ప్రవేశించి అక్కడ నిద్రిస్తున్న రావణాసురుడిని చూసాడు.

సుందరాకాండ: #120-#128

బువ్వుపాన్పున నిద్రఁబోయెడువాని -వ్వాసవుని భోగ ణఁగించువాని
సంకెంపుల తోడ లదంబు వోలె -రంజిత గంధాంగ రాగంబువాని
నీటైన సెలయేర్ల నీలాద్రి వోలె - దే ముత్యపు పేర్లు దీపించువాని
నైదుమస్తముల ఘోరాహులఁ బోలెఁ - బ్రోది నంగుళి రమ్య భుజముల వాని
జిలుఁగు వెన్నెలతోడి చీఁకటివోలెఁ - లువ దుప్పటి మేన త నొప్పువానిఁ
వెదఱొమ్ముల నొప్పు వేల్పుటేనుంగు - డిది కొమ్మున పోటు కైపులవానిఁ
ర్పూర మణి దీపళిక లిర్వంక - నేర్పుమైఁ గదలించు నిట్టూర్చువాని
కుటకుండల దీప్తియమూర్తివాని - లారి గర్వనిస్రావణుండైన

భావం: పూల పాన్పు మీద నిద్రపోతున్న రావణాసురుడిని, ఆ ఇంద్రని భోగము అణగార్చినవాడిని,
సంధ్యాకాలపు ఎరుపు రంగుతో మెరుస్తున్న మేఘములాగా,  శరీరము నిండా చందనాది పరిమళాల పూతలతో, 
సెలయేర్లతో అలరారుతున్న నల్లటి పర్వతంలాగా, మేలిముత్యముల హారములుతో ప్రకాశించువాడిని,  
ఐదు తలకాయల ఏనుగు (ఐరావతం) యొక్క తొండము వలెనున్న  చక్కటి భుజాలతో ఉన్నవాడిని, 
మెరిసేటి వెన్నెలతో ఉన్న చీకటిలాగా చల్లటి దుప్పటి తన ఒంటి మీద కప్పుకొన్నవాడిని, 
విశాలమైన గుండెల మీద ఐరావతం యొక్క కొమ్ముల పోటు అందంగా ఉన్నవాడిని, 
తన నిట్టూర్పులతో ఇరు ప్రక్కలనున్న కర్పూర మణి దీపాలను కదలించువాడిని,
కిరీటము, కుండాలాల యొక్క ప్రకాశంతో నున్నవాడిని...

--
వాసవుడు = ఇంద్రుడు
ఘోరాహు = ఏనుగు (??)
ప్రోది = వైభవము
అంగుళి = తొండము చివర
వేల్పుటేనుంగు = ఐరావతం
ఇర్వంక = ఇరు వంక = ఇరు ప్రక్కల



--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php

Comments