64-68 : హనుమంతుడు లంకలో వెతకుట - 1 - రంగనాథ రామాయణం - ద్విపద కావ్యం
సందర్భము - హనుమంతుడు లంకలో సీతాదేవి కోసం, ముందుగా రాత్రిపూట మనుషులు లేని ప్రదేశాలన్నీ వెతికినాడు.
సుందరాకాండ: #64 - #68
వీథులు పరికించి విపణిమార్గములు - శోధించి రచ్చలు సొరిది నీక్షించి
ఘనగోపురము లెక్కి గజశాల లరసి - మునుమిడి వరహర్మ్యముల సంచరించి
దేవాలయంబులు తిరిగి యిల్లిల్లు - భావించి గొందులు పరికించి చూచి
యుప్పరిగెలు గాంచి యోసరు ల్నెమకి - చప్పరంబులు డాసి సౌధము ల్వెదకి
చాలఁజెన్నగు రథశాలలు వాజి - శాలలు శస్త్రాస్త్రశాలలుఁ దడవి

భావం : సాధారణ వీథులను, వ్యాపారవీథులను, రాజమార్గాలు వరుసగా వెతికి, ఎత్తైన గోపురాలు ఎక్కి ఏనుగు కొట్టాలను చూసి, గొప్ప భవనాలను తిరిగి, గుళ్లు, ఇళ్లు, సందులు, గొందులు జాగ్రత్తగా చూచి, మేడలు, పందిళ్లు, మిద్దెలు వెతికి, రథశాలలు, గుర్రపు శాలలు, ఆయుధాల శాలలు కూడా వెతికాడు.
--
సొరిది = వరుసగా, క్రమముగా
అరసి = వివరము తెలిసికొని
మునుమిడి = చక్కగా
ఉప్పరిగ = మేడలు
ఓసరు = తొలగు
నెమకు = వెతకు
చప్పరంబులు = పందిళ్లు
తడవు = వెదుకు
--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php
Comments
Post a Comment