అరణ్యకాండ: 241-252 - హేమంత వర్ణన - రంగనాథ రామాయణం

 సందర్భం: ఉదయాన్నే, సీతా సమేత శ్రీరాముడు గౌతమీ నది తీరానికి స్నానానికి వెడుతూ, వెంటనే ఉన్న లక్ష్మణునితో చలికాలాన్ని వర్ణిస్తున్నాడు.

అరణ్యకాండ: 241-252

ది లెల్లఁ జలికి భీతిలి వెలిపట్టు - ముసుకు పెట్టినయట్లు ముంచె హిమంబు, 
భావం: దిక్కులన్నీ చలికి భయపడి తెల్లటి ముసుగు వేసుకున్నట్లు ఈ ప్రదేశాన్ని మంచు కప్పేసింది

హేమంత మను మేఘ మెల్లెడ నిండి - వామిగా వడగండ్లు ర్షించె ననఁగఁ
గురిసిన పెనుమంచు కుంభిని నెల్ల - నెసి యొప్పారె ఘనీభవించుచును 
భావం: హేమంతము అనే మేఘం, వడగండ్లు కురిపించినదా అన్నట్లుగా, ఆ మంచు, భూమి మీద నీటి బొట్లుగా ఘనీభవించినాయి.

ర్విపై నామంచు నొక్కొక్కచోట - దూర్వాంకురంబుల తుదలఁ జూచితివె ?
చ్చమిన్న సలాక పౌఁజుపై వేడ్కఁ - గ్రుచ్చిన ముత్యాల క్రోవలై యొప్పెఁ 
భావం: నేల మీద ఆ మంచు ఒక్కొక్క చోట, చిన్న చిన్న మొలకల అంచున, బంగారు కమ్మీ మీద వరుసాగా అమర్చిన మూత్యాల వలే ఉన్నాయి. 

గాము సమ్మోహన కాండంబు లనఁగఁ - హైమ యుగ్వాయువు అంతమై సోఁక
వెపున వణఁకెడు విరహిణు లనఁగఁ - దెఱఁగొప్పఁ గదలు పూదీఁగె వీక్షింపు ;
భావం: మన్నథుని సమ్మోహనాస్త్రం వలె, చలి గాలులు సోకగానే, విరహంతో అల్లాడే విరహిణులలాగా, ఊగుతున్న పూతీగ చూడు. 

మంచున జారు తారల కన్నీరు - ముంచిన విరహుల మోములఁ గేరు 
పొదిగొన్న యకరువుల్ పొట్టుగా మీఁదఁ - లు తేటుల పొగల్గా చలికొన్న
కొను దేవతలకుఁ గుంపట్లఁ బోలె - విసిల్లు కెందమ్మి విరులఁ జూచితివె ?
భావం: తామర పూవుల నుండి జారుతున్న మంచు బిందువులు, విరహంతో ఉన్న వారి ముఖాన కన్నీరు లాగా, ఈ కొలను పైన తేలియాడుతున్న కమలాల పుప్పొడి, దేవతల మనస్సులలోని కుంపట్ల నుండి వచ్చే పొగ వలే, మన్మథుని పూలబాణాల వలే (మనోహరంగా) ఉన్నది.

వియేనుఁగులు నీరాస నీనదికిఁ - దుడిఁ దుడి వచ్చి తత్తోయంబు దొడరి 
రి గిఱ్ఱనుచు దంములు వేవేగ - ముడిచి పాఱెడిని తమ్ముడ విలోకింపు
భావం: అడవిలో ఉన్న ఏనుగులు నీటి కోసం ఈ నదికి గబ గబా వచ్చి, తొండాలతో వేగంగా ముడిచి పైన పోసుకోవడం చూడు, తమ్ముడా!

--
సలాక = (బంగారు) కమ్మి
పౌజు = వరుస
అకరువు = తామర పూవుల మధ్యభాగం
పొదిగొను = చుట్టుకొను
కేరు = పరిహసించు, విజృంభించు

--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/
అర్ధాలు - https://andhrabharati.com/dictionary/index.php

Comments