కిష్కంధా కాండ: 1058-1065 - కపి వీరుల విచారము - రంగనాథ రామాయణం
సందర్భము: దక్షిణ దిశగా సుగ్రీవుడు పంపిన, అంగద, హనుమ, జాంబవంతాది కపి వరులు సీత జాడ తెలియక విచారిస్తూ ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమవుతున్నారు.
కిష్కంధా కాండ: #1058-1065
"నలినాప్త కులుఁడు కానలకు రానేల - కులభామ నసురచేఁ గోల్పడనేల
యొరసి దైత్యుఁడు జటాయువుఁ జంపనేల - ధరణీశుఁ డరుణ నందనుఁ గననేల .
ధరణిజ వార్త యాతఁడు చెప్పనేల - తరణివంశులు పంప దరికి రానేల
సుగ్రీపుకడకు రాసుతులు రానేల - సుగ్రీవుఁ డాతని సొమ్ము గానేల
వలనొప్పవాలి భూవరుఁ డేయనేల - బలిమితోడుతఁ గపిబలము రానేల
యినతనూజుఁడు మము నిటు పంపనేల - పనివడి మనకు నీపాటు రానేల
ఊనిన ప్రాణంబు లురక పోనేల - పోనేల యక్కటా భువికై కవరము
మనువంశ యుతముగా మనవంశ మణఁచె" - నని యని శోకించి యలయుచున్నంత

భావం: "ఆ రవి కులజుడు అడవులకు రావడం ఎందుకో, సీతను ఆ రాక్షసుడు ఎత్తుకుపోవడం ఎందుకో, ఆ దైత్యుడు జటాయువును చంపడం ఎందుకో, శ్రీరాముడు ఆ జటాయువును కలవడం ఎందుకో, అతడు సీత విషయం చెప్పడం ఎందుకో, ఆ రాకుమారులు పంపా సరస్సు దగ్గరకు ఎందుకు వచ్చారో, సుగ్రీవుడిని ఎందుకు కలిసారో, సుగ్రీవుడు శ్రీరామునికి బంటుగా ఎందుకు అయ్యాడో, వాలిని శ్రీరాముడు చంపడం ఎందుకో, అన్ని దిశలనుంచి కపి వీరులందరూ ఎందుకు వచ్చారో, సుగ్రీవుడు మనలను ఈ దక్షిణ దిశగా ఎందుకు పంపాడో, మనకు ఈ కష్టం రావడం ఎందుకో, ఉన్న ప్రాణాలు ఊరికనే పోవడం ఎందుకో, అయ్యో! మన వంశమంతా నశిస్తున్నదే!" - అంటూ కపి వీరులు విచారిస్తున్న సమయంలో...
--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php
Comments
Post a Comment