అరణ్యకాండ: 1110-1119 - సీత ఆభరణములు ఋష్యమూక పర్వతం మీద వేయుట - రంగనాథ రామాయణం

 సందర్భము: సీత తన ఆభరణములు మూట గట్టి ఋష్యమూక పర్వతం మీద వేయుట.

అరణ్యకాండ: 1110-1119

నిమిష పథమున కంత రావణుఁడు - న రయంబున సీత రణ నూపురము -
సువైరి కుత్పాత సూచకం బగుచు - నురువడిఁ జనుదెంచి యుల్కయై పడియె 
తిపై జాహ్నవి లధార లొలుకు - గిది నయ్యాకాశథమున నుండి
చెలువ కుచంబులఁ జెందుహారములు - దెలియ కందంద మేదినిఁ దెగిపడియె
నాలోన సీత హాహారవం బంది - లోలోనఁ గడు నడలుచుఁ బోయి పోయి 
 ఋశ్యమూకంబు నందు వానరులు - టుసత్త్వులేవురఁ రికించి కాంచి
వస్త్రమునఁ గొంత గఁ జించి పుచ్చి - న భూషణంబులు దానె బంధించి, 
వీరైన రామ భూవిభున కీవార్త - లాయఁ దెలుపరే నుబుద్ధి నపుడు 
యక రాముచే శకంఠుఁ డింకఁ - జెడు నంచు ముడియు వైచిన విధంబునను 
వారిమధ్యంబున వైచుచుఁ బోవ - వారును దాఁచిరి డిఁ బుచ్చి దాని

భావం: ఆకాశమార్గాన రావణుడు, సీతను అపహరించి తీసుకుని వెడుతున్నప్పుడు, ఆ రాక్షసునికి అశుభసూచకంలాగా, సీత కాలి మువ్వ జారి ఆకాశంలో ఉల్కలాగా పడిపోయింది. భూమి మీదికి గంగా ప్రవాహం వచ్చు రీతిగా ఆకాశం నుండి ఆమె గుండెల మీది హారములు నేల మీదకు తెగి పడిపోయినాయి. సీత, క్రిందనున్న వానరులను చూసి, తన వస్త్రములో కొంత చించి, తన ఆభరణాలను మూటగా కట్టి, "వీరైనా శ్రీరామునకు ఈ వార్త తెలుపుతారేమో" అనుకుంటూ వారి మధ్యకు, రాముడు రావణాసురుడిని క్రిందకు పడగొట్టు విధముగా, క్రిందకు పడేసింది. వారు కూడా ఆ మూటను తీసుకుని దాచిపెట్టారు.

--

ఆరయు

--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/

Comments